కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మార్కు 2:10సుమారు క్రీ.శ. 31

    అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో,

  2. మార్కు 2:11సుమారు క్రీ.శ. 31

    “నేను చెప్తున్న. నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు.

  3. మార్కు 2:12సుమారు క్రీ.శ. 31

    అతడు లేచి, తన పరుపెత్తుకొని అందరు చూస్తుండగానే నడిచి వెళ్లాడు. అది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడి, “ఇలాంటివి ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు!” అని చెప్తూ దేవుని స్తుతించారు.

  4. మార్కు 2:13సుమారు క్రీ.శ. 31

    యేసు మరొకసారి సరస్సు తీరానికి వెళ్లారు. అక్కడ ఒక గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వచ్చింది, ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు.

  5. మార్కు 2:14సుమారు క్రీ.శ. 31

    ఆయన మార్గంలో నడుస్తుండగా, పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడగు లేవీని చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు, లేవీ లేచి ఆయనను వెంబడించాడు.

  6. మార్కు 2:15సుమారు క్రీ.శ. 31

    లేవీ ఇంట్లో యేసు భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు, ఆయనను వెంబడించేవారు చాలామంది అక్కడ ఉన్నారు.

  7. మార్కు 2:16సుమారు క్రీ.శ. 31

    పరిసయ్యులైన ధర్మశాస్త్ర ఉపదేశకులు అతన్ని పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి తినడం చూసి, “ఆయన పన్ను వసూలు చేసేవారితో పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు.

  8. మార్కు 2:17సుమారు క్రీ.శ. 31

    అది విని, యేసు వారితో, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు, పాపులను పిలువడానికి వచ్చాను” అన్నారు.

  9. మార్కు 2:18సుమారు క్రీ.శ. 31

    యోహాను శిష్యులు పరిసయ్యులు ఉపవాసం ఉన్నారు. కొందరు వచ్చి, “యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు కాని, నీ శిష్యులు ఉండడం లేదు ఎందుకు?” అని యేసును అడిగారు.

  10. మార్కు 2:19సుమారు క్రీ.శ. 31

    అందుకు యేసు, “పెండ్లికుమారుడు తమతో ఉన్నప్పుడు అతని అతిథులు ఎందుకు ఉపవాసం ఉంటారు? అతడు తమతో కూడ ఉన్నంత వరకు, వారు ఉపవాసం ఉండరు.

  11. మార్కు 2:20సుమారు క్రీ.శ. 31

    అయితే పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది, ఆ రోజున వారు ఉపవాసం ఉంటారు.

  12. మార్కు 2:21సుమారు క్రీ.శ. 31

    “ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, అలా చేస్తే, క్రొత్త బట్టముక్క పాత బట్ట నుండి పిగిలిపోతూ చినుగును మరి ఎక్కువ చేస్తుంది.

  13. మార్కు 2:22సుమారు క్రీ.శ. 31

    ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి, ద్రాక్షరసం, తిత్తులు రెండూ పాడైపోతాయి. అందుకే, వారు క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోస్తారు” అని చెప్పారు.

  14. మార్కు 2:23సుమారు క్రీ.శ. 31

    ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయనతో పాటు నడుస్తున్న శిష్యులు, కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు.

  15. మార్కు 2:24సుమారు క్రీ.శ. 31

    అది చూసిన పరిసయ్యులు, “చూడు, ఎందుకు వారు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?” అని ఆయనతో అన్నారు.

  16. మార్కు 2:25సుమారు క్రీ.శ. 31

    అందుకు ఆయన, “దావీదుకు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా?

  17. మార్కు 2:26సుమారు క్రీ.శ. 31

    ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినాల్లో, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకుని తాను తిని, తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు” అని జవాబిచ్చారు.

  18. మార్కు 2:27సుమారు క్రీ.శ. 31

    ఆయన వారితో, “మనుష్యుల కోసం సబ్బాతు దినం కాని, సబ్బాతు దినం కోసం మనుష్యులు నియమించబడలేదు.

  19. మార్కు 2:28సుమారు క్రీ.శ. 31

    కాబట్టి మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి కూడ ప్రభువు” అని చెప్పారు.

  20. మార్కు 3:1సుమారు క్రీ.శ. 31

    మరొకసారి యేసు సమాజ మందిరంలోకి వెళ్లినప్పుడు, అక్కడ చేతికి పక్షవాతం కలవాడు ఒకడున్నాడు.

  21. మార్కు 3:2సుమారు క్రీ.శ. 31

    వారిలో కొందరు యేసు మీద నేరం మోపడానికి కారణం కోసం వెదుకుతున్నారు, కాబట్టి వారు సబ్బాతు దినాన ఆయన స్వస్థపరుస్తారేమో అని దగ్గర నుండి ఆయనను గమనిస్తున్నారు.

  22. మార్కు 3:3సుమారు క్రీ.శ. 31

    చేతికి పక్షవాతం గలవానితో యేసు, “అందరి ముందు నిలబడు” అన్నారు.

  23. మార్కు 3:4సుమారు క్రీ.శ. 31

    అప్పుడు ఆయన, “సబ్బాతు దినాన ఏది న్యాయం: మంచి చేయడమా లేదా చెడు చేయడమా, ప్రాణం రక్షించడమా లేదా ప్రాణం తీయడమా?” అని వారిని అడిగారు కాని వారు మౌనంగా ఉన్నారు.

  24. మార్కు 3:5సుమారు క్రీ.శ. 31

    ఆయన కోపంతో చుట్టూ ఉన్నవారిని చూసి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి బాధతో నొచ్చుకుని, చేతికి పక్షవాతం గలవానితో, “నీ చేయి చాపు” అన్నారు. వాడు దాన్ని చాపగానే, వాని చేయి పూర్తిగా బాగయింది.

  25. మార్కు 3:6సుమారు క్రీ.శ. 31

    అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్లి హేరోదు వర్గానికి చెందిన వారితో కలిసి యేసును ఎలా చంపుదామా అని కుట్రపన్నడం మొదలుపెట్టారు.