కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా నామానికి చెందాల్సిన మహిమను ఆయనకే చెల్లించండి. అర్పణను తీసుకుని ఆయన సన్నిధికి రండి.

  2. తన పవిత్రత యొక్క వైభవంతో యెహోవాను ఆరాధించండి; సమస్త భూలోకమా! ఆయన ఎదుట వణకాలి.

  3. “యెహోవా పరిపాలిస్తారు” అని జనాంగాలలో ప్రకటించండి, లోకం స్థిరంగా స్థాపించబడింది, అది కదలదు; ఆయన జనాంగాలకు న్యాయంగా తీర్పు తీరుస్తారు.

  4. యెహోవా రాబోతున్నారు. భూలోకానికి తీర్పు తీరుస్తారు. నీతిని బట్టి లోకానికి, తన నమ్మకత్వాన్ని బట్టి ప్రజలకు తీర్పు తీరుస్తారు.

  5. యెహోవా పరిపాలిస్తారు, భూతలం ఆనందిస్తుంది; ద్వీపాలు, సముద్ర తీర ప్రదేశాలు సంతోషిస్తాయి.

  6. ఆయన చుట్టూరా మోఘాలు సాంద్రమైన చీకటితో ఆవరించి ఉన్నాయి; ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు పునాదులు.

  7. ఆయన ఎదుట నుండి మంటలు బయలుదేరి చుట్టూరా చేరి ఉన్న శత్రువులను దహించి వేస్తాయి.

  8. యెహోవా సమక్షంలో పర్వతాలు మైనంలా కరిగిపోతాయి, ఆయన సర్వప్రపంచానికీ ప్రభువు.

  9. ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తాయి, ప్రజలంతా ఆయన మహిమను చూస్తారు.

  10. వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ, చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి!

  11. యెహోవా! మీ తీర్పులను బట్టి సీయోను విని సంతోషిస్తూ ఉంది యూదా కుమార్తెలు ఆనందిస్తున్నారు.

  12. యెహోవా, భూమి అంతటికి పైగా ఉన్నావు; దేవుళ్ళందరి పైన మీరు మహోన్నతులు.

  13. యెహోవాను ప్రేమించేవారు కీడును ద్వేషించుదురు గాక, ఎందుకంటే తన నమ్మకమైన వారి జీవితాలను ఆయన కావలి కాస్తారు దుష్టుల చేతి నుండి ఆయన విడిపిస్తారు.

  14. నీతిమంతులారా, యెహోవాయందు ఆనందించండి, ఆయన పవిత్ర నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పుకోండి.

  15. ఒక కీర్తన. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు విజయాన్ని కలిగిస్తాయి.

  16. యెహోవా రక్షణను వెల్లడించారు. దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు.

  17. ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; మన దేవుని రక్షణ భూమ్యంతాల వరకు కనపడింది.

  18. భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, సంగీతంతో ఉత్సాహ గానం చేయి;

  19. వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, వీణతో, గాన ధ్వనితో,

  20. బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి.

  21. యెహోవా లోకానికి తీర్పరిగా, రాజుగా రాబోతున్నారు. ఆయన పరిపాలన ఆయన తీర్పులు న్యాయసమ్మతమైనవి.

  22. యెహోవా పరిపాలిస్తారు, ప్రజలు భయభక్తులతో వణికి పోతున్నారు; కెరూబులకు పైగా సింహాసనాసీనుడై దేవుడు కనిపిస్తున్నారు, భూమి కంపించాలి.

  23. సీయోను పట్టణంలో యెహోవా వైభవోపేతంగా అందరికంటే పైన ఉన్నారు.

  24. వారు మీ భీకరమైన గొప్ప నామాన్ని స్తుతిస్తారు, మీరు పరిశుద్ధులు.

  25. రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు; యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల నీతి నాయ్యాలు జరిగిస్తారు.