- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Answers To Prayer గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఒకవేళ నీవు సర్వశక్తిమంతుని వైపు తిరిగితే, నీవు మళ్ళీ పునరుద్ధరించబడతావు: నీ గుడారంలో నుండి దుష్టత్వాన్ని నీవు తొలగించి
నీవు ఆయనకు ప్రార్థన చేస్తావు, ఆయన నీ మనవి వింటారు, నీవు నీ మ్రొక్కుబడులను చెల్లిస్తావు.
భక్తిహీనులు కొట్టివేయబడిన తర్వాత, దేవుడు వారి ప్రాణాలను తీసివేసిన తర్వాత వారికి ఇంకేమి ఆశ ఉంది?
వారి మీదికి ఆపద వచ్చినప్పుడు దేవుడు వారి మొర ఆలకిస్తారా?
దుర్మార్గుల గర్వం కారణంగా ప్రజలు మొరపెట్టినా ఆయన జవాబివ్వరు.
నిజానికి, వారి ఖాళీ మనవిని దేవుడు వినరు; సర్వశక్తిమంతుడు వాటిని లెక్క చేయడు.
యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి ఇచ్చారు. అతనికి గతంలో ఉన్నదానికన్నా రెండింతలు అధికంగా ఇచ్చారు.
ఎందుకంటే రక్తానికి ప్రతీకారం తీర్చుకునేవాడు జ్ఞాపకముంచుకుంటాడు; బాధితుల మొరను ఆయన విస్మరించరు.
నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను; సహాయం కోసం నా దేవున్ని వేడుకున్నాను. తన మందిరంలో నుండి ఆయన నా స్వరం విన్నారు; నా మొర ఆయన సన్నిధికి, ఆయన చెవులకు చేరింది.
మీరు నా శత్రువులు వెనుతిరిగి పారిపోయేలా చేశారు, నేను నా విరోధులను నాశనం చేశాను.
వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.
నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు; నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించారు.
యెహోవా కళ్లు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి మొరను వింటాయి;
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా కోసం ఓర్పుతో ఎదురుచూశాను; ఆయన నా వైపు తిరిగి నా మొరను ఆలకించారు.
ఆపద్దినాన నన్ను పిలువండి; నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నన్ను ఘనపరుస్తారు.”
నా హృదయంలో దుష్టత్వం ఉంటే, ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు.
నా ప్రార్థనను త్రోసివేయని తన మారని ప్రేమను నా నుండి తొలగించని, దేవునికి స్తుతి కలుగును గాక!
“అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను” అని యెహోవా అంటున్నారు; అతడు నా నామాన్ని గుర్తిస్తాడు, కాబట్టి నేను అతన్ని కాపాడతాను.
అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను; కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను, అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను.
దేవునికి చెందిన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు, యెహోవా నామాన ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు; వారు దేవునికి ప్రార్థన చేశారు, ఆయన జవాబిచ్చారు.
అయినా వారు మొరపెట్టగానే ఆయన విన్నాడు. వారి కష్టంను చూచాడు.
నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు; కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు.
ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి, నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.
నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను యెహోవా నేను మీ పేరట మొరపెడతాను.
నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను; ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు.