కంటెంట్‌కు వెళ్లండి

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నిర్గమకాండము 17:15సుమారు క్రీ.పూ. 1491

    మోషే ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెట్టారు.

  2. నిర్గమకాండము 17:16సుమారు క్రీ.పూ. 1491

    అతడు, “యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా తమ చేతిని పైకి ఎత్తారు, కాబట్టి యెహోవా అమాలేకీయులతో తరతరాల వరకు యుద్ధం చేస్తూనే ఉంటారు” అన్నాడు.

  3. నిర్గమకాండము 18:1సుమారు క్రీ.పూ. 1491

    కొంతకాలం గడిచిన తర్వాత మిద్యాను యాజకుడు, మోషేకు మామయైన యెత్రో, దేవుడు మోషేకు అతని ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినదంతటిని గురించి, యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు రప్పించిన సంగతి విన్నాడు.

  4. నిర్గమకాండము 18:2సుమారు క్రీ.పూ. 1491

    మోషే తన భార్య సిప్పోరాను పంపిన తర్వాత, అతని మామ యెత్రో ఆమెను చేర్చుకున్నాడు.

  5. నిర్గమకాండము 18:3సుమారు క్రీ.పూ. 1491

    మోషే, “నేను పరాయి దేశంలో విదేశీయునిగా ఉన్నాను” అని చెప్పి ఒక కుమారునికి గెర్షోము అని పేరు పెట్టాడు;

  6. నిర్గమకాండము 18:4సుమారు క్రీ.పూ. 1491

    మరొకనికి, “నా తండ్రి దేవుడు నాకు సహాయకుడు; ఫరో ఖడ్గం నుండి ఆయన నన్ను రక్షించారు” అని చెప్పి ఎలీయెజెరు అని పేరు పెట్టాడు.

  7. నిర్గమకాండము 18:5సుమారు క్రీ.పూ. 1491

    మోషే మామయైన యెత్రో మోషే కుమారులను అతని భార్యను తీసుకుని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర బస చేస్తున్న మోషే దగ్గరకు వచ్చాడు.

  8. నిర్గమకాండము 18:6సుమారు క్రీ.పూ. 1491

    “నీ మామనైన యెత్రో అనే నేను, నీ భార్యను నీ ఇద్దరు కుమారులను తీసుకుని నీ దగ్గరకు వస్తున్నాను” అని యెత్రో మోషేకు కబురు పంపాడు.

  9. నిర్గమకాండము 18:7సుమారు క్రీ.పూ. 1491

    కాబట్టి మోషే తన మామను ఎదుర్కోడానికి వెళ్లి నమస్కరించి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమాన్ని ఒకరు తెలుసుకొని గుడారంలోకి వెళ్లారు.

  10. నిర్గమకాండము 18:8సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల కోసం ఫరోకు ఈజిప్టువారికి చేసిన దాని గురించి, దారిలో తమకు ఎదురైన కష్టాల గురించి, యెహోవా తమను కాపాడిన విధానం గురించి మోషే తన మామకు వివరించాడు.

  11. నిర్గమకాండము 18:9సుమారు క్రీ.పూ. 1491

    ఈజిప్టువారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి యెహోవా చేసిన మేలులన్నిటిని విని యెత్రో ఎంతో సంతోషించాడు.

  12. నిర్గమకాండము 18:10సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు యెత్రో, “ఈజిప్టువారి చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఈజిప్టువారి చేతి క్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడును గాక.

  13. నిర్గమకాండము 18:11సుమారు క్రీ.పూ. 1491

    ఇశ్రాయేలీయుల పట్ల అహంకారంగా ప్రవర్తించిన వారికి ఆయన చేసిన దానిని బట్టి ఇతర దేవుళ్ళందరికంటే యెహోవాయే గొప్పవాడని నేనిప్పుడు తెలుసుకున్నాను” అన్నాడు.

  14. నిర్గమకాండము 18:12సుమారు క్రీ.పూ. 1491

    అప్పుడు మోషే మామయైన యెత్రో, ఒక దహనబలిని ఇతర బలులను దేవునికి అర్పించగా, దేవుని సన్నిధిలో మోషే మామతో కలిసి భోజనం తినడానికి అహరోను, ఇశ్రాయేలీయుల పెద్దలందరితో కలిసి వచ్చాడు.

