కంటెంట్‌కు వెళ్లండి

Jesus

3,872 వచనాలు · 6 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jesus Christ, Immanuel, Emmanuel, Christ

Jesus ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అలాగే భోజనమైన తర్వాత ఆయన పాత్రను తీసుకుని, “ఈ పాత్ర నా రక్తంతో కూడిన క్రొత్త నిబంధన, దీన్ని మీరు త్రాగిన ప్రతిసారి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి” అని చెప్పారు.

  2. కాబట్టి మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగిన ప్రతిసారి ప్రభువు వచ్చేవరకు ఆయన మరణాన్ని ప్రకటిస్తారు.

  3. కాబట్టి, ఎవరైతే అయోగ్యంగా ప్రభువు రొట్టెను తిని, ఆయన పాత్రలోనిది త్రాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం గురించి అపరాధులవుతారు.

  4. ప్రభువు ద్వారా మనం తీర్పు పొందినప్పుడు, అంతంలో ఈ లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ఉండడానికి మనం క్రమపరచబడుతున్నాము.

  5. అందువల్ల దేవుని ఆత్మచేత మాట్లాడేవారెవరూ “యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు. పరిశుద్ధాత్మచే తప్ప మరియెవరూ “యేసే ప్రభువు” అని అంగీకరించలేరని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.

  6. అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి గాని, ప్రభువు ఒక్కడే.

  7. ఇవన్నీ ఒకే ఒక ఆత్మ చేస్తున్న పనులు, ఆత్మ తాను నిర్ణయించుకున్న ప్రకారం అందరికి వాటిని పంచి ఇస్తున్నాడు.

  8. ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నట్లు, అనేక అవయవాలు కలిసి ఒక శరీరంలో ఉన్నట్లుగా క్రీస్తు కూడా ఉన్నారు.

  9. కాబట్టి మీరందరు క్రీస్తు శరీరము. మీలో ప్రతి ఒక్కరు దానిలో భాగాలే.

  10. ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడి ఉంది: “ఇతర భాషలతో పరదేశీయుల పెదాలతో నేను ఈ ప్రజలతో మాట్లాడతాను, కాని వారు నా మాట వినరు, అని ప్రభువు పలుకుతున్నాడు.”

  11. ఎవరైనా తాము దేవుని ప్రవక్తలమని లేదా ఆత్మ వరాలు గల వారమని తలిస్తే, నేను మీకు వ్రాసేది ప్రభువు ఆజ్ఞ అని వారు గ్రహించాలి.

  12. నేను పొందిన దానిని మొదట మీకు ప్రకటించాను: అది ఏంటంటే లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల కోసం మరణించారు.

  13. లేఖనాల ప్రకారం ఆయన సమాధి చేయబడి, మూడవ దినాన సజీవునిగా లేచారు.

  14. ఆయన కేఫాకు, తర్వాత పన్నెండు మందికి కనబడ్డారు.

  15. దాని తర్వాత ఆయన ఒకేసారి అయిదువందల మందికి పైగా సహోదర సహోదరీలకు కనబడ్డారు. వారిలో కొందరు మరణించినా చాలామంది ఇంకా జీవించే ఉన్నారు.

  16. ఆ తర్వాత యాకోబుకు, మిగిలిన అపొస్తలులందరికి ఆయన కనబడ్డారు.

  17. అందరికంటే చివరిగా అకాలంలో పుట్టిన నాకు కూడా ఆయన కనబడ్డారు.

  18. మృతులలో నుండి క్రీస్తు సజీవంగా లేపబడ్డారని మేము ప్రకటిస్తుండగా, మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎలా చెప్తారు?

  19. మృతుల పునరుత్థానం లేకపోతే క్రీస్తు కూడా లేపబడనట్టే కదా.

  20. అంతేకాదు క్రీస్తు లేపబడకపోతే, మా బోధ వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే.

  21. అంతేకాక, దేవుడు క్రీస్తును మరణం నుండి లేపారని దేవుని గురించి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మేము అబద్ధ సాక్షులంగా కనబడుతున్నాము. అయితే దేవుడు ఆయనను లేపకపోతే మరణించినవారు లేపబడరు అనేది నిజం కదా.

  22. మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదు.

  23. క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే; మీరు ఇంకా మీ పాపాల్లోనే ఉన్నారు.

  24. అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే.

  25. కేవలం ఈ జీవితకాలం వరకే క్రీస్తులో మన నిరీక్షణ ఉంచితే, అందరికంటే మనం అత్యంత దయనీయంగా ఉంటాము.