కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. లూకా 1:2సుమారు క్రీ.పూ. 5

    Even as they delivered them unto us, which from the beginning were eyewitnesses, and ministers of the word;

  2. లూకా 1:3సుమారు క్రీ.పూ. 5

    It seemed good to me also, having had perfect understanding of all things from the very first, to write unto thee in order, most excellent Theophilus,

  3. లూకా 1:4సుమారు క్రీ.పూ. 5

    That thou mightest know the certainty of those things, wherein thou hast been instructed.

  4. లూకా 1:5సుమారు క్రీ.పూ. 5

    యూదయదేశపు రాజైన హేరోదు రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన ఒక యాజకుడు ఉన్నాడు, అతని పేరు జెకర్యా; అతని భార్య అహరోను యాజక వంశీయురాలు, ఆమె పేరు ఎలీసబెతు.

  5. లూకా 1:6సుమారు క్రీ.పూ. 5

    వారిద్దరు ప్రభువు ఆజ్ఞలను, శాసనాలను నిందారహితంగా అనుసరిస్తూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు.

  6. లూకా 1:7సుమారు క్రీ.పూ. 5

    అయితే ఎలీసబెతు గొడ్రాలు కాబట్టి వారికి పిల్లలు కలుగలేదు, పైగా వారిద్దరు చాలా వృద్ధులు.

  7. లూకా 1:8సుమారు క్రీ.పూ. 5

    ఒకసారి జెకర్యా వారి శాఖ విధుల్లో ఉన్నప్పుడు అతడు దేవుని ఎదుట యాజకునిగా పరిచర్య చేస్తున్నాడు,

  8. లూకా 1:9సుమారు క్రీ.పూ. 5

    యాజకులు వారి సాంప్రదాయం ప్రకారం చీట్లు వేసినప్పుడు, అతనికి ప్రభువు మందిరంలోనికి వెళ్లి ధూపం వేసే వంతు వచ్చింది.

  9. లూకా 1:10సుమారు క్రీ.పూ. 5

    ధూపం వేసే సమయం వచ్చినప్పుడు, సమాజ ప్రజలందరు బయట ప్రార్థిస్తున్నారు.

  10. లూకా 1:11సుమారు క్రీ.పూ. 5

    ప్రభువు దూత ధూపవేదికకు కుడి వైపున నిలబడి, అతనికి ప్రత్యక్షమయ్యాడు.

  11. లూకా 1:12సుమారు క్రీ.పూ. 5

    జెకర్యా అతన్ని చూసి, ఉలిక్కిపడి, భయంతో బిగుసుకుపోయాడు.

  12. లూకా 1:13సుమారు క్రీ.పూ. 5

    ఆ దూత అతనితో, “జెకర్యా భయపడకు; నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి.

  13. లూకా 1:14సుమారు క్రీ.పూ. 5

    అతడు నీకు సంతోషాన్ని ఆనందాన్ని కలుగ చేస్తాడు, అలాగే అనేకులు అతని పుట్టుకను బట్టి సంతోషిస్తారు.

  14. లూకా 1:15సుమారు క్రీ.పూ. 5

    ఎందుకంటే ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడవుతాడు. అతడు ద్రాక్షరసం కానీ మద్యం కానీ త్రాగకూడదు, అతడు పుట్టక ముందే పరిశుద్ధాత్మచేత నింపబడతాడు.

  15. లూకా 1:16సుమారు క్రీ.పూ. 5

    ఇశ్రాయేలీయుల్లోని చాలామందిని అతడు వారి ప్రభువైన దేవుని వైపుకు త్రిప్పుతాడు.

  16. లూకా 1:17సుమారు క్రీ.పూ. 5

    అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం వైపుకు త్రిప్పి, ప్రజలను ప్రభువు కోసం సిద్ధపరచడానికి ఏలీయా యొక్క ఆత్మతో శక్తితో ప్రభువుకు ముందుగా వెళ్తాడు” అన్నాడు.

  17. లూకా 1:18సుమారు క్రీ.పూ. 5

    అందుకు జెకర్యా ఆ దూతతో, “ఇది జరుగుతుందని నేను ఎలా నమ్మాలి? నేను ముసలివాన్ని, నా భార్య వయస్సు కూడా మీరిపోయింది” అన్నాడు.

  18. లూకా 1:19సుమారు క్రీ.పూ. 5

    అందుకు ఆ దూత అతనితో, “నేను గబ్రియేలును. నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాను, నీతో మాట్లాడి నీకు ఈ శుభవార్త చెప్పడానికి నేను నీ దగ్గరకు పంపబడ్డాను.

  19. లూకా 1:20సుమారు క్రీ.పూ. 5

    నేనిప్పుడు నీతో చెప్పిన మాటలను నీవు నమ్మలేదు, కాబట్టి నిర్ణీత సమయంలో ఇది జరిగే వరకు, నీవు మూగవానిగా మౌనంగా ఉంటావు” అన్నాడు.

  20. లూకా 1:21సుమారు క్రీ.పూ. 5

    అంతలో, ప్రజలు జెకర్యా కోసం ఎదురుచూస్తూ దేవాలయంలో అతడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు.

  21. లూకా 1:22సుమారు క్రీ.పూ. 5

    అతడు బయటకు వచ్చాక, అతడు వారితో మాట్లాడలేకపోయాడు. అతడు తమతో మాట్లాడటానికి బదులు సైగలు చేస్తూ ఉండడంతో, అతడు దేవాలయంలో దర్శనం చూశాడని వారు గ్రహించారు.

  22. లూకా 1:23సుమారు క్రీ.పూ. 5

    అతని సేవ కాలం పూర్తయినప్పుడు, అతడు ఇంటికి వెళ్లిపోయాడు.

  23. లూకా 1:24సుమారు క్రీ.పూ. 5

    ఆ తర్వాత అతని భార్య ఎలీసబెతు గర్భం ధరించి అయిదు నెలల వరకు ఇతరులకు కనబడకుండా ఉండింది.

  24. లూకా 1:25సుమారు క్రీ.పూ. 5

    ఆమె, “ప్రభువే నా కోసం ఈ కార్యం చేశారు, ఈ దినాల్లో ఆయన నన్ను కరుణించి, నా ప్రజలమధ్య నాకున్న అవమానం తొలగించారు” అని అన్నది.

  25. లూకా 1:26సుమారు క్రీ.పూ. 5

    ఎలీసబెతు గర్భవతియైన ఆరో నెలలో, దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామానికి,