కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎడారిలో పేరాశకు లోనయ్యారు; పాడు ప్రదేశమది. దేవుడిని శోధించారు.

  2. దేవుడు వారి కోరిక తీర్చాడు, అయినా వారి ప్రాణాలు క్షీణించిపోయాయి.

  3. దండులో మోషే మీద, యెహోవాకు పరిశుద్ధుడైన, అహరోను మీద అసూయ ఏర్పడింది.

  4. వారిని రక్షించిన దేవున్ని, ఈజిప్టులో ఆయన చేసిన గొప్ప కార్యాలను వారు మరచిపోయారు,

  5. “వీరిని నాశనం చేస్తాను” అన్నాడు దేవుడు. మోషే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆయన వచ్చి దేవుని ఎదుట సందులో నిలిచి విజ్ఞాపన చేస్తే ఆయన ఉగ్రత వారిని ధ్వంసం చేయకుండా ఆపింది.

  6. మనోహరమైన దేశాన్ని వారు తిరస్కరించారు; వారాయన మాట నమ్మలేదు.

  7. యెహోవా మాట వినక, డేరాలలో సణగ సాగారు.

  8. కాబట్టి ఆయన తన చేయెత్తి, వారిని ఎడారిలో పతనమయ్యేలా చేస్తాను,

  9. తమ దుష్ట చర్యల చేత వారు దేవునికి కోపం రేపారు. అందుకు వారి మధ్యకు తెగులు మొదలైంది.

  10. మెరీబా నీళ్ల దగ్గర వారంతా దేవుని కోపాగ్ని రేపారు, వారి మూలంగా మోషేకు బాధ.

  11. యెహోవా నాశనం చేస్తానన్న జాతులను వీరు విడిచిపెట్టారు.

  12. యెహోవా కోపం వారి మీదికి వచ్చింది, తన వారసత్వం తన ప్రజలు అయినా వారంటే ఆయనకు అసహ్యం వేసింది.

  13. ఇతర దేశాలకు వారిని అప్పగించాడు. అయినా వారి మీద ప్రభుత్వం చేశారు.

  14. చాలాసార్లు ఆయన విడిపించాడు, అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు.

  15. అయినా వారు మొరపెట్టగానే ఆయన విన్నాడు. వారి కష్టంను చూచాడు.

  16. దేవుడు తన నిబంధనను తలచుకొన్నాడు. వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు. తన మారని ప్రేమను బట్టి వారిని కనికరించాడు.

  17. మా దేవా యెహోవా, మమ్మల్ని రక్షించండి; ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చండి, అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాం.

  18. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! ప్రజలంతా, “ఆమేన్!” అనాలి. యెహోవాను స్తుతించండి!

  19. యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు; ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.

  20. యెహోవాచేత విమోచింపబడినవారు, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు,

  21. అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధలనుండి విడిపించారు.

  22. ఆయన వారిని తిన్నని బాటలో నివాసయోగ్యమైన పట్టణానికి నడిపించారు.

  23. యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,

  24. దాహంతో ఉన్న వారి దాహాన్ని ఆయన తీరుస్తారు, మేలైన వాటితో ఆయన ఆకలి తీర్చుతారు.

  25. వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, మహోన్నతుని ప్రణాళికలను తృణీకరించారు.