కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ రోజు యెహోవా అబ్రాముతో నిబంధన చేసి, “నేను నీ సంతానానికి ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు మహా నది వరకు అంటే,

  2. కాబట్టి శారాయి అబ్రాముతో, “యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశారు. నీవు వెళ్లి నా దాసితో లైంగికంగా కలువు; బహుశ ఆమె ద్వార నాకు సంతానం కలుగుతుందేమో” అని అన్నది. శారాయి చెప్పిన దానికి అబ్రాము అంగీకరించాడు.

  3. అప్పుడు శారాయి అబ్రాముతో, “నేను అనుభవించే బాధకు నీవే బాధ్యుడవు. నా దాసిని నీ చేతిలో పెట్టాను, ఇప్పుడు తాను గర్భవతి కాబట్టి నన్ను చిన్న చూపు చూస్తుంది. యెహోవా నీకు నాకు మధ్య తీర్పు తీర్చును గాక” అని అన్నది.

  4. యెహోవా దూత హాగరు ఎడారిలో నీటిబుగ్గ దగ్గర ఉండడం చూశాడు; అది షూరు మార్గం ప్రక్కన ఉండే నీటిబుగ్గ.

  5. అప్పుడు యెహోవా దూత ఆమెతో, “నీ యజమానురాలి దగ్గరకు తిరిగివెళ్లి ఆమెకు లోబడి ఉండు” అని చెప్పాడు.

  6. యెహోవా దూత ఇంకా మాట్లాడుతూ, “నీ సంతానాన్ని లెక్కించలేనంత అధికం చేస్తాను” అని చెప్పాడు.

  7. యెహోవా దూత ఆమెతో ఇలా కూడా చెప్పాడు: “ఇప్పుడు నీవు గర్భవతివి నీవు ఒక కుమారునికి జన్మనిస్తావు, యెహోవా నీ బాధ విన్నారు కాబట్టి అతనికి ఇష్మాయేలు అని నీవు పేరు పెడతావు.

  8. ఆమె తనతో మాట్లాడిన యెహోవాకు ఈ పేరు పెట్టింది: “నన్ను చూస్తున్న దేవుడు మీరే.” ఆమె, “నన్ను చూస్తున్న దేవుని నేను వెనుక నుండి చూశాను” అని అన్నది.

  9. అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి.

  10. అప్పుడు నేను నీకు నాకు మధ్య నిబంధన చేస్తాను, నీ సంతతిని అత్యధికంగా వర్ధిల్లజేస్తాను” అన్నారు.

  11. అబ్రాము సాష్టాంగపడ్డాడు, అప్పుడు దేవుడు అతనితో ఇలా అన్నారు,

  12. “నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు.

  13. ఇకమీదట నీ పేరు అబ్రాము కాదు; నీకు అబ్రాహాము అని పేరు పెడుతున్నాను ఎందుకంటే నేను నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను.

  14. నిన్ను ఎంతో ఫలభరితంగా చేస్తాను; నిన్ను అనేక జనాంగాలుగా చేస్తాను, రాజులు నీ నుండి వస్తారు.

  15. నా నిబంధనను నాకు నీకు మరి నీ తర్వాత వచ్చు నీ వారసులకు మధ్య నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను, నీకు దేవునిగా, నీ తర్వాత నీ వారసులకు దేవునిగా ఉంటాను.

  16. నీవు పరదేశిగా ఉంటున్న కనాను దేశమంతా నీకు, నీ తర్వాత నీ వారసులకు నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను; వారికి నేను దేవునిగా ఉంటాను.”

  17. అప్పుడు దేవుడు అబ్రాహాముతో ఇలా అన్నారు, “నీవైతే, నీవు, నీ తర్వాత నీ సంతానం తరతరాల వరకు నా నిబంధనను నిలుపుకోవాలి.

  18. నీకు నీ తర్వాత నీ సంతతివారికి నేను చేసే నా నిబంధన, మీరు నిలుపుకోవలసిన నిబంధన ఇదే: మీలో ప్రతి మగవాడు సున్నతి చేసుకోవాలి.

  19. మీకు నాకు మధ్య నిబంధన గుర్తుగా మీ గోప్య చర్మాన్ని సున్నతి చేసుకోవాలి.

  20. మీ డబ్బుతో కొనబడినవారైనా, వారికి సున్నతి చేయబడాలి. మీ శరీరంలో నా నిబంధన నిత్య నిబంధనగా ఉండాలి.

  21. సున్నతి చేయబడని మగవారు అంటే తన గోప్య చర్మానికి సున్నతి చేయబడనివారు తమ జనులలో నుండి బహిష్కరించబడాలి; ఎందుకంటే వారు నా నిబంధనను మీరారు.”

  22. దేవుడు అబ్రాహాముతో ఇలా కూడా చెప్పారు, “నీ భార్యయైన శారాయిని ఇకపై శారాయి అని పిలువకూడదు; ఇప్పటినుండి తన పేరు శారా.

  23. నేను ఖచ్చితంగా ఆమెను ఆశీర్వదిస్తాను, ఆమె ద్వార నీకు కుమారున్ని ఇస్తాను. ఆమె జనాంగాలకు తల్లిగా ఉండేలా తనను ఆశీర్వదిస్తాను; అనేక జనాంగాల రాజులు ఆమె నుండి వస్తారు.”

  24. అబ్రాహాము దేవునితో, “మీ ఆశీర్వాదం క్రింద ఇష్మాయేలు జీవిస్తే చాలు!” అని అన్నాడు.

  25. అప్పుడు దేవుడు, “అవును, అయితే నీ భార్య శారా ఒక కుమారునికి జన్మనిస్తుంది, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. అతనితో నా నిబంధనను చేస్తాను, తన తర్వాత తన సంతానంతో ఉండేలా నిత్య నిబంధనగా దానిని స్థిరపరుస్తాను.