  15. నిర్గమకాండము 18:13సుమారు క్రీ.పూ. 1491

    మర్నాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చడానికి తన స్థానంలో కూర్చున్నాడు, వారు ఉదయం నుండి సాయంత్రం వరకు అతని చుట్టూ నిలబడ్డారు.

  16. నిర్గమకాండము 18:14సుమారు క్రీ.పూ. 1491

    మోషే ప్రజలకు చేస్తున్న వాటన్నిటిని అతని మామ చూసినప్పుడు, అతడు, “నీవు ఈ ప్రజలకు చేస్తున్నది ఏమిటి? ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ప్రజలందరు నీ చుట్టూ నిలబడి ఉండగా, న్యాయాధిపతిగా నీవు ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు?” అని అడిగాడు.

  17. నిర్గమకాండము 18:15సుమారు క్రీ.పూ. 1491

    అందుకు మోషే అతనితో, “ఎందుకంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రజలు నా దగ్గరకు వస్తారు.

  18. నిర్గమకాండము 18:16సుమారు క్రీ.పూ. 1491

    వారికెప్పుడు ఏ వివాదం ఉన్నా, అది నా దగ్గరకు తేబడుతుంది, నేను వారి మధ్య నిర్ణయించిన దేవుని శాసనాలను, సూచనలను వారికి తెలియజేస్తాను” అని చెప్పాడు.

  19. నిర్గమకాండము 18:17సుమారు క్రీ.పూ. 1491

    అందుకు మోషే మామ, “నీవు చేస్తున్నది సరియైనది కాదు.

  20. నిర్గమకాండము 18:18సుమారు క్రీ.పూ. 1491

    నీవు, నీ దగ్గరకు వస్తున్న ఈ ప్రజలు అలసిపోతారు. ఈ పని నీకు చాలా భారంగా ఉంది; నీవు ఒక్కడివే దీనిని చేయలేవు.

  21. నిర్గమకాండము 18:19సుమారు క్రీ.పూ. 1491

    ఇప్పుడు నా మాట విను, నేను నీకొక సలహా ఇస్తాను, దేవుడు నీకు తోడుగా ఉండును గాక. నీవు దేవుని ఎదుట ప్రజల ప్రతినిధిగా ఉండి, వారి వివాదాలను ఆయన దగ్గరకు తీసుకురావాలి.

  22. నిర్గమకాండము 18:20సుమారు క్రీ.పూ. 1491

    ఆయన శాసనాలను సూచనలను నీవు వారికి బోధించి, వారు జీవించాల్సిన మార్గాన్ని వారికి చూపించు.

  23. నిర్గమకాండము 18:21సుమారు క్రీ.పూ. 1491

    దేవునికి భయపడే, అన్యాయపు లాభాన్ని అసహ్యించుకునే, నమ్మదగిన సామర్థ్యం కలిగిన పురుషులను ప్రజలందరిలో నుండి ఎంపికచేయాలి. తర్వాత వారిని వేయిమందికి, వందమందికి, యాభైమందికి, పదిమందికి ఒక అధికారి ప్రకారం అధికారులుగా నియమించాలి.

  24. నిర్గమకాండము 18:22సుమారు క్రీ.పూ. 1491

    వారు అన్ని వేళలా ప్రజలకు న్యాయాధిపతులుగా ఉండాలి, కాని ప్రతీ కఠిన సమస్యను నీ దగ్గరకు తీసుకువచ్చేలా చూడు, మామూలు సమస్యల విషయంలో వారే నిర్ణయించవచ్చు. ఈ విధంగా చేస్తే వారు నీతో పాటు నీ భారాన్ని పంచుకుంటారు, కాబట్టి నీకు భారం తగ్గుతుంది.

  25. నిర్గమకాండము 18:23సుమారు క్రీ.పూ. 1491

    ఒకవేళ నీవు ఇలా చేస్తే, దేవుడు అలాగే ఆజ్ఞాపిస్తే, నీవు ఈ ఒత్తిడిని తట్టుకోగలుగుతావు, అలాగే ఈ ప్రజలందరు కూడా సమాధానంగా తమ ఇళ్ళకు వెళ్తారు” అని అన్నాడు.