- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 28:3సుమారు క్రీ.పూ. 1452
నీవు వారికి ఇలా చెప్పు: ‘ఇది మీరు యెహోవాకు సమర్పించాల్సిన హోమబలి: ప్రతిరోజు లోపం లేని ఏడాది గొర్రెపిల్లలు రెండు దహనబలిగా అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:4సుమారు క్రీ.పూ. 1452
ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి,
- సంఖ్యాకాండము 28:5సుమారు క్రీ.పూ. 1452
దానితో పాటు ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపి భోజనార్పణగా అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:6సుమారు క్రీ.పూ. 1452
ఇది సీనాయి కొండపై నియమించబడిన క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
- సంఖ్యాకాండము 28:7సుమారు క్రీ.పూ. 1452
దానితో పాటు ఒక పావు హిన్ పులియబెట్టిన పానీయాన్ని పానార్పణగా ప్రతి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి. పరిశుద్ధాలయం దగ్గర యెహోవాకు పానార్పణ పోయాలి.
- సంఖ్యాకాండము 28:8సుమారు క్రీ.పూ. 1452
సాయంకాలం రెండవ గొర్రెపిల్లతో కలిపి ఉదయకాలం అర్పించినట్లే భోజనార్పణను పానార్పణను అర్పించాలి. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.
- సంఖ్యాకాండము 28:9సుమారు క్రీ.పూ. 1452
“ ‘సబ్బాతు దినాన, లోపం లేని ఒక ఏడాది వయస్సు ఉన్న రెండు గొర్రెపిల్లలను, వాటితో పాటు పానార్పణం, భోజనార్పణగా ఒలీవనూనెతో కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:10సుమారు క్రీ.పూ. 1452
ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:11సుమారు క్రీ.పూ. 1452
“ ‘ప్రతి నెల మొదటి రోజు యెహోవాకు లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, యేడు ఏడాది మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:12సుమారు క్రీ.పూ. 1452
ప్రతి కోడెతో పాటు ఒలీవనూనె కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండితో భోజనార్పణ ఉండాలి; పొట్టేలుతో పాటు, నూనె కలిపిన రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి భోజనార్పణగా ఉండాలి;
- సంఖ్యాకాండము 28:13సుమారు క్రీ.పూ. 1452
అలాగే ప్రతి గొర్రెపిల్లతో పాటు, నూనె కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని భోజనార్పణగా సమర్పించాలి. ఇది దహనబలి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలి.
- సంఖ్యాకాండము 28:14సుమారు క్రీ.పూ. 1452
ప్రతి కోడెతో పాటు పానార్పణగా అర హిన్ ద్రాక్షరసం ఉండాలి; పొట్టేలుతో పాటు, హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం; ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం అర్పించాలి. సంవత్సరంలో ప్రతి అమావాస్యకు అర్పించాల్సిన దహనబలి ఇది.
- సంఖ్యాకాండము 28:15సుమారు క్రీ.పూ. 1452
క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, దాని పానార్పణంతో పాటు, యెహోవాకు పాపపరిహారబలిగా ఒక మేకపోతును అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:16సుమారు క్రీ.పూ. 1452
“ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు యెహోవా యొక్క పస్కా పండుగ ఆచరించాలి.
- సంఖ్యాకాండము 28:17సుమారు క్రీ.పూ. 1452
ఆ నెల పదిహేనవ రోజు ఒక పండుగ జరగాలి; ఏడు రోజులు పులియని రొట్టెలు తినాలి.
- సంఖ్యాకాండము 28:18సుమారు క్రీ.పూ. 1452
మొదటి రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, పనులేవీ చేయకూడదు.
- సంఖ్యాకాండము 28:19సుమారు క్రీ.పూ. 1452
యెహోవాకు హోమబలిగా లోపం లేని రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడాది వయస్సున్న ఏడు మగ గొర్రెపిల్లలు దహనబలిగా అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:20సుమారు క్రీ.పూ. 1452
ప్రతి కోడెతో పాటు ఒలీవనూనెతో కలిపిన మూడు ఓమెర్ల నాణ్యమైన పిండిని భోజనార్పణగా అర్పించాలి; పొట్టేలుతో, రెండు ఓమెర్లు;
- సంఖ్యాకాండము 28:21సుమారు క్రీ.పూ. 1452
ఏడు గొర్రెపిల్లలలో ఒక్కో దానితో ఒక్కో ఓమెరు అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:22సుమారు క్రీ.పూ. 1452
మీ ప్రాయశ్చిత్తం కోసం ఒక మేకపోతును పాపపరిహారబలిగా అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:23సుమారు క్రీ.పూ. 1452
ఇవన్నీ ప్రతి ఉదయం దహన బలులతో పాటు అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:24సుమారు క్రీ.పూ. 1452
ఈ విధంగా ఏడు రోజులపాటు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండే ఆహార అర్పణను అర్పించాలి; ప్రతిరోజు అర్పించే దహనబలి దాని పానార్పణంతో పాటు దీనిని అర్పించాలి.
- సంఖ్యాకాండము 28:25సుమారు క్రీ.పూ. 1452
ఏడవ రోజు పరిశుద్ధ సభను నిర్వహించాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
- సంఖ్యాకాండము 28:26సుమారు క్రీ.పూ. 1452
“ ‘ప్రథమ ఫలాల రోజున, వారాల పండుగలో యెహోవాకు క్రొత్త ధాన్యంతో భోజనార్పణ అర్పించినప్పుడు పరిశుద్ధ సభ ఏర్పాటు చేయాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు.
- సంఖ్యాకాండము 28:27సుమారు క్రీ.పూ. 1452
రెండు కోడెలు, ఒక పొట్టేలు, ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలను యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే దహనబలిగా అర్పించాలి.