కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లూకా 1:52సుమారు క్రీ.పూ. 5

    సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు.

  2. లూకా 1:53సుమారు క్రీ.పూ. 5

    ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు, కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు.

  3. లూకా 1:54సుమారు క్రీ.పూ. 5

    ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ, మన పితరులకు వాగ్దానం చేసినట్లు, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.”

  4. లూకా 1:55సుమారు క్రీ.పూ. 5

    As he spake to our fathers, to Abraham, and to his seed for ever.

  5. లూకా 1:56సుమారు క్రీ.పూ. 5

    మరియ దాదాపు మూడు నెలలు ఎలీసబెతుతో ఉండి తన ఇంటికి తిరిగి వెళ్లింది.

  6. లూకా 1:57సుమారు క్రీ.పూ. 5

    ఎలీసబెతుకు నెలలు నిండినప్పుడు, ఆమె ఒక కుమారుని కన్నది.

  7. లూకా 1:58సుమారు క్రీ.పూ. 5

    ప్రభువు ఆమెపై ఈ గొప్ప కరుణను చూపించాడన్న సంగతిని విన్న ఇరుగుపొరుగువారు బంధువులు, ఆమెతో కలిసి సంతోషించారు.

  8. లూకా 1:59సుమారు క్రీ.పూ. 5

    ఎనిమిదవ రోజున శిశువుకు సున్నతిచేసి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని పేరు పెడుతుండగా,

  9. లూకా 1:60సుమారు క్రీ.పూ. 5

    తల్లి, “వద్దు! బాబును యోహాను అని పిలువాలి” అని చెప్పింది.

  10. లూకా 1:61సుమారు క్రీ.పూ. 5

    అందుకు వారు ఆమెతో, “మీ బంధువుల్లో ఎవ్వరికి ఆ పేరు లేదు కదా” అన్నారు.

  11. లూకా 1:62సుమారు క్రీ.పూ. 5

    వారు ఈ బాబుకు ఏ పేరు పెట్టాలని తండ్రికి సైగ చేసి అడిగారు.

  12. లూకా 1:63సుమారు క్రీ.పూ. 5

    అందుకతడు ఒక పలకను అడిగి, “బాబు పేరు యోహాను” అని దానిపై వ్రాసినప్పడు వారందరు ఆశ్చర్యపడ్డారు.

  13. లూకా 1:64సుమారు క్రీ.పూ. 5

    వెంటనే అతని నోరు తెరుచుకుంది అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు.

  14. లూకా 1:65సుమారు క్రీ.పూ. 5

    ఇరుగుపొరుగు వారందరు భయంతో నిండిపోయారు, యూదయ కొండ ప్రాంత ప్రజలందరు ఈ సంగతుల గురించి చెప్పుకొన్నారు.

  15. లూకా 1:66సుమారు క్రీ.పూ. 5

    ఇది విన్న ప్రతి ఒక్కరు దాని గురించి ఆశ్చర్యపడి, “ఈ బిడ్డ ఏమవుతాడో?” అనుకున్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం బిడ్డకు తోడుగా ఉన్నది.

  16. లూకా 1:67సుమారు క్రీ.పూ. 5

    తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రవచించాడు:

  17. లూకా 1:68సుమారు క్రీ.పూ. 5

    “ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడును గాక, ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించారు.

  18. లూకా 1:69సుమారు క్రీ.పూ. 5

    దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మన కోసం రక్షణ కొమ్మును మొలిపించారు.

  19. లూకా 1:70సుమారు క్రీ.పూ. 5

    As he spake by the mouth of his holy prophets, which have been since the world began:

  20. లూకా 1:71సుమారు క్రీ.పూ. 5

    మన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు,

  21. లూకా 1:72సుమారు క్రీ.పూ. 5

    మన పితరులకు దయ చూపడానికి తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి:

  22. లూకా 1:73సుమారు క్రీ.పూ. 5

    మన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా,

  23. లూకా 1:74సుమారు క్రీ.పూ. 5

    మన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి, మనం భయపడకుండా ఆయనను సేవించాలని,

  24. లూకా 1:75సుమారు క్రీ.పూ. 5

    బ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట పరిశుద్ధత నీతి కలిగి జీవించాలని విమోచించారు.

  25. లూకా 1:76సుమారు క్రీ.పూ. 5

    “నా బిడ్డా, నీవు, మహోన్నతుని ప్రవక్తవని పిలువబడతావు; ప్రభువుకు ముందుగా నీవు ఆయన కోసం మార్గం సిద్ధం చేస్తావు.