కంటెంట్‌కు వెళ్లండి

Women గురించి బైబిల్ వచనాలు

304 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇస్సాకు తన తల్లియైన శారా గుడారం లోనికి ఆమెను తీసుకెళ్లి, ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఇలా రిబ్కా అతని భార్య అయ్యింది. అతడు ఆమెను ప్రేమించాడు; ఇలా తల్లి మరణం చేత బాధతో ఉన్న ఇస్సాకుకు రిబ్కా ద్వార ఓదార్పు కలిగింది.

  2. లాబాను వెదకడానికి యాకోబు గుడారంలోకి, లేయా గుడారంలోకి, ఇద్దరు దాసీల గుడారాల్లోకి వెళ్లి చూశాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు. లేయా గుడారం నుండి బయటకు వచ్చి రాహేలు గుడారంలోకి వెళ్లాడు.

  3. అప్పుడు షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాడు.

  4. అప్పుడు అహరోను సోదరి ప్రవక్త్రియైన మిర్యాము తంబుర తన చేతిలోనికి తీసుకున్నది. అప్పుడు స్త్రీలందరు తంబురలతో నాట్యంతో ఆమెను అనుసరించారు.

  5. మిర్యాము వారితో ఇలా పాడింది: “యెహోవాకు పాడండి, ఎందుకంటే ఉన్నతంగా హెచ్చింపబడ్డారు. గుర్రాన్ని దాని రౌతును ఆయన సముద్రంలో విసిరిపడవేశారు.”

  6. ఆమె తండ్రి ఆమెను అతనికి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోకపోతే అతడు కన్యకల కట్నం ప్రకారం డబ్బు చెల్లించాలి.

  7. ఇష్టపూర్వకంగా ఇవ్వాలనుకున్న స్త్రీలు పురుషులు వచ్చి, చెవికమ్మలు, వ్రేలి ఉంగరాలు, నగలు, వివిధ రకాల బంగారు ఆభరణాలు తెచ్చి ఆ బంగారాన్ని పైకెత్తి ఆడించి యెహోవాకు ప్రత్యేక అర్పణగా సమర్పించారు.

  8. వారు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలతో ఒక ఇత్తడి గంగాళం దానికి ఇత్తడి పీట చేశారు.

  9. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  10. “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఒక స్త్రీ గర్భవతియై ఒక మగశిశువుకు జన్మనిస్తే నెలసరి సమయంలో ఉన్నట్లే ఆచారరీత్య ఆమె ఏడు రోజులు అపవిత్రురాలిగా ఉంటుంది.

  11. ఆ మగశిశువుకు ఎనిమిదవ రోజున సున్నతి చేయించాలి.

  12. అప్పుడు స్త్రీ తన రక్తస్రావం నుండి శుద్ధి కావడానికి ముప్పై మూడు రోజులు వేచి ఉండాలి. శుద్ధీకరణ రోజులు పూర్తయే వరకు ఆమె పవిత్రమైన దేన్ని తాకకూడదు, పరిశుద్ధాలయానికి వెళ్లకూడదు.

  13. ఒకవేళ ఆమె ఆడపిల్లకు జన్మనిస్తే, ఆమె రెండు వారాలు అపవిత్రురాలిగా ఉంటుంది. అప్పుడు ఆమె రక్తస్రావం నుండి శుద్ధి కావడానికి అరవై ఆరు రోజులు వేచి ఉండాలి.

  14. “ ‘కుమారుని కోసం గాని కుమార్తె కోసం గాని ఆమె శుద్ధీకరణ రోజులు ముగిసిన తర్వాత ఆమె దహనబలి కోసం ఒక సంవత్సరపు గొర్రెపిల్లను, పాపపరిహారబలి కోసం ఒక చిన్న గువ్వను గాని పావురాన్ని గాని సమావేశ గుడార ద్వారం దగ్గర ఉన్న యాజకుని దగ్గరకు తీసుకురావాలి.

  15. ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేయటానికి అతడు వాటిని యెహోవా ఎదుట అర్పించినప్పుడు ఆమె తన రక్తస్రావం నుండి ఆచారరీత్య శుద్ధి అవుతుంది. “ ‘మగశిశువుకు గాని ఆడపిల్లకు గాని జన్మనిచ్చే స్త్రీకి నియమాలు ఇవే.

  16. ఆమె ఒకవేళ గొర్రెపిల్లను కొనలేకపోతే, ఆమె గువ్వల జతను లేదా రెండు చిన్న పావురాలను తీసుకురావాలి. వాటిలో ఒకటి దహనబలి కోసం మరొకటి పాపపరిహారబలి కోసము. ఈ విధంగా యాజకుడు ఆమెకు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు, ఆమె శుద్ధి అవుతుంది.’ ”

  17. “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఇలా చెప్పు: ‘ఒకవేళ ఒక వ్యక్తి భార్య దారితప్పి అతనికి నమ్మకద్రోహం చేసి,

  18. మరొక వ్యక్తి ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకొని, ఆ విషయం తన భర్తకు తెలియకుండ దాచబడి ఆమె అపవిత్రపరచబడింది అనడానికి సాక్ష్యం లేకపోయినా, ఆమె పట్టుబడకపోయినా,

  19. ఒకవేళ అతడు తన భార్య మీద అసూయపడి ఆమెను అనుమానించినప్పుడు, ఆమె నిజంగానే అపవిత్రమైతే, ఒకవేళ ఆమె అపవిత్రం కాకపోయినా అతడు ఆమెను అనుమానిస్తే,

  20. అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకెళ్లాలి. అతడు ఆమె పక్షంగా ఒక ఓమెరు యవల పిండి తీసుకురావాలి. దాని మీద ఒలీవనూనె పోయకూడదు ధూపం వేయకూడదు ఎందుకంటే అది అసూయ కోసం అర్పించే భోజనార్పణ, చేసిన తప్పును జ్ఞాపకం చేసే జ్ఞాపక అర్పణ.

  21. “ ‘యాజకుడు ఆమెను తీసుకువచ్చి యెహోవా ఎదుట నిలబెట్టాలి.

  22. తర్వాత యాజకుడు ఓ మట్టి కూజలో పవిత్ర జలం తీసుకుని సమావేశ గుడారంలోని నేల మట్టిని ఆ నీటిలో వేయాలి.

  23. యాజకుడు యెహోవా ఎదుట ఆమెను నిలబెట్టిన తర్వాత, ఆమె జుట్టును విప్పి, శాపాన్ని తెచ్చే చేదు నీటిని యాజకుడు పట్టుకుని, జ్ఞాపక అర్పణను అంటే అనుమానం కొరకైన జ్ఞాపక అర్పణను ఆమె చేతుల్లో పