కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లూకా 1:27సుమారు క్రీ.పూ. 5

    దావీదు వంశస్థుడైన యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే కన్య దగ్గరకు పంపారు.

  2. లూకా 1:28సుమారు క్రీ.పూ. 5

    ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, “బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు” అని చెప్పాడు.

  3. లూకా 1:29సుమారు క్రీ.పూ. 5

    అతని మాటలకు మరియ చాలా కలవరపడి, ఇది ఎటువంటి శుభవచనమో అని ఆశ్చర్యపడింది.

  4. లూకా 1:30సుమారు క్రీ.పూ. 5

    అయితే ఆ దూత ఆమెతో, “మరియా, భయపడకు; నీవు దేవుని దయను పొందుకొన్నావు.

  5. లూకా 1:31సుమారు క్రీ.పూ. 5

    నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి.

  6. లూకా 1:32సుమారు క్రీ.పూ. 5

    ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతారు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనాన్ని ఆయనకు ఇస్తారు.

  7. లూకా 1:33సుమారు క్రీ.పూ. 5

    ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.

  8. లూకా 1:34సుమారు క్రీ.పూ. 5

    మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది.

  9. లూకా 1:35సుమారు క్రీ.పూ. 5

    అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.

  10. లూకా 1:36సుమారు క్రీ.పూ. 5

    నీ బంధువురాలు ఎలీసబెతు కూడ తన ముసలితనంలో గర్భం ధరించింది, పిల్లలు పుట్టరు అని ఎవరి గురించైతే అనుకున్నారో, ఆమెకు ఇప్పుడు ఆరో నెల నిండింది.

  11. లూకా 1:37సుమారు క్రీ.పూ. 5

    ఎందుకంటే దేవుని నుండి వచ్చే ఏ మాట నెరవేరక మానదు” అన్నాడు.

  12. లూకా 1:38సుమారు క్రీ.పూ. 5

    అందుకు మరియ, “నేను ప్రభువు దాసురాలను, నీవు చెప్పిన ప్రకారం నాకు జరుగును గాక” అని అన్నది. తర్వాత దూత వెళ్లిపోయాడు.

  13. లూకా 1:39సుమారు క్రీ.పూ. 5

    కొన్ని రోజుల తర్వాత మరియ సిద్ధపడి యూదయ కొండ ప్రాంతంలో ఉన్న పట్టణానికి వెళ్లింది,

  14. లూకా 1:40సుమారు క్రీ.పూ. 5

    అక్కడ ఆమె జెకర్యా ఇంటికి వెళ్లి ఎలీసబెతుకు వందనాలు చెప్పింది.

  15. లూకా 1:41సుమారు క్రీ.పూ. 5

    ఎలీసబెతు మరియ చెప్పిన వందనాలను వింటున్నప్పుడు, ఆమె గర్భంలోని శిశువు గంతులేసాడు, ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నింపబడింది.

  16. లూకా 1:42సుమారు క్రీ.పూ. 5

    ఆమె పెద్ద స్వరంతో: “స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు!

  17. లూకా 1:43సుమారు క్రీ.పూ. 5

    నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడానికి, నేను ఏపాటిదానను?

  18. లూకా 1:44సుమారు క్రీ.పూ. 5

    నీవు చెప్పిన వందనం నా చెవిని చేరగానే, నా గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేశాడు.

  19. లూకా 1:45సుమారు క్రీ.పూ. 5

    ప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది.

  20. లూకా 1:46సుమారు క్రీ.పూ. 5

    అందుకు మరియ: “నా ఆత్మ ప్రభువును మహిమపరుస్తుంది.

  21. లూకా 1:47సుమారు క్రీ.పూ. 5

    నా రక్షకుడైన దేవునిలో నా ఆత్మ సంతోషిస్తుంది.

  22. లూకా 1:48సుమారు క్రీ.పూ. 5

    తన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,

  23. లూకా 1:49సుమారు క్రీ.పూ. 5

    ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు.

  24. లూకా 1:50సుమారు క్రీ.పూ. 5

    తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది.

  25. లూకా 1:51సుమారు క్రీ.పూ. 5

    ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు; తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు.