కంటెంట్‌కు వెళ్లండి

Jesus

3,872 వచనాలు · 6 కుటుంబ సభ్యులు

ఇలా కూడా పిలుస్తారు: Jesus Christ, Immanuel, Emmanuel, Christ

Jesus ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇప్పుడైతే మరణించినవారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మరణం నుండి లేపబడ్డారు.

  2. ఆదాములో అందరు ఎలా మరణించారో అలాగే క్రీస్తులో అందరు బ్రతికించబడతారు.

  3. అయితే ప్రతి ఒక్కరు తమ క్రమాన్ని బట్టి బ్రతికించబడతారు. క్రీస్తు ప్రథమ ఫలము. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతుకుతారు.

  4. క్రీస్తు సమస్త ఆధిపత్యాన్ని అధికారాన్ని బలాన్ని నాశనం చేసి తండ్రియైన దేవునికి రాజ్యానికి అప్పగిస్తారు. అప్పుడు అంతం వస్తుంది.

  5. ఎందుకంటే ఆయన తన శత్రువులందరిని తన పాదాల క్రింద ఉంచేవరకు ఆయన పరిపాలిస్తారు.

  6. “దేవుడు సమస్తాన్ని క్రీస్తు పాదాల క్రింద ఉంచారు” అని చెప్పినప్పుడు ఆయన క్రింద సమస్తాన్ని ఇచ్చిన దేవుడు మినహా మిగిలిన వాటన్నిటిని ఆయన క్రింద ఉంచారని అర్థం.

  7. ఆయన ఇది చేసినప్పుడు, దేవుడే అన్నిటిలో సర్వమై ఉండేలా, కుమారుడు తనకు సమస్తాన్ని లోబరచిన దేవునికి తానే లోబడతారు.

  8. సహోదరీ సహోదరులైన మీ గురించి మన ప్రభువైన యేసు క్రీస్తులో నాకు అతిశయం కలుగుతున్నట్టుగానే నేను ప్రతి రోజూ చస్తూనే ఉన్నాను.

  9. మొదటి మానవుడు భూమిలోని మట్టితో చేయబడ్డాడు, రెండవ మానవుడు పరలోకానికి చెందిన వాడు.

  10. అయితే దేవునికి కృతజ్ఞతలు! మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని ఇచ్చారు.

  11. కాబట్టి నా ప్రియ సహోదరీ సహోదరులారా, స్థిరంగా నిలబడండి. ఏది మిమ్మల్ని కదపలేదు. ప్రభువులో మీ శ్రమ వ్యర్థం కాదని మీకు తెలుసు కాబట్టి ఎల్లప్పుడు ప్రభువు కార్యాల్లో పూర్తి శ్రద్ధ చూపండి.

  12. ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు మీ సంపాదన బట్టి కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు.

  13. మార్గమధ్యలో మిమ్మల్ని చూసి వెంటనే వెళ్లిపోవాలని నేను అనుకోవడం లేదు. ప్రభువు అనుమతిస్తే మీతో కొంతకాలం గడపాలని అనుకుంటున్నాను.

  14. తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.

  15. ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు.

  16. ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి!

  17. ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.

  18. క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్.

  19. దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు, మన సోదరుడు తిమోతి,

  20. మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానం కలుగును గాక.

  21. మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త అన్ని విధాలా ఆదరణనిచ్చే దేవుడు.

  22. క్రీస్తు శ్రమలలో మనం ఎంత ఎక్కువ భాగం పంచుకున్నామో క్రీస్తు ఆదరణ కూడా అంతే ఎక్కువగా మనకు కలుగుతుంది.

  23. మరణకరమైన భయంకర ప్రమాదాల నుండి ఆయన మమ్మల్ని కాపాడారు. ఇకముందు కూడా కాపాడతారు. ఇకముందు కూడ కాపాడతాడు. ఆయన తిరిగి మమ్మల్ని కాపాడతారని ఆయనలో నిరీక్షణ కలిగి ఉన్నాము.

  24. ఇప్పుడు మీరు కొంతవరకు మాత్రమే అర్థం చేసుకోగల విషయాన్ని, రాబోవు కాలంలో సంపూర్ణంగా గ్రహిస్తారని నేను నిరీక్షిస్తున్నాను. అప్పుడు యేసు ప్రభువు దినాన మమ్మల్ని చూసి మీరు ఎంతగా గర్విస్తారో, మిమ్మల్ని చూసి మేము కూడా అలాగే గర్విస్తాము.

  25. ఎందుకంటే సీల ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధించబడిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అవునని చెప్పి, కాదనేవాడు కాడు.