కంటెంట్‌కు వెళ్లండి

Alliance and Society with the Enemies of God గురించి బైబిల్ వచనాలు: Forbidden

17 వచనాలు · 51 కోణాలు

"Alliance and Society with the Enemies of God" కోసం వెతకండి

Forbidden గురించి వచనాలు

  1. వారితో గాని వారి దేవుళ్ళతో గాని ఎలాంటి ఒడంబడిక చేసుకోవద్దు.

  2. మీరు వెళ్లబోతున్న దేశంలో నివసిస్తున్న వారితో సంధి చేసుకోకుండ జాగ్రత్తపడండి, లేకపోతే వారు మీ మధ్య ఉరిగా ఉంటారు.

  3. మీ దేవుడైన యెహోవా వారిని మీకు అప్పగించగా, మీరు వారిని ఓడించినప్పుడు, వారిని పూర్తిగా నాశనం చేయాలి. వారితో సంధి చేసుకోకూడదు వారిని కరుణించకూడదు.

  4. వారితో పెళ్ళి సంబంధాలు పెట్టుకోవద్దు. వారి కుమారులకు మీ కుమార్తెలను ఇవ్వకూడదు, మీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకోకూడదు,

  5. మీ సొంత సోదరుడు లేదా మీ కుమారుడు గాని కుమార్తె గాని, లేదా మీరు ప్రేమిస్తున్న భార్య లేదా మీ ప్రాణస్నేహితుడు గాని రహస్యంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి, “మనం వెళ్లి ఇతర దేవుళ్ళను (మీకు గాని మీ పూర్వికులకు తెలియని దేవుళ్ళు, మీ చుట్టూ ఉన్న, మీకు దగ్గరగా ఉన్న, దూరంగా ఉన్న ప్రజల దేవుళ్ళు, భూమి ఒక చివరి నుండి ఇంకొక చివరి వరకు ఉన్న దేవుళ్ళు) సేవిద్దాం” అని చెప్తే,

  6. మీరు వారి మాటలు అంగీకరించవద్దు, వారి మాట వినవద్దు. వారి మీద జాలి చూపవద్దు. వారిని విడిచిపెట్టవద్దు, వారిని కాపాడవద్దు.

  7. “దృఢంగా ఉండండి; మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా జాగ్రత్తగా పాటించండి.

  8. మీ మధ్య ఉన్న ఈ దేశాలతో సహవాసం చేయవద్దు; వారి దేవతల పేర్లు ఎత్తవద్దు; వాటిపై ప్రమాణం చేయవద్దు. మీరు వాటిని సేవించవద్దు లేదా వాటికి నమస్కరించవద్దు.

  9. మీరు ఈ దేశస్థులతో నిబంధన చేసుకోవద్దు, కాని వారి బలిపీఠాలను పడగొట్టాలి’ అని ఆజ్ఞ ఇచ్చాను. అయినా మీరు నా మాట వినలేదు. మీరెందుకు ఇలా చేశారు?

  10. కాబట్టి మీ కుమార్తెలకు వారి కుమారులతో గాని, మీ కుమారులకు వారి కుమార్తెలతో గాని పెళ్ళి చేయవద్దు. ఎప్పటికీ వారితో స్నేహ ఒప్పందం కోరవద్దు, అప్పుడు మీరు బలవంతులుగా ఉండి, ఆ దేశంలోని మంచి వాటిని తిని, మీ పిల్లలకు శాశ్వతమైన వారసత్వంగా దానిని అప్పగిస్తారు’ అని చెప్పారు.

  11. నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే, నీవు వారికి లొంగిపోవద్దు.

  12. నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి, వారి దారుల్లో నీ పాదాలు పెట్టకు;

  13. అవిశ్వాసులతో సహవాసం చేయకండి. ఎందుకంటే నీతి అవినీతి ఎలా కలిసి ఉంటాయి? చీకటి వెలుతురు ఎలా కలిసి ఉంటాయి?

  14. క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఏమిటి?

  15. దేవాలయాలకు విగ్రహాలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటి? మనం జీవంగల దేవుని ఆలయమై ఉన్నాము. కాబట్టి దేవుడు ఇలా చెప్పారు: “నేను వారితో నివసిస్తాను వారి మధ్య నడుస్తాను, నేను వారి దేవునిగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”

  16. కాబట్టి, “వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్రమైన దానిని తాకకండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.

  17. నిష్ఫలమైన చీకటి క్రియలలో పాల్గొనకుండా వాటిని బట్టబయలు చేయండి.