- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa AD 48–96
Letters to the Churches
Paul and other apostles write to strengthen, correct, and encourage the scattered churches across the Roman world.
ఈ కాలపు వచనాలు
- హెబ్రీయులకు 12:19సుమారు క్రీ.శ. 64
ఒక బూర శబ్దం లేదా అలాంటి గంభీరస్వరంతో మాట్లాడే చోటుకు మీరు రాలేదు. ఆ స్వరం యొక్క మాటలు విన్న వారు తమతో ఇంకొక్క మాట మాట్లాడకూడదని బ్రతిమాలుకొన్నారు,
- హెబ్రీయులకు 12:20సుమారు క్రీ.శ. 64
“ఒకవేళ ఒక జంతువైనా ఆ పర్వతాన్ని తాకితే, రాళ్లతో కొట్టబడి చంపబడాలి” అని ఇవ్వబడిన ఆజ్ఞను వారు భరించలేకపోయారు.
- హెబ్రీయులకు 12:21సుమారు క్రీ.శ. 64
ఆ దృశ్యం చాలా భయానకం కాబట్టి మోషే, “నేను భయంతో వణుకుతున్నాను” అన్నాడు.
- హెబ్రీయులకు 12:22సుమారు క్రీ.శ. 64
అయితే మీరు సీయోను పర్వతానికి, సజీవ దేవుని పట్టణమైన పరలోకపు యెరూషలేముకు వచ్చారు. మీరు సంతోషకరమైన సభలో వేలాదిమంది దేవదూతల దగ్గరకు వచ్చారు.
- హెబ్రీయులకు 12:23సుమారు క్రీ.శ. 64
పరలోకంలో పేర్లు వ్రాయబడి ఉన్న దేవుని జ్యేష్ఠ సంతానమనే సంఘానికి మీరు వచ్చారు. మనుష్యులందరికి న్యాయాధిపతియైన దేవుని దగ్గరకు, నిర్దోషులుగా తీర్చబడిన నీతిమంతుల్లా పరిపూర్ణత పొందిన ఆత్మల దగ్గరకు మీరు వచ్చారు.
- హెబ్రీయులకు 12:24సుమారు క్రీ.శ. 64
క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు.
- హెబ్రీయులకు 12:25సుమారు క్రీ.శ. 64
మాట్లాడుతున్నవానిని మీరు తిరస్కరించకుండా చూసుకోండి. భూమి మీద హెచ్చరించిన వానిని తిరస్కరించినవారు తప్పించుకోలేకపోతే, ఇక పరలోకం నుండి మనల్ని హెచ్చరించే వానిని మనం తిరస్కరిస్తే, మనమెలా తప్పించుకోగలం?
- హెబ్రీయులకు 12:26సుమారు క్రీ.శ. 64
ఆ సమయంలో ఆయన స్వరానికి భూమి కంపించింది, కాని ఆయన ఇప్పుడు, “మరోసారి నేను భూమిని మాత్రమే కాక పరలోకాన్ని కూడ కంపింపజేస్తాను” అని వాగ్దానం చేశాడు.
- హెబ్రీయులకు 12:27సుమారు క్రీ.శ. 64
“ఇంకొకసారి” అనే మాట కదలనివి నిలిచి ఉండేలా కదిలింపబడేవి అంటే సృష్టింపబడినవి తీసివేయబడతాయి అని అర్థాన్నిస్తుంది.
- హెబ్రీయులకు 12:28సుమారు క్రీ.శ. 64
మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొందుకొంటున్నాం కాబట్టి, కృతజ్ఞతగలవారమై, భయభక్తులతో ఆమోదయోగ్యమైన రీతిలో దేవుని ఆరాధిద్దాం,
- హెబ్రీయులకు 12:29సుమారు క్రీ.శ. 64
ఎందుకంటే మన “దేవుడు దహించు అగ్ని.”
- హెబ్రీయులకు 13:1సుమారు క్రీ.శ. 64
సహోదరీ సహోదరులుగా, ఒకరిని ఒకరు ఎల్లప్పుడు ప్రేమిస్తూ ఉండండి.
- హెబ్రీయులకు 13:2సుమారు క్రీ.శ. 64
క్రొత్తవారికి ఆతిథ్యం ఇవ్వడం మరువవద్దు, ఎందుకంటే క్రొత్తవారికి ఆతిథ్యం ఇస్తుండడం వలన కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యమిచ్చారు.
- హెబ్రీయులకు 13:3సుమారు క్రీ.శ. 64
చెరసాలలో ఉన్నవారిని మీరు కూడా వారితో పాటు చెరసాలలో ఉన్నట్లుగా, బాధలుపడుతున్న వారితో మీరు కూడా ఆ బాధల్లో వారితో ఉన్నట్లుగా వారిని జ్ఞాపకం చేసుకోండి.
- హెబ్రీయులకు 13:4సుమారు క్రీ.శ. 64
పెళ్ళి అందరిచేత గౌరవించబడాలి, పెళ్ళి పాన్పు శుద్ధమైనదిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు వ్యభిచారులను లైంగిక అనైతికత గల వారందరిని తీర్పు తీరుస్తాడు.
- హెబ్రీయులకు 13:5సుమారు క్రీ.శ. 64
మీ జీవితాలను ధన వ్యామోహానికి దూరంగా ఉంచండి, మీ దగ్గర ఉన్నదానితో సంతృప్తి చెందండి, ఎందుకంటే దేవుడు ఇలా అన్నాడు, “నేను నిన్ను ఎన్నడు విడిచిపెట్టను; నిన్ను ఎన్నడు త్రోసివేయను.”
- హెబ్రీయులకు 13:6సుమారు క్రీ.శ. 64
కాబట్టి మనం ధైర్యంతో ఇలా చెబుదాం, “ప్రభువే నాకు సహాయకుడు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?”
- హెబ్రీయులకు 13:7సుమారు క్రీ.శ. 64
దేవుని వాక్యాన్ని మీకు బోధించిన మీ నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారి జీవిత విధానం వలన కలిగిన ఫలితాన్ని తెలుసుకోండి, వారి విశ్వాసాన్ని అనుకరించండి.
- హెబ్రీయులకు 13:8సుమారు క్రీ.శ. 64
యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకే విధంగా ఉన్నాడు.
- హెబ్రీయులకు 13:9సుమారు క్రీ.శ. 64
అన్ని రకాల వింత బోధలచేత దూరంగా వెళ్లిపోకండి. ఆచార సంబంధమైన ఆహారం తినడం వల్ల కాదు, కాని కృప చేత మన హృదయాలు బలపరచబడటం మంచిది; ఆచారాలను పాటించే వారికి ఏ ప్రయోజనం కలుగదు.
- హెబ్రీయులకు 13:10సుమారు క్రీ.శ. 64
మనకు ఒక బలిపీఠం ఉంది, అయితే ప్రత్యక్షగుడారంలో పరిచర్య చేసేవారికి దాని నుండి తీసుకుని తినే అధికారం లేదు.
- హెబ్రీయులకు 13:11సుమారు క్రీ.శ. 64
ప్రధాన యాజకుడు జంతువుల రక్తాన్ని పాపపరిహారబలిగా అతి పరిశుద్ధ స్థలం లోపలికి తీసుకెళ్తాడు, కాని వాటి శరీరాలు శిబిరం బయటే దహించబడతాయి.
- హెబ్రీయులకు 13:12సుమారు క్రీ.శ. 64
కాబట్టి, యేసు కూడా తన రక్తం చేత ప్రజలను పాపాల నుండి శుద్ధి చేయడానికి పట్టణ ద్వారానికి బయటే బాధపడ్డాడు.
- హెబ్రీయులకు 13:13సుమారు క్రీ.శ. 64
కాబట్టి మనం కూడా శిబిరం బయట ఉన్న ఆయన దగ్గరకు వెళ్లి ఆయన భరించిన అవమానాన్ని మనం కూడా భరిద్దాము.
- హెబ్రీయులకు 13:14సుమారు క్రీ.శ. 64
ఎందుకంటే మనకు ఇక్కడ శాశ్వతమైన పట్టణం లేదు, అయితే రాబోతున్న పట్టణం కోసం మనం ఎదురుచూస్తున్నాము.