కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు నాకు మొరపెడతాడు, నేను అతనికి జవాబిస్తాను; కష్టాల్లో నేనతనిని ఆదుకుంటాను, అతన్ని విడిపిస్తాను ఘనపరుస్తాను.

  2. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను.

  3. సబ్బాతు దినానికి తగిన కీర్తన. ఒక గీతము. యెహోవాను స్తుతించడం మంచిది. మహోన్నతుడా, మీ నామాన్ని కీర్తించడం మంచిది.

  4. ఉదయకాలం మీ మారని ప్రేమను రాత్రివేళ మీ నమ్మకత్వాన్ని పది తంతుల వీణ సితారా మాధుర్యంతో ప్రకటించడం మంచిది.

  5. ఎందుకంటే యెహోవా, మీ కార్యముల చేత నాకు సంతోషం కలిగిస్తారు; మీ చేతులు చేసిన వాటిని బట్టి నేను ఆనంద గానం చేస్తాను.

  6. యెహోవా, మీ క్రియలు ఎంత గొప్పవి, మీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి!

  7. కాని యెహోవా, మీరు శాశ్వతంగా హెచ్చింపబడి ఉన్నారు.

  8. యెహోవా, మీ శత్రువులు, నిజంగా మీ శత్రువులు నశిస్తారు; కీడుచేసేవారంతా చెదరిపోతారు.

  9. మీరు నా కొమ్మును అడవి ఎద్దులా హెచ్చించారు; చక్కని నూనెలు నాపై పోయబడ్డాయి.

  10. వారు యెహోవా దేవాలయంలో నాటబడి, మన దేవుని ఆవరణాల్లో వర్థిల్లుతారు.

  11. “యెహోవా యథార్థవంతుడు, ఆయన నా కొండ, ఆయనయందు ఏ దుష్టత్వం లేదు” అని వారు ప్రకటిస్తూ ఉంటారు.

  12. యెహోవా పరిపాలిస్తున్నారు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నారు; యెహోవా ప్రభావాన్ని వస్త్రంగా బలాన్ని ఆయుధంగా ధరించుకున్నారు; నిజానికి, ప్రపంచం దృఢంగా క్షేమంగా స్థాపించబడింది.

  13. మీ సింహాసనం ఆది నుండి సుస్థిరమే. అనాది కాలం నుండి మీరున్నారు.

  14. యెహోవా, నదులలో వరదలు లేచాయి, నదులు ఉరుములా గర్జిస్తున్నాయి, అలలు చెలరేగుతున్నాయి.

  15. జలప్రవాహాల ఘోష కన్నా బలమైన సముద్ర తరంగాల కన్నా, యెహోవా బలాఢ్యుడై ఉన్నాడు.

  16. యెహోవా, మీ శాసనాలు స్థిరమైనవి; యెహోవా మీ మందిరం అంతం లేనన్ని దినాలు పరిశుద్ధతతో అలంకరించబడుతుంది.

  17. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు. ప్రతీకారం సాధించే దేవా, ప్రకాశించండి.

  18. లోక న్యాయాధిపతి, లేవండి; గర్విష్ఠులకు తగ్గ ప్రతిఫలం ఇవ్వండి.

  19. యెహోవా, ఎంతకాలం దుష్టులు, ఎంతకాలం దుష్టులు ఆనందిస్తారు?

  20. యెహోవా, వారు మీ ప్రజలను నలిపివేస్తారు; మీ వారసత్వాన్ని అణచివేస్తారు.

  21. వారంటారు, “యెహోవా చూడడం లేదు; యాకోబు దేవుడు గమనించడంలేదు.”

  22. చెవులిచ్చినవాడు వినడా? కళ్ళిచ్చిన వాడు చూడడా?

  23. దేశాలను శిక్షణ చేసేవాడు మిమ్మల్ని శిక్షించడా? నరులకు బోధించేవానికి తెలివిలేదా?

  24. మనుష్యుల ప్రణాళికలన్నీ యెహోవాకు తెలుసు; అవి వ్యర్థమైనవి అని ఆయనకు తెలుసు.

  25. యెహోవా శిక్షణ చేసినవారు ధన్యులు, వారికి మీ ధర్మశాస్త్రం నుండి మీరు బోధిస్తారు.