God
God ను ప్రస్తావించే వచనాలు
అత్యంత జాగ్రత్తగా పాటించాలని మీరు వారికి శాసనాలిచ్చారు.
మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది!
అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు నేను అవమానపాలు కాను.
నేను మీ నీతి న్యాయవిధులను తెలుసుకున్న కొలది యథార్థ హృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి.
యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు? మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.
నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.
నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.
యెహోవా, మీకు స్తుతి కలుగును గాక; మీ శాసనాలను నాకు బోధించండి.
మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరిస్తాను.
ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించునట్లు నేను మీ శాసనాలను పాటించడంలో సంతోషిస్తాను.
మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను.
మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను.
నేను బ్రతికి ఉండి మీ వాక్యానికి లోబడేలా, మీ సేవకునిపట్ల దయగా ఉండండి.
మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి.
ఈ లోకంలో నేను అపరిచితున్ని; మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి.
అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది.
శపించబడినవారైన అహంకారులను మీరు గద్దిస్తారు, వారు మీ ఆజ్ఞల నుండి తొలగిపోయినవారు.
నేను మీ శాసనాలను పాటిస్తున్నాను, వారి అపహాస్యాన్ని ధిక్కారాన్ని నా నుండి తొలగించండి.
పాలకులు కలిసి కూర్చుని నన్ను అపవాదు చేసినప్పటికీ, మీ సేవకుడు మీ శాసనాలను ధ్యానిస్తాడు.
నేను నేల మీద పడిపోయాను; మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
నా జీవిత పరిస్థితులను మీకు వివరించాను, మీరు నాకు జవాబిచ్చారు; మీ శాసనాలు నాకు బోధించండి.
నేను మీ కట్టడల అర్థాన్ని గ్రహించేలా చేయండి, తద్వారా మీ అద్భుత కార్యాలను నేను ధ్యానిస్తాను.
దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది; మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి.
మోసపూరిత మార్గాల నుండి నన్ను తప్పించండి; నా మీద దయచూపి మీ ధర్మశాస్త్రం నాకు బోధించండి.