Skip to content

Answers To Prayer గురించి బైబిల్ వచనాలు: Moses

10 వచనాలు · 85 కోణాలు

Moses గురించి వచనాలు

  1. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టి, “ఈ ప్రజలతో నేనేం చేయాలి? వీరు దాదాపు నన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు” అన్నాడు.

  2. యెహోవా మోషేతో, “ప్రజలకు ముందుగా వెళ్లు. నీతో ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకుని నైలు నదిని కొట్టిన చేతికర్రను పట్టుకుని వెళ్లు.

  3. అక్కడ హోరేబులో బండ దగ్గర నేను నీకు ఎదురుగా నిలబడి ఉంటాను. నీవు ఆ బండను కొట్టు, ప్రజలు త్రాగడానికి ఆ బండ నుండి నీళ్లు వస్తాయి” అని చెప్పారు. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలు చూస్తుండగా యెహోవా చెప్పినట్టు చేశాడు.

  4. మోషే తన చేతులు పైకి ఎత్తినంతసేపు ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే తన చేతులు క్రిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచారు.

  5. మోషే చేతులు అలసిపోయినప్పుడు వారు ఒక రాయిని తెచ్చి అతని దగ్గర వేయగా అతడు దాని మీద కూర్చున్నాడు. అహరోను హూరులు అతనికి ఆ ప్రక్కన ఒకరు ఈ ప్రక్కన ఒకరు నిలబడి సూర్యుడు అస్తమించే వరకు మోషే చేతులు స్థిరంగా ఉండేలా పైకి ఎత్తి పట్టుకున్నారు.

  6. దాని ఫలితంగా యెహోషువ ఖడ్గంతో అమాలేకీయుల సైన్యాన్ని జయించాడు.

  7. అయితే మోషే తన దేవుడైన యెహోవా దయ కోసం మొరపెడుతూ, “యెహోవా, మీరు గొప్ప బలముతో బలమైన చేతితో ఈజిప్టులో నుండి రప్పించిన మీ ప్రజల మీద ఎందుకంత కోపం?

  8. ‘వారిని పర్వతాల మధ్య చంపాలని భూమి మీద ఉండకుండా వారిని నాశనం అయ్యేలా కీడు చేయడానికే ఆయన వారిని బయటకు రప్పించారని ఈజిప్టువారు ఎందుకు చెప్పుకోవాలి?’ రగులుతున్న నీ కోపాన్ని విడిచిపెట్టండి; మనస్సు మార్చుకోండి, మీ ప్రజలపై విపత్తును తీసుకురావద్దు.

  9. మీ సేవకులైన అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి, వారికి మీరే స్వయంగా ఇలా ప్రమాణం చేశారు: ‘నేను మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లా అసంఖ్యాకంగా చేసి వారికి ఇస్తానని నేను వాగ్దానం చేసిన ఈ దేశాన్నంతా మీ సంతానానికి ఇస్తాను, అది వారి వారసత్వంగా నిరంతరం ఉంటుంది.’ ”

  10. అప్పుడు యెహోవా మనస్సు మార్చుకొని తన ప్రజలకు తాను తెస్తానని చెప్పిన విపత్తును వారి మీదికి తేలేదు.