కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మనమే యెహోవాను కీర్తించేవారం, ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము. యెహోవాను స్తుతించండి.

  2. నేను యెహోవాను ప్రేమిస్తాను, ఎందుకంటే ఆయన నా స్వరం విన్నారు; కరుణ కోసం నేను పెట్టిన మొరను ఆయన విన్నారు.

  3. ఆయన తన చెవిని నా వైపు త్రిప్పారు కాబట్టి, నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఆయనకు మొరపెడుతుంటాను.

  4. అప్పుడు నేను యెహోవా నామమున మొరపెట్టాను: “యెహోవా, నన్ను రక్షించండి!”

  5. యెహోవా దయగలవాడు నీతిమంతుడు; మన దేవుడు కనికరం కలవాడు.

  6. యెహోవా సామాన్యులను కాపాడతారు; నేను దుర్దశలో ఉన్నప్పుడు, ఆయన నన్ను రక్షించారు.

  7. నా ప్రాణమా, నీ విశ్రాంతికి తిరిగి వెళ్లు, ఎందుకంటే యెహోవా నీ పట్ల గొప్పగా వ్యవహరించారు.

  8. యెహోవా, మీరు, మరణం నుండి నన్ను, కన్నీటి నుండి నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను విడిపించారు.

  9. నేను సజీవుల భూమిలో యెహోవా ఎదుట నడుస్తాను.

  10. యెహోవా నాకు చేసిన అంతటిని బట్టి నేను ఆయనకు తిరిగి ఏమివ్వగలను?

  11. నేను రక్షణ పాత్రను పైకెత్తి యెహోవా పేరట మొరపెడతాను.

  12. ఆయన ప్రజలందరి సమక్షంలో, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు తీర్చుకుంటాను.

  13. యెహోవా దృష్టిలో విలువైనది ఆయన నమ్మకమైన సేవకుల మరణము.

  14. యెహోవా, నేను మీ సేవకుడిని మీ పనిమనిషి కుమారున్ని, నా తల్లి చేసినట్లే నేను మీకు సేవ చేస్తాను; మీరు నా సంకెళ్ళ నుండి నన్ను విడిపించారు.

  15. నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను యెహోవా నేను మీ పేరట మొరపెడతాను.

  16. ఆయన ప్రజలందరి సమక్షంలోను, యెహోవా మందిర ఆవరణాల్లోను, యెరూషలేమా, మీ మధ్యను, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.

  17. In the courts of the LORD'S house, in the midst of thee, O Jerusalem. Praise ye the LORD.

  18. సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి; సర్వజనులారా, ఆయనను కీర్తించండి.

  19. మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది, ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది. యెహోవాను స్తుతించండి.

  20. యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  21. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని ఇశ్రాయేలీయులు చెప్పుదురు గాక.

  22. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అహరోను వంశం చెప్పుదురు గాక.

  23. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని యెహోవాకు భయపడేవారు చెప్పుదురు గాక.

  24. నేను ఇరుకులో ఉండి యెహోవాకు మొరపెట్టాను; ఆయన నాకు జవాబిచ్చి నన్ను విశాల స్థలంలోకి తెచ్చారు.

  25. యెహోవా నా పక్షాన ఉన్నారు; నేను భయపడను. నరమాత్రులు నన్నేమి చేయగలరు?