- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Naphtali
ఇలా కూడా పిలుస్తారు: Nephthalim
Naphtali ను ప్రస్తావించే వచనాలు
బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది పురుషులు అతనితో వెళ్లారు. దెబోరా కూడా అతనితో వెళ్లింది.
జెబూలూను ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టుకున్నారు; యుద్ధభూమిలో నఫ్తాలి ప్రజలు కూడా అలాగే చేశారు.
అతడు మనష్షే వారి దగ్గరికి దూతను పంపి తనను కలవమని చెప్పాడు, అలాగే ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వారి దగ్గరకు కూడా దూతలను పంపాడు.
నఫ్తాలి, ఆషేరు, మనష్షే గోత్రాల నుండి పిలువబడిన ఇశ్రాయేలీయులు వచ్చి మిద్యానీయులను తరిమారు.
నఫ్తాలికి అహిమయస్సు అధికారి (ఇతడు సొలొమోను యొక్క మరొక కుమార్తె బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు);
అతని తల్లి నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలు, అతని తండ్రి తూరు వాసి, ఇత్తడి పనిలో నైపుణ్యత కలవాడు. హూరాము అన్ని రకాల ఇత్తడి పనులలో జ్ఞానం, సామర్థ్యం, తెలివిగలవాడు. అతడు రాజైన సొలొమోను దగ్గరకు వచ్చి తనకు అప్పగించిన పని అంతా చేశాడు.
రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. అతడు ఈయోను, దాను, ఆబేల్-బేత్-మయకా, కిన్నెరెతు పరిసరాలన్నీ, నఫ్తాలి ప్రదేశమంతా జయించాడు.
ఇశ్రాయేలు రాజైన పెకహు కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు వచ్చి, ఈయోను, ఆబేల్-బేత్-మయకా, యానోహ, కెదెషు, హాసోరు పట్టణాలను పట్టుకున్నాడు. అతడు గిలాదు, గలిలయ నఫ్తాలి ప్రాంతం అంతటిని పట్టుకుని, ఆ ప్రాంతాల ప్రజలను బందీలుగా అష్షూరుకు తీసుకెళ్లాడు.
దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.
గెర్షోను సంతానం, వారి వంశాల ప్రకారం చీట్ల ద్వారా ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాల నుండి బాషానులో ఉన్న మనష్షే గోత్ర ప్రదేశాల నుండి పదమూడు పట్టణాలు కేటాయించబడ్డాయి.
నఫ్తాలి గోత్ర ప్రదేశంలో నుండి గలిలయలో ఉన్న కెదెషు, హమ్మోను, కిర్యతాయిము వాటి పచ్చిక మైదానాలతో పాటు వారు పొందుకున్నారు.
నఫ్తాలీయులైన బిల్హా వారసులు: యహజీయేలు, గూనీ, యేజెరు, షిల్లేము.
నఫ్తాలీయులలో 1,000 అధికారులు, వారితో పాటు డాలు, ఈటె పట్టుకున్నవారు 37,000 మంది;
ఇశ్రాయేలీయులు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి సరిహద్దు ప్రాంతాల నుండి వారి పొరుగువారు గాడిదలు, ఒంటెలు, కంచరగాడిదలు, ఎడ్ల మీద ఆహారపదార్థాలు తీసుకువచ్చారు. వాటిలో పిండి వంటకాలు, అంజూర పండ్ల ముద్దలు, ద్రాక్షపండ్ల ముద్దలు, ద్రాక్షరసం, ఒలీవనూనె, పశువులు, గొర్రెలు సమృద్ధిగా ఉన్నాయి.
జెబూలూనీయుల మీద: ఓబద్యా కుమారుడైన ఇష్మయా; నఫ్తాలీయుల మీద: అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు;
రాజైన ఆసాతో బెన్-హదదు ఏకీభవించి, తన సేనాధిపతులను ఇశ్రాయేలు పట్టణాల మీదికి పంపాడు. వారు ఈయోను, దాను, ఆబేల్-మయీము, నఫ్తాలి ప్రాంతానికి చేరిన పట్టణాలలోని కొట్లను జయించారు.
మనష్షే, ఎఫ్రాయిం, షిమ్యోను, నఫ్తాలి పట్టణాల వరకు వాటి చుట్టూ ఉన్న శిథిలాల్లో,
చిన్నదైన బెన్యామీను గోత్రం వారిని నడిపిస్తుంది, యూదా నాయకుల గొప్ప సమూహం, జెబూలూను నఫ్తాలి నాయకులు కూడా ఉన్నారు.
అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు.
నఫ్తాలికి ఒక భాగం; అది తూర్పు నుండి పడమర వరకు ఆషేరు భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
మనష్షేకు ఒక భాగం ఉంటుంది; అది తూర్పు నుండి పడమర వరకు నఫ్తాలి భూభాగానికి సరిహద్దుగా ఉంటుంది.
పశ్చిమదిక్కున 4,500 మూరల కొలతలతో మూడు ద్వారాలు: గాదు ద్వారం, ఆషేరు ద్వారం, నఫ్తాలి ద్వారం ఉండాలి.
ఆయన నజరేతును వదిలి జెబూలూను, నఫ్తాలి ప్రాంతపు సముద్రతీరాన ఉన్న కపెర్నహూముకు వెళ్లారు. వారు అక్కడ కొన్ని రోజులు నివసించారు.
“జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో, యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో, యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతంలో,