కంటెంట్‌కు వెళ్లండి

Alliance and Society with the Enemies of God గురించి బైబిల్ వచనాలు: Punishment of

15 వచనాలు · 51 కోణాలు

Punishment of గురించి వచనాలు

  1. అప్పుడు నేను వారికేమి చేయాలని అనుకున్నానో, అది మీకు చేస్తాను.’ ”

  2. ఎందుకంటే వారు నన్ను అనుసరించకుండా ఇతర దేవుళ్ళను సేవించేలా మీ పిల్లలను త్రిప్పివేస్తారు, అప్పుడు యెహోవా కోపం మీమీద రగులుకొని మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తుంది.

  3. మీ దేవుడైన యెహోవా ఇకపై ఈ దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టడని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికి బదులుగా, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగా, ఉచ్చులుగా, మీ వీపుపై కొరడాలుగా, మీ కళ్లల్లో ముళ్ళుగా మారుతారు.

  4. అంతేకాక నేను, ‘వారిని మీ ఎదుట నుండి తరమను; వారు మీకు ఉచ్చుగా ఉంటారు, వారి దేవుళ్ళు మీకు ఉరిగా మారుతారు’ అని చెప్పాను.”

  5. కాబట్టి ఇశ్రాయేలీయులు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయుల మధ్యలో నివసించారు.

  6. వారు వారి కుమార్తెలను పెళ్ళి కోసం తీసుకుని తమ కుమార్తెలను వారి కుమారులకు ఇచ్చారు, వారి దేవుళ్ళను సేవించారు.

  7. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టిలో చెడు కార్యాలు చేశారు; తమ దేవుడైన యెహోవాను మరచి బయలు అషేరా ప్రతిమలను సేవించారు.

  8. యెహోవా కోపం ఇశ్రాయేలుపై మీద రగులుకున్నందుకు ఆయన వారిని అరాము నహరయీము రాజైన కూషన్-రిషాతాయిముకు వారిని అమ్మేశారు, అతనికి వారు ఎనిమిది సంవత్సరాలు దాసులుగా ఉన్నారు.

  9. మా పూర్వికుల రోజులనుండి నేటివరకు మేము చాలా ఘోరమైన అపరాధాలు చేశాము. మా పాపం కారణంగా ఈ రోజు ఉన్నట్లు మేము, మా రాజులు, యాజకులు పరాయి రాజుల చేతి అప్పగించబడి ఖడ్గానికి, బానిసత్వానికి, దోపిడికి, అవమానానికి గురైయ్యాము.

  10. ఇంత జరిగాక, మేము మరలా మీ ఆజ్ఞలు పాటించకుండా ఇలాంటి అసహ్యకరమైన ఆచారాలు పాటించే ప్రజలతో వియ్యమందుతామా? మాలో ఒక్కరు తప్పించుకుని మిగిలిపోకుండ మీరు మమ్మల్ని నాశనం చేసేంతగా కోప్పడతారు గదా?

  11. ఇతర దేశాలకు వారిని అప్పగించాడు. అయినా వారి మీద ప్రభుత్వం చేశారు.

  12. శత్రువులే వారిని అణగద్రొక్కారు వారి చేతి క్రింద తల వొగ్గారు.

  13. కాబట్టి పశ్చాత్తాపపడు! లేకపోతే నేను త్వరలో నీ దగ్గరకు వచ్చినా నోటినుండి వచ్చే ఖడ్గంతో వారితో యుద్ధం చేస్తాను.

  14. కాబట్టి నేను ఆమెను శ్రమల పడకపై పడవేస్తాను. అలాగే ఆమెతో వ్యభిచరించిన వారు పశ్చాత్తాపపడకపోతే వారిని కూడా తీవ్రమైన బాధలకు గురిచేస్తాను.

  15. ఆమె పిల్లలను నేను మరణానికి అప్పగిస్తాను. అప్పుడు సంఘాలన్ని నేను అంతరంగాలను, హృదయాలను పరిశోధిస్తానని, మీలో అందరికి మీ క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తానని తెలుసుకుంటాయి.