కంటెంట్‌కు వెళ్లండి

God

11,427 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

God ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.

  2. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన నేను స్తుతించే, నా దేవా, మౌనంగా ఉండకండి,

  3. నా శత్రువు మీద ఒక దుష్టుని నియమించండి; అతని కుడి ప్రక్కన ఒక నేరం మోపేవాడు నిలబడాలి.

  4. అతని పూర్వికుల దోషాలు యెహోవా మరువకూడదు, అతని తల్లి పాపాన్ని దేవుడు ఎన్నటికి తుడిచివేయకూడదు.

  5. వారి పాపాలన్నీ ఎప్పుడూ యెహోవా ఎదుట ఉండాలి, తద్వార భూమి మీద నుండి అతని పిల్లల జ్ఞాపకాన్ని ఆయన తుడిచివేస్తారు.

  6. నా మీద నేరం మోపేవారికి నా గురించి చెడుగా మాట్లాడేవారికి, యెహోవా వారికి జీతం చెల్లించును గాక.

  7. అయితే, ప్రభువైన యెహోవా, మీ నామ ఘనత కోసం నాకు సహాయం చేయండి; శ్రేష్ఠమైన మీ మారని ప్రేమను బట్టి, నన్ను విడుదలచేయండి.

  8. యెహోవా, నా దేవా! నాకు సాయం చేయండి; మీ మారని ప్రేమను బట్టి నన్ను కాపాడండి.

  9. ఇది చేసింది మీ హస్తమేనని, యెహోవాయే చేశారని వారికి తెలియనివ్వండి.

  10. వారు నన్ను శపించినప్పుడు మీరు నన్ను దీవిస్తారు; వారు నాపై దాడి చేసినప్పుడు వారు అవమానానికి గురవుతారు, కాని మీ సేవకుడు సంతోషించును గాక.

  11. నేను నోరార యెహోవాను కీర్తిస్తాను; ఆరాధికుల గొప్ప సమూహంలో నేను ఆయనను స్తుతిస్తాను.

  12. ఎందుకంటే అవసరతలో ఉన్న వారి పక్షాన ఆయన నిలబడతారు, వారికి తీర్పు తీర్చే వారి నుండి వారి ప్రాణాలను కాపాడడానికి.

  13. దావీదు కీర్తన. యెహోవా నా ప్రభువుతో చెప్పిన మాట: “నేను నీ శత్రువులను నీ పాదపీఠంగా చేసే వరకు నీవు నా కుడిచేతి వైపున కూర్చో.”

  14. యెహోవా, “నీ శత్రువుల మధ్య పరిపాలించు!” అని అంటూ, సీయోను నుండి మీ శక్తివంతమైన రాజదండాన్ని విస్తరిస్తూ, అంటారు,

  15. మీ యుద్ధ దినాన మీ దళాలు ఇష్టపూర్వకంగా వస్తాయి. పవిత్ర వైభవాన్ని ధరించుకున్నవారై ఉదయపు గర్భం నుండి మంచులా మీ యువకులు మీ దగ్గరకు వస్తారు.

  16. “మెల్కీసెదెకు క్రమంలో, నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు” అని యెహోవా ప్రమాణం చేశారు ఆయన తన మనస్సు మార్చుకోరు.

  17. ప్రభువు మీ కుడి ప్రక్కనే ఉన్నాడు; తన ఉగ్రత దినాన ఆయన రాజులను తుత్తునియలుగా చేస్తాడు.

  18. యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో సమాజంలో నేను హృదయమంతటితో యెహోవాను స్తుతిస్తాను.

  19. యెహోవా కార్యాలు గొప్పవి; వాటిలో ఆనందించే వారందరు వాటి గురించి ధ్యానిస్తారు.

  20. ఆయన క్రియలు కీర్తనీయమైనవి ప్రభావవంతమైనవి, ఆయన నీతి నిరంతరం ఉంటుంది.

  21. మనుష్యులకు జ్ఞాపకముండేటట్లు ఆయన అద్భుతాలు చేస్తారు; యెహోవా దయామయుడు. కనికరం గలవారు.

  22. భయభక్తులు గలవారిని పోషిస్తారు. ఆయన తన నిబంధన ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటారు.

  23. తన ప్రజలకు ఇతర దేశాలను వారసత్వంగా ఇచ్చి, తన క్రియలలోని బలప్రభావాలను వారికి వెల్లడించారు.

  24. ఆయన చేతుల పనులు విశ్వసనీయమైనవి న్యాయమైనవి; ఆయన కట్టడలు నమ్మదగినవి.

  25. ఆయన తన ప్రజలకు విమోచన సమకూర్చారు; ఆయన తన ఒడంబడికను శాశ్వతంగా నియమించారు, ఆయన నామం పరిశుద్ధమైనది భీకరమైనది.