కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అందుకు నేనన్నాను: నా దేవా, నా దినాల మధ్యలో నన్ను తీసుకెళ్లకండి; మీ సంవత్సరాలు తరతరాలకు సాగిపోతూనే ఉంటాయి.

  2. ఆదిలో మీరు భూమికి పునాదులు వేశారు, ఆకాశాలు మీ చేతి పని.

  3. అవి అంతరించిపోతాయి, కాని మీరు నిలిచి ఉంటారు; ఒక వస్త్రంలా అవన్నీ పాతగిల్లుతాయి. మీరు వాటిని దుస్తుల్లా మార్చి వేస్తారు అవి అంతరిస్తాయి.

  4. కాని మీరు అలాగే ఉంటారు, మీ సంవత్సరాలకు అంతం ఉండదు.

  5. మీ సేవకుల పిల్లలు మీ సన్నిధిలో నివాసం చేస్తారు; వారి పిల్లలు మీ సమక్షంలో స్థిరంగా ఉంటారు.

  6. దావీదు కీర్తన. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

  7. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు.

  8. అణగారిన వారికందరికి యెహోవా నీతిని న్యాయాన్ని జరిగిస్తారు.

  9. ఆయన మోషేకు తన మార్గాలను, ఇశ్రాయేలీయులకు తన క్రియలను తెలియజేశారు.

  10. యెహోవా కృపా కనికరం గలవారు, త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.

  11. ఆయన ఎల్లప్పుడూ మనమీద నేరారోపణ చేయరు, శాశ్వతంగా కోపం పెట్టుకోరు;

  12. భూమికంటె ఆకాశం ఎంత ఎత్తున ఉందో, తనకు భయపడేవారి పట్ల ఆయన ప్రేమ అంత ఉన్నతం.

  13. పడమటికి తూర్పు ఎంత దూరమో, అంత దూరం ఆయన మన అతిక్రమాలను తొలగించారు.

  14. తండ్రి తన పిల్లల మీద కనికరం కలిగి ఉన్నట్లు, తనకు భయపడేవారి పట్ల యెహోవా కనికరం కలిగి ఉన్నారు;

  15. మనం ఎలా రూపించబడ్డామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.

  16. ఆయనకు భయపడేవారి పట్ల యెహోవా మారని ప్రేమ వారి పిల్లల పట్ల ఆయన నీతి నిత్యం నిలిచి ఉంటుంది,

  17. ఆయన నిబంధనను పాటించేవారిపట్ల, ఆయన కట్టడలను అనుసరించేవారి పట్ల ఉంటుంది.

  18. యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశారు, ఆయన రాజ్యం అందరి మీద పరిపాలన చేస్తున్నారు.

  19. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞలను ఆలకించి, ఆయన మాటలను నెరవేర్చే బలశూరులైన దూతలారా, ఆయనను స్తుతించండి.

  20. యెహోవా సైన్యమా, ఆయన చిత్తం నెరవేర్చే సేవకులారా, మీరంతా యెహోవాను స్తుతించండి.

  21. ప్రతిచోట ఆయన పరిపాలనలో ఉన్న సర్వ సృష్టి యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.

  22. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. యెహోవా నా దేవా, మీరు చాలా గొప్పవారు; ఘనత ప్రభావాన్ని ధరించుకున్నారు.

  23. యెహోవా వెలుగును వస్త్రంలా ధరిస్తారు; ఆయన ఒక గుడారంలా ఆకాశాన్ని విస్తరించి

  24. తన గదుల కిరణాలను వాటి నీటిపై వేస్తారు. ఆయన మేఘాలను తన రథంగా చేసుకుని వాయు రెక్కలపై స్వారీ చేస్తారు.

  25. ఆయన వాయువులను తనకు దూతలుగా, అగ్ని జ్వాలలను తనకు సేవకులుగా చేస్తారు.