- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 27:1సుమారు క్రీ.పూ. 1452
యోసేపు కుమారుడైన మనష్షే వంశానికి చెందిన మనష్షే కుమారుడైన మాకీరు, అతని కుమారుడు గిలాదు, అతని కుమారుడు హెఫెరు, అతని కుమారుడైన సెలోఫెహాదు కుమార్తెలు. ఆ కుమార్తెల పేర్లు మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు ముందుకు వచ్చి
- సంఖ్యాకాండము 27:2సుమారు క్రీ.పూ. 1452
సమావేశ గుడార ద్వారం దగ్గర మోషే, యాజకుడైన ఎలియాజరు, నాయకులు సమాజమంతటి ఎదుట నిలబడి,
- సంఖ్యాకాండము 27:3సుమారు క్రీ.పూ. 1452
“మా తండ్రి అరణ్యంలో చనిపోయాడు. అతడు యెహోవాకు విరుద్ధంగా తిరుగుబాటు చేసిన కోరహు సమూహంలో లేడు, కానీ తన సొంత పాపాన్ని బట్టి చనిపోయాడు, అతనికి కుమారులు లేరు.
- సంఖ్యాకాండము 27:4సుమారు క్రీ.పూ. 1452
కుమారులు లేనందుకు మా తండ్రి పేరు అతని వంశం నుండి తీసివేయబడాలి? మా తండ్రి బంధువుల్లో మాకు స్వాస్థ్యం ఇవ్వండి” అని అన్నారు.
- సంఖ్యాకాండము 27:5సుమారు క్రీ.పూ. 1452
మోషే ఈ విషయాన్ని యెహోవా దగ్గరకు తెచ్చాడు,
- సంఖ్యాకాండము 27:6సుమారు క్రీ.పూ. 1452
యెహోవా మోషేతో అన్నారు,
- సంఖ్యాకాండము 27:7సుమారు క్రీ.పూ. 1452
సెలోఫెహాదు కుమార్తెలు చెప్పేది న్యాయమైనదే. నీవు వారికి తమ తండ్రి బంధువుల్లో వారసత్వంగా స్వాస్థ్యం ఖచ్చితంగా ఇచ్చి వారి తండ్రి వారసత్వాన్ని వారికి ఇవ్వాలి.
- సంఖ్యాకాండము 27:8సుమారు క్రీ.పూ. 1452
“ఇశ్రాయేలీయులతో చెప్పు, ‘ఒక మనిషి చనిపోతే, అతనికి కుమారులు లేకపోతే, అతని వారసత్వం అతని కుమార్తెకు ఇవ్వాలి.
- సంఖ్యాకాండము 27:9సుమారు క్రీ.పూ. 1452
ఒకవేళ అతనికి కుమార్తెలు లేకపోతే, అతని వారసత్వం అతని సహోదరులకు ఇవ్వాలి.
- సంఖ్యాకాండము 27:10సుమారు క్రీ.పూ. 1452
ఒకవేళ సహోదరులు లేకపోతే, వారసత్వం అతని తండ్రి సహోదరులకు ఇవ్వాలి.
- సంఖ్యాకాండము 27:11సుమారు క్రీ.పూ. 1452
అతని తండ్రికి సహోదరులు లేకపోతే, తన వారసత్వం సమీప బంధువుకు ఇవ్వాలి, అతడు స్వాస్థ్యంగా పొందుకుంటాడు. ఇది ఇశ్రాయేలీయుల కోసం యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన న్యాయ నియమము.’ ”
- సంఖ్యాకాండము 27:12సుమారు క్రీ.పూ. 1452
యెహోవా మోషేతో అన్నారు, “నీవు అబారీము పర్వతం ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు.
- సంఖ్యాకాండము 27:13సుమారు క్రీ.పూ. 1452
చూసిన తర్వాత, నీవును నీ అన్న అహరోను లాగే చనిపోయి స్వజనుల దగ్గరకు చేరతావు.
- సంఖ్యాకాండము 27:14సుమారు క్రీ.పూ. 1452
ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం నీళ్ల దగ్గర తిరుగుబాటు చేసినప్పుడు, మీరిద్దరు వారి దృష్టిలో నన్ను పరిశుద్ధునిగా గౌరవించకుండా అవిధేయత చూపారు.” (ఈ నీళ్లు సీను అరణ్యంలో మెరీబా కాదేషు నీళ్లు.)
- సంఖ్యాకాండము 27:15సుమారు క్రీ.పూ. 1452
మోషే యెహోవాతో అన్నాడు,
- సంఖ్యాకాండము 27:16సుమారు క్రీ.పూ. 1452
“సమస్త జీవులకు శ్వాసనిచ్చే దేవుడైన యెహోవా, ఈ సమాజం మీద ఒక నాయకుని నియమించాలి,
- సంఖ్యాకాండము 27:17సుమారు క్రీ.పూ. 1452
అతడు ఈ సమాజం ముందు వెళ్తూ, వస్తూ, వారిని బయటకు లోనికి నడిపిస్తూ ఉండాలి, అప్పుడు యెహోవా ప్రజలైన వీరు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”
- సంఖ్యాకాండము 27:18సుమారు క్రీ.పూ. 1452
కాబట్టి యెహోవా మోషేతో అన్నారు, “నూను కుమారుడైన యెహోషువను తీసుకో, అతనిలో నాయకత్వపు ఆత్మ ఉంది, అతని మీద నీ చేయి పెట్టు.
- సంఖ్యాకాండము 27:19సుమారు క్రీ.పూ. 1452
యాజకుడైన ఎలియాజరు సమాజమందరి సముఖంలో అతన్ని నిలబెట్టి, అధికార పూర్వకంగా నియమించు.
- సంఖ్యాకాండము 27:20సుమారు క్రీ.పూ. 1452
నీ ప్రభావంలో కొంత అతనికి ఇవ్వు, అప్పుడు ఇశ్రాయేలు సమాజమంతా అతనికి లోబడుతుంది.
- సంఖ్యాకాండము 27:21సుమారు క్రీ.పూ. 1452
అతన్ని యాజకుడైన ఎలియాజరు ఎదుట నిలబెట్టు, ఎలియాజరు యెహోవా సన్నిధిలో ఊరీముతో సంప్రదించి అతని కోసం చట్టాలు పొందుకోవాలి. అతని ఆజ్ఞమేరకు అతడు, ఇశ్రాయేలు సమాజమంతా బయటకు వెళ్తుంది, అతని ఆజ్ఞమేరకు వారు లోనికి వస్తారు.”
- సంఖ్యాకాండము 27:22సుమారు క్రీ.పూ. 1452
యెహోవా ఆజ్ఞమేరకు మోషే చేశాడు. యెహోషువను యాజకుడైన ఎలియాజరు ముందు, సర్వసమాజం ముందు నిలబెట్టాడు.
- సంఖ్యాకాండము 27:23సుమారు క్రీ.పూ. 1452
తర్వాత యెహోవా మోషేకు సూచించిన ప్రకారం అతనిపై చేతులుంచి అధికార పూర్వకంగా అతన్ని నియమించాడు.
- సంఖ్యాకాండము 28:1సుమారు క్రీ.పూ. 1452
యెహోవా మోషేతో ఇలా అన్నారు,
- సంఖ్యాకాండము 28:2సుమారు క్రీ.పూ. 1452
“నీవు ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞలిస్తూ వారితో ఇలా చెప్పు: ‘నియమింపబడిన సమయంలో నాకు ఇష్టమైన సువాసనగా ఉండే హోమబలులు అర్పించేలా చూసుకోండి.’