కంటెంట్‌కు వెళ్లండి

Alliance and Society with the Enemies of God గురించి బైబిల్ వచనాలు: Exhortations to shun all inducements to

9 వచనాలు · 51 కోణాలు

"Alliance and Society with the Enemies of God" కోసం వెతకండి

Exhortations to shun all inducements to గురించి వచనాలు

  1. నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే, నీవు వారికి లొంగిపోవద్దు.

  2. ఒకవేళ వారు, “మాతో కూడా రా; నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి దాగి ఉందాం; హాని చేయని ప్రాణం మీద ఆకస్మిక దాడి చేద్దాం;

  3. పాతాళం వలె మనుష్యులు జీవించి ఉండగానే వారిని పూర్తిగా మ్రింగివేద్దాం, సమాధిలోనికి దిగువారి వలె పూర్ణబలంతో ఉండగానే వారిని మ్రింగివేద్దాం;

  4. అన్ని రకాల విలువైన వస్తువులు మనం తెచ్చి మన ఇళ్ళను దోపుడు సొమ్ముతో నింపుకొందాం;

  5. మాతో చీట్లు వేయండి; మనం దొంగిలించిన దానిని మనమందరం పంచుకుందాము.”

  6. నా పిల్లలారా, వారితో కలిసి వెళ్లకండి, వారి దారుల్లో నీ పాదాలు పెట్టకు;

  7. దుర్మార్గుల త్రోవలో నీ పాదం ఉంచవద్దు కీడుచేసేవారి మార్గంలో నడవవద్దు.

  8. దాన్ని నివారించు, దానిపై ప్రయాణించవద్దు; దాని నుండి తొలగిపోయి నీ మార్గంలో సాగిపో.

  9. కాబట్టి, ప్రియ స్నేహితుల్లారా, మీరు ముందుగా హెచ్చరించబడిన ప్రకారం మీ సుస్థిర స్థానం నుండి భ్రష్టులు కాకుండా, అన్యాయస్థుల తప్పిదాల వల్ల పెడత్రోవ పట్టి దుర్మార్గులు కాకుండా ఉండడానికి జాగ్రత్తగా ఉండండి.