కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఎంతకాలం, యెహోవా? ఎప్పటికీ మీరు మరుగై ఉంటారా? ఎంతకాలం మీ ఉగ్రత అగ్నిలా మండుతూ ఉంటుంది?

  2. నా ఆయుష్షు ఎంత నిలకడలేనిదో జ్ఞాపకం చేసుకోండి, వ్యర్థంగా మీరు మనుష్యులందరిని సృష్టించారు కదా!

  3. ప్రభువా, మీ నమ్మకత్వంతో మీరు దావీదుకు వాగ్దానం చేసి మీరు మొదట చూపిన ఆ మారని ప్రేమ ఎక్కడ?

  4. ప్రభువా, మీ సేవకులు ఎలా ఎగతాళి చేయబడ్డారో, అన్ని దేశాల నిందలను నేను నా హృదయంలో ఎలా భరిస్తున్నానో

  5. యెహోవా, అవి మీ శత్రువులు ఎగతాళిగా చేసిన నిందలు, అడుగడుగునా మీ అభిషిక్తుని వారు చేసిన ఎగతాళి జ్ఞాపకం తెచ్చుకోండి.

  6. యెహోవాకే నిత్యం స్తుతి కలుగును గాక!

  7. దైవజనుడైన మోషే చేసిన ఒక ప్రార్థన. ప్రభువా, తరతరాల నుండి మీరే మా నివాస స్థలంగా ఉన్నారు.

  8. పర్వతాలు పుట్టక ముందే, మీరు లోకమంతటిని చేయక ముందే నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరే దేవుడు.

  9. మీ దృష్టిలో వెయ్యి సంవత్సరాలు ఇప్పుడే గడిచిన రోజులా, రాత్రి జాముల్లా ఉన్నాయి.

  10. మేము మీ కోపాగ్నికి దహించుకు పోతున్నాము మీ ఆగ్రహానికి భయపడుతున్నాము.

  11. మీరు మా దోషాలను మీ ఎదుట, మా రహస్య పాపాలను మీ సన్నిధి కాంతిలో ఉంచారు.

  12. మా దినాలన్ని మీ ఉగ్రత లోనే గడిచిపోయాయి; మేము మా సంవత్సరాలను మూలుగుతో ముగిస్తాము.

  13. ఒకవేళ మీ కోపం యొక్క శక్తి ఎవరు గ్రహించగలరు! మీ ఉగ్రత మీకు చెందిన భయంలా భీకరంగా ఉంటుంది.

  14. యెహోవా, మా దగ్గరకు తిరిగి రండి! ఇంకెంత కాలం? మీ దాసుల మీద కనికరం చూపండి.

  15. ఉదయం మీ మారని ప్రేమతో మమ్మల్ని తృప్తిపరచండి, తద్వార బ్రతికినన్నాళ్ళు ఆనంద గానం చేస్తూ ఆనందిస్తాము.

  16. మమ్మల్ని బాధించినన్ని దినాలు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినన్నాళ్ళు మమ్మల్ని సంతోషింపజేయండి.

  17. మీ క్రియలు మీ సేవకులకు, మీ ప్రభావము వారి పిల్లలకు కనుపరచబడును గాక.

  18. మన ప్రభువైన దేవుని దయ మనమీద ఉండును గాక; మా చేతి పనులను మాకోసం స్థిరపరచండి, అవును, మా చేతి పనులను స్థిరపరచండి.

  19. మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు.

  20. యెహోవా గురించి నేను చెప్పేదేమంటే, “ఆయనే నా ఆశ్రయం నా కోట, నా దేవుడు, ఆయననే నేను నమ్ముకున్నాను.”

  21. వేటగాని వల నుండి, మరణకరమైన తెగులు నుండి, ఆయన తప్పక విడిపిస్తారు.

  22. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం; ఆయన నమ్మకత్వం నీకు డాలుగాను గోడగాను ఉంటుంది.

  23. “యెహోవా నాకు ఆశ్రయం” అని ఒకవేళ నీవు అని, మహోన్నతుని నీకు నివాసంగా చేసుకుంటే,

  24. నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడమని నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు.

  25. “అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి నేను అతన్ని విడిపిస్తాను” అని యెహోవా అంటున్నారు; అతడు నా నామాన్ని గుర్తిస్తాడు, కాబట్టి నేను అతన్ని కాపాడతాను.