God
God ను ప్రస్తావించే వచనాలు
కాబట్టి ఆయన వారిని వెట్టిచాకిరికి అప్పగించారు; వారు తొట్రిల్లారు సాయం చేసేవాడు ఒక్కడూ లేడు.
అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
ఎందుకంటే ఆయన ఇత్తడి ద్వారాలను పగలగొడతారు ఇనుప గడియలను విరగ్గొడతారు.
అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు.
యెహోవా యొక్క మారని ప్రేమ కోసం మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
కృతజ్ఞతార్పణలు అర్పించాలి. ఆనంద ధ్వనులతో దేవుని క్రియలను ప్రకటించాలి.
వారంతా యెహోవా చేసిన క్రియలు చూచారు, సముద్రంలో యెహోవా చేసిన అద్భుతాలు చూచారు.
దైవాజ్ఞకు తుఫాను లేచింది, అలలు రేగాయి.
అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు ఆయన వారిని వారి బాధ నుండి విడిపించారు.
అలలు తగ్గాయి వారెంతో సంతోషించారు. వారు వెళ్లాలనుకున్న రేవుకు దేవుడు వారిని చేర్చాడు.
యెహోవా యొక్క మారని ప్రేమ కోసం మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
ప్రజా సమాజాలలో ఆయనకే మహిమ. పెద్దల సభలలో ఆయనకే ప్రఖ్యాతి!
ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసించడానికి తీసుకువచ్చారు, వారు అక్కడ నివాసయోగ్యమైన పట్టణాన్ని ఏర్పరచుకున్నారు.
కానీ ఆయన అవసరతలో ఉన్నవారిని వారి కష్టాల నుండి పైకి లేవనెత్తారు గొర్రెల మందల్లా వృద్ధి వారి కుటుంబాలు వృద్ధిచేశారు.
జ్ఞానులు ఈ విషయాలను ఆలోచిస్తారు, యెహోవా ప్రేమా క్రియలను తలపోస్తారు.
ఒక గీతము. దావీదు కీర్తన. ఓ దేవా, నా హృదయం స్థిరంగా ఉంది; నా ప్రాణమంతటితో నేను పాడతాను సంగీతం వాయిస్తాను.
యెహోవా, దేశాల మధ్య నేను మిమ్మల్ని స్తుతిస్తాను; జనాంగాల మధ్య మీ గురించి నేను పాడతాను.
ఎందుకంటే మీ మారని ప్రేమ గొప్పది, అది ఆకాశాల కంటే ఎత్తైనది; మీ నమ్మకత్వం మేఘాలంటుతుంది.
దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి; భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.
మీరు ప్రేమించేవారు విడిపించబడేలా, మీ కుడిచేతితో మమ్మల్ని రక్షించి మాకు సాయం చేయండి.
దేవుడు తన పరిశుద్ధాలయం నుండి మాట్లాడిన మాట: “విజయంతో నేను షెకెమును పంచుతాను సుక్కోతు లోయను కొలుస్తాను.
మోయాబు నా కాళ్లు కడుక్కునే పళ్లెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను; ఫిలిష్తియా గురించి విజయధ్వని చేస్తాను.”
దేవా, మమ్మల్ని విసర్జించిన మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?