కంటెంట్‌కు వెళ్లండి

Alliance and Society with the Enemies of God గురించి బైబిల్ వచనాలు: A call to come out from

7 వచనాలు · 51 కోణాలు

A call to come out from గురించి వచనాలు

  1. అతడు సమాజాన్ని హెచ్చరించాడు, “ఈ దుష్టుల డేరాల నుండి దూరంగా వెళ్లండి! వారికి చెందిన దేన్ని తాకకండి, లేదా వారి పాపాలన్నిటిని బట్టి మీరు తుడిచివేయబడతారు.”

  2. ఇప్పుడు మీ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించండి, ఆయన చిత్తం చేయండి. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజల నుండి, మీ పరాయి దేశపు భార్యల నుండి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి” అని చెప్పాడు.

  3. “బబులోను నుండి పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! దాని పాపాలను బట్టి నాశనం కాకండి. ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం; దానికి తగిన ప్రతిఫలం ఆయన చెల్లిస్తారు.

  4. “నా ప్రజలారా, దాని నుండి బయటకు రండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! యెహోవా కోపాగ్ని నుండి పారిపోండి.

  5. కాబట్టి, “వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్రమైన దానిని తాకకండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.

  6. సహోదరీ సహోదరులారా, మీరు మా నుండి పొందిన బోధల ప్రకారం జీవించక, తమ పనులను చూసుకోక సోమరులుగా బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి మీరు దూరంగా ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము.

  7. అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: “ ‘నా ప్రజలారా! మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా’ ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాకుండా, ఆమెలో నుండి బయటకు రండి;