కంటెంట్‌కు వెళ్లండి

circa 6 BC – AD 30

The Life of Jesus

The eternal Son of God enters history: born in Bethlehem, baptized in the Jordan, crucified at Golgotha, raised on the third day.

3,779 వచనాలు · 4 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మార్కు 3:7సుమారు క్రీ.శ. 31

    యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్లారు, అలాగే గలిలయ నుండి గొప్ప జనసమూహం ఆయనను వెంబడించింది.

  2. మార్కు 3:8సుమారు క్రీ.శ. 31

    ఆయన చేస్తున్న గొప్ప కార్యాల గురించి ప్రజలు విని, చాలామంది యూదయ, యెరూషలేము, ఇదూమయ, యొర్దాను అంతటా తూరు, సీదోను చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి ఆయన దగ్గరకు వచ్చారు.

  3. మార్కు 3:9సుమారు క్రీ.శ. 31

    జనసమూహం కారణంగా ఆయన తన శిష్యులతో, తన కోసం ఒక చిన్న పడవను సిద్ధం చేయమని చెప్పారు.

  4. మార్కు 3:10సుమారు క్రీ.శ. 31

    ఆయన చాలామందిని స్వస్థపరిచారు, కాబట్టి వ్యాధులు ఉన్నవారు ఆయనను ముట్టుకోవాలని ముందుకు వస్తున్నారు.

  5. మార్కు 3:11సుమారు క్రీ.శ. 31

    అపవిత్రాత్మలు ఆయనను చూడగానే, ఆయన ముందు సాగిలపడి, “నీవు దేవుని కుమారుడవు” అని కేకలు వేశాయి.

  6. మార్కు 3:12సుమారు క్రీ.శ. 31

    అయితే ఆయన తన గురించి ఇతరులకు చెప్పవద్దని వారికి ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు.

  7. మార్కు 3:13సుమారు క్రీ.శ. 31

    ఆ తర్వాత యేసు కొండెక్కి తనకు ఇష్టమైన వారిని పిలిచారు, వారు ఆయన దగ్గరకు వచ్చారు.

  8. మార్కు 3:14సుమారు క్రీ.శ. 31

    తనతో ఉండడానికి, ప్రకటించడానికి తాను బయటకు పంపడానికి ఆయన పన్నెండుమందిని నియమించుకొని

  9. మార్కు 3:15సుమారు క్రీ.శ. 31

    దయ్యాలను వెళ్లగొట్టే అధికారాన్ని వారికిచ్చారు.

  10. మార్కు 3:16సుమారు క్రీ.శ. 31

    ఆ పన్నెండుమంది ఎవరనగా: ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను,

  11. మార్కు 3:17సుమారు క్రీ.శ. 31

    జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను; (వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అనే పేరు పెట్టారు; దాని అర్థం “ఉరుము కుమారులు”),

  12. మార్కు 3:18సుమారు క్రీ.శ. 31

    అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, అత్యాసక్తి కలవాడైన సీమోను,

  13. మార్కు 3:19సుమారు క్రీ.శ. 31

    ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

  14. మార్కు 3:20సుమారు క్రీ.శ. 31

    తర్వాత యేసు ఒక ఇంట్లోకి వెళ్లినప్పుడు, ప్రజలు మరల గుంపుగా కూడి వచ్చారు, కాబట్టి ఆయన శిష్యులు భోజనం కూడా చేయలేకపోయారు.

  15. మార్కు 3:21సుమారు క్రీ.శ. 31

    అది విని ఆయన కుటుంబీకులు, “ఆయనకు మతిపోయింది” అని చెప్పి ఆయనను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

  16. మార్కు 3:22సుమారు క్రీ.శ. 31

    యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఇతడు బయెల్జెబూలు చేత పట్టబడినవాడు! దయ్యాల అధిపతి సహాయంతో దయ్యాలను వెళ్లగొడుతున్నాడు” అని అన్నారు.

  17. మార్కు 3:23సుమారు క్రీ.శ. 31

    కాబట్టి యేసు వారిని తన దగ్గరకు పిలుచుకొని వారితో ఉపమానరీతిగా మాట్లాడారు: “సాతాను సాతానును ఎలా వెళ్లగొట్టగలడు?

  18. మార్కు 3:24సుమారు క్రీ.శ. 31

    ఏ రాజ్యమైనా తనకు తానే వ్యతిరేకంగా ఉండి చీలిపోతే, ఆ రాజ్యం నిలువలేదు.

  19. మార్కు 3:25సుమారు క్రీ.శ. 31

    ఒక కుటుంబం తనకు తానే వ్యతిరేకంగా చీలిపోతే అది నిలబడదు.

  20. మార్కు 3:26సుమారు క్రీ.శ. 31

    అలాగే ఒకవేళ సాతాను తనను తానే వ్యతిరేకించుకొని చీలిపోతే, వాడు నిలువలేడు; వాని అంతం వచ్చినట్లే.

  21. మార్కు 3:27సుమారు క్రీ.శ. 31

    నిజానికి, బలవంతుడైనవాని మొదట కట్టివేయకుండ అతని ఇంట్లోకి ఎవరు ప్రవేశించలేరు. అతన్ని బంధిస్తేనే వాడు ఇంటిని దోచుకోగలడు.

  22. మార్కు 3:28సుమారు క్రీ.శ. 31

    ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది.

  23. మార్కు 3:29సుమారు క్రీ.శ. 31

    కాని, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ ఉండదు; వారు నిత్య పాపం చేసిన అపరాధులుగా ఉంటారని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.

  24. మార్కు 3:30సుమారు క్రీ.శ. 31

    “ఆయన అపవిత్రాత్మ పట్టినవాడు” అని వారు అంటున్నారు కాబట్టి యేసు ఈ విధంగా చెప్పారు.

  25. మార్కు 3:31సుమారు క్రీ.శ. 31

    ఆ తర్వాత యేసు తల్లి సహోదరులు వచ్చారు. వారు బయట నిలబడి, ఆయనను పిలువడానికి ఒకరిని లోపలికి పంపారు.