కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవాయందు భయం జ్ఞానానికి మూలం; ఆయన కట్టడలను పాటించేవారు మంచి గ్రహింపు కలిగి ఉంటారు. స్తుతి నిత్యం ఆయనకే చెందును.

  2. యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడేవారు ధన్యులు, వారు ఆయన ఆజ్ఞలలో అధిక ఆనందాన్ని పొందుతారు.

  3. దుర్వార్తల వలన వారు భయపడరు; యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది.

  4. యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి; యెహోవా నామాన్ని స్తుతించండి.

  5. ఇప్పుడు ఎల్లప్పుడు సదా యెహోవా నామం స్తుతింపబడును గాక.

  6. సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, యెహోవా నామం స్తుతింపబడును గాక.

  7. దేశాలన్నిటికి పైగా యెహోవా హెచ్చింపబడ్డారు, ఆయన మహిమ ఆకాశాలకు పైగా విస్తరించి ఉంది.

  8. మన దేవుడైన యెహోవా లాంటి వారెవరు, ఎత్తైన సింహాసనంపై ఆసీనులై ఉన్నవారు,

  9. అక్కడినుండి ఆకాశాన్ని, భూమిని వంగి చూడగలవారెవరు?

  10. ఆయన వారిని రాకుమారులతో, తన ప్రజల రాకుమారులతో కూర్చోబెడతారు.

  11. అతడు సంతానం లేని స్త్రీని తన ఇంట్లో సంతోషంగా ఉన్న తల్లిగా స్థిరపరుస్తారు. యెహోవాను స్తుతించండి.

  12. యూదా దేవునికి పరిశుద్ధాలయం అయ్యింది, ఇశ్రాయేలు ఆయన రాజ్యమైంది.

  13. ఓ భూమి, ప్రభువు సన్నిధిలో యాకోబు దేవుని సన్నిధిలో నీవు గడగడ వణకాలి.

  14. మాకు కాదు, యెహోవా, మాకు కాదు, మీ మారని ప్రేమ, నమ్మకత్వాన్ని బట్టి, మీ నామానికే మహిమ కలగాలి.

  15. “వారి దేవుడు ఎక్కడ?” అని జనులు ఎందుకు అంటున్నారు?

  16. మన దేవుడు పరలోకంలో ఉన్నారు; ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు.

  17. సర్వ ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.

  18. అహరోను వంశమా, యెహోవాను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.

  19. యెహోవాకు భయపడు వారలారా ఆయనను నమ్ముకోండి ఆయనే వారికి సహాయం డాలు.

  20. యెహోవా మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటారు మనల్ని దీవిస్తారు: ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తారు, అహరోను వంశాన్ని దీవిస్తారు.

  21. యెహోవాకు భయపడేవారిని అనగా పిల్లలను పెద్దలను ఆయన దీవిస్తారు.

  22. యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను, వృద్ధి చేయును గాక.

  23. ఆకాశాన్ని భూమిని సృజించిన యెహోవాచేత, మీరు దీవించబడుదురు గాక.

  24. ఎత్తైన ఆకాశాలు యెహోవాకు చెందినవి, అయితే భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చారు.

  25. యెహోవాను స్తుతించేది చనిపోయినవారు కాదు, నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లేవారు కాదు;