కంటెంట్‌కు వెళ్లండి

circa AD 30–62

The Early Church

Pentecost ignites a movement; Peter, Paul, and countless others carry the gospel from Jerusalem to the ends of the earth.

1,007 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. దీనిని గ్రహించిన తర్వాత, అతడు మార్కు అనబడే యోహాను తల్లియైన మరియ ఇంటికి వెళ్లాడు, అక్కడ చాలామంది విశ్వాసులు చేరి ప్రార్థన చేస్తున్నారు.

  2. పేతురు బయటి గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టాడు, అప్పుడు రోదె అనే పేరుగల ఒక సేవకురాలు తలుపు తీయడానికి వచ్చింది.

  3. ఆమె పేతురు స్వరాన్ని గుర్తుపట్టి, అత్యంత సంతోషంతో తలుపు తీయకుండానే వెనుకకు పరుగెత్తుకొని వెళ్లి, “పేతురు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు!” అని కేక వేసి చెప్పింది.

  4. వారు ఆమెతో, “నీకు పిచ్చి పట్టింది” అన్నారు. ఆమె అది నిజమని పట్టుబడుతూవుంటే వారు, “అది అతని దూతయై ఉండవచ్చు” అన్నారు.

  5. కానీ పేతురు తలుపు తట్టుతూనే ఉన్నాడు, వారు తలుపు తీసినప్పుడు అక్కడ పేతురును చూసి ఆశ్చర్యపడ్డారు.

  6. పేతురు, నెమ్మదిగా ఉండండని చేతితో సైగ చేసి ప్రభువు అతన్ని చెరసాలలో నుండి ఎలా బయటకు తీసుకుని వచ్చాడో వారికి వివరించాడు. “యాకోబుకు, ఇతర సహోదరి సహోదరులందరికి కూడా ఈ సంగతిని తెలియజేయండి” అని చెప్పి, అక్కడినుండి మరొక చోటికి వెళ్లాడు.

  7. తెల్లవారగానే పేతురుకు ఏమైనదని సైనికుల్లో చాలా గందరగోళం కలిగింది.

  8. హేరోదు పేతురు కోసం ఎంత వెదకినా కనబడలేదు, కాబట్టి అతడు కావలివారిని విచారించి, వారిని చంపమని ఆదేశించాడు. ఆ తర్వాత హేరోదు యూదయ ప్రాంతం నుండి కైసరయ పట్టణానికి వెళ్లి అక్కడ నివసించాడు.

  9. హేరోదు తూరు సీదోను పట్టణస్థులతో జగడమాడుతూ ఉండేవాడు; ఇప్పుడు వారంతా కలిసి రాజుతో మాట్లాడాలని భావించారు. వారు ఆహార సరఫరా కోసం హేరోదు రాజ్యం మీద ఆధారపడ్డారు, కాబట్టి రాజు యొక్క నమ్మకమైన వ్యక్తిగత సేవకుడైన బ్లాస్తు అనే వాని మద్ధతు పొందిన తర్వాత, పరిస్థితిని సమాధానపరచమని అడిగారు.

  10. నిర్ణయించబడిన రోజున హేరోదు, రాజ వస్త్రాలను ధరించుకొని, తన సింహాసనం మీద కూర్చుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు.

  11. అప్పుడు ప్రజలు, “ఇది మానవ స్వరం కాదు దేవుని స్వరమే!” అని కేకలు వేశారు.

  12. వెంటనే, హేరోదు దేవునికి ఘనత ఇవ్వని కారణంగా, ప్రభువు దూత అతన్ని కొట్టగా, అతడు పురుగులుపడి చనిపోయాడు.

  13. కానీ దేవుని వాక్యం అంతకంతకు వ్యాపిస్తూ ఉండింది.

  14. బర్నబా సౌలులు తమ పని ముగించిన తర్వాత, మార్కు అనబడే యోహానును వెంటబెట్టుకొని, యెరూషలేముకు తిరిగి వెళ్లారు.

  15. అంతియొకయ సంఘంలో ప్రవక్తలు బోధకులు ఉన్నారు. వారిలో కొందరు: బర్నబా, నీగెర అనబడే సుమెయోను, కురేనీకి చెందిన లూకియ, చతుర్థాధిపతి హేరోదుతో పాటు పెరిగిన మనయేను, సౌలు.

  16. ఒక రోజు వారు ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ, “నేను బర్నబా సౌలును పిలిచిన పని కోసం వారిని నా కోసం ప్రత్యేకపరచండి” అని చెప్పాడు.

  17. కాబట్టి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత వారి మీద చేతులుంచి వారిని సేవకు పంపించారు.

  18. వారిద్దరు పరిశుద్ధాత్మచే పంపబడిన తర్వాత, సెలూకయ పట్టణాన్ని దాటి ఓడలో కుప్ర ద్వీపానికి వెళ్లారు.

  19. వారు సలమీ పట్టణానికి చేరాక, దేవుని వాక్యాన్ని యూదుల సమాజమందిరాల్లో ప్రకటించారు. అప్పుడు మార్కు అనే యోహాను వారికి సహాయంగా ఉన్నాడు.

  20. వారు పాఫు అనే ఊరు వచ్చేవరకు ఆ ద్వీపమంతా తిరిగారు. అక్కడ వారు బర్ యేసు అనే పేరుగల యూదా మంత్రగాడైన ఒక అబద్ధ ప్రవక్తను కలుసుకొన్నారు.

  21. అతడు సెర్గియ పౌలు అనే రోమా అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి తెలివిగలవాడు, అతడు దేవుని వాక్యాన్ని వినాలని బర్నబాను సౌలును పిలిపించుకున్నాడు.

  22. అయితే ఎలుమ అనే మంత్రగాడు ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలనే ఉద్దేశంతో వారిని ఎదిరించాడు.

  23. అప్పుడు పౌలు అనబడే సౌలు పరిశుద్ధాత్మతో నింపబడి, ఎలుమ వైపు నేరుగా చూస్తూ,

  24. “నీవు సాతాను బిడ్డవు నీతికార్యాలన్నింటికి విరోధివి! నీవు అన్ని రకాల కపటంతో మోసంతో నిండి ఉన్నావు. ప్రభువు యొక్క సరియైన మార్గాలను చెడగొట్టడం మానవా?

  25. ఇదిగో, దేవుని హస్తం నీకు వ్యతిరేకంగా ఉంది. నీవు సూర్యుని కాంతిని కూడా చూడలేదా కొంతకాలం గ్రుడ్డివాడివి అవుతావు” అన్నాడు. వెంటనే అతని మీదికి మబ్బు వంటి చీకటి కమ్మింది, కాబట్టి అతడు తడుముకుంటూ తనను ఎవరైనా చేయి పట్టుకుని నడిపిస్తారని వెదకసాగాడు.