God
God ను ప్రస్తావించే వచనాలు
మీ మందలింపుతో జలాలు పారిపోయాయి, మీ ఉరుముల ధ్వనికి పలాయనం చిత్తగించాయి;
అవి పర్వతాలకు మీదుగా వెళ్లాయి, అవి లోయల్లోకి దిగిపోయాయి, వాటికి మీరు నిర్ణయించిన చోటుకు అవి చేరుకున్నాయి.
తన ఆకాశ గదుల్లో నుండి ఆయన పర్వతాలను తడుపుతారు; ఆయన క్రియా ఫలం చేత భూమి తృప్తి చెందుతుంది.
ఆయన పశువుల కోసం గడ్డి పెరిగేలా చేస్తున్నారు, మనుష్యులు శ్రమించి సాగుచేయడానికి మొక్కలను మొలిపిస్తున్నారు, అలా భూమి నుండి ఆహారాన్ని పుట్టిస్తున్నారు:
యెహోవా వృక్షాలు, లెబానోనులో దేవదారు చెట్లు చాలినంత నీరు కలిగి ఉన్నాయి.
సింహాలు వాటి వేట కోసం గర్జిస్తాయి, అవి దేవుని నుండి ఆహారం వెదకుతాయి.
యెహోవా! మీ కార్యాలు ఎన్నో! మీ జ్ఞానంతో మీరు వాటన్నిటిని చేశారు; భూమి అంతా మీ సృష్టితో నిండి ఉంది.
అందులో ఓడలు ఇటు అటు తిరుగుతాయి, సముద్రంలో ఆడుకోడానికి మీరు సృజించిన లెవియాథన్ అక్కడ ఉంది.
సకాలంలో మీరు వాటికి వాటి ఆహారం పెడతారని, జీవులన్నీ మీ వైపే చూస్తున్నాయి.
మీరు దానిని వారికి ఇచ్చినప్పుడు, అవి సమకూర్చుకుంటాయి; మీరు గుప్పిలి విప్పి పెడుతుంటే అవి తిని తృప్తి చెందుతాయి.
మీ ముఖం మరుగైతే అవి కంగారు పడతాయి; మీరు వాటి ఊపిరిని ఆపివేసినప్పుడు, అవి చనిపోయి మట్టి పాలవుతాయి.
మీరు మీ ఆత్మను పంపినప్పుడు, అవి సృజించబడ్డాయి, మీరే భూతలాన్ని నూతనపరుస్తారు.
యెహోవా మహిమ నిరంతరం ఉండును గాక; యెహోవా తన క్రియలలో ఆనందించును గాక.
ఆయన భూమిని చూస్తే, అది కంపిస్తుంది, ఆయన పర్వతాలను తాకితే, అవి పొగలు గ్రక్కుతాయి.
నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను; నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను.
నేను యెహోవాయందు ఆనందిస్తుండగా, నా ధ్యానము ఆయనకు ఇష్టమైనదిగా ఉండును గాక.
అయితే పాపులు భూమి మీద నుండి పూర్తిగా తుడిచివేయబడుదురు గాక దుష్టులు ఇక ఉండక పోవుదురు గాక. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. యెహోవాను స్తుతించు.
యెహోవాకు స్తుతి చెల్లించండి, ఆయన నామాన్ని ప్రకటించండి; ఆయన చేసిన వాటిని దేశాల్లో తెలియజేయండి.
ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి; ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి.
ఆయన పరిశుద్ధ నామం గురించి గొప్పగా చెప్పండి; యెహోవాను వెదికేవారి హృదయాలు ఆనందించును గాక
యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.
ఆయన సేవకులైన అబ్రాహాము సంతానమా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతానమా, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను, ఆయన అద్భుతాలను, ఆయన ప్రకటించిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
O ye seed of Abraham his servant, ye children of Jacob his chosen.
ఆయన మన దేవుడైన యెహోవా; ఆయన తీర్పులు భూమి అంతటా ఉన్నాయి.
ఆయన తన నిబంధనను, తాను చేసిన వాగ్దానాన్ని వెయ్యి తరాల వరకు జ్ఞాపకం ఉంచుకుంటారు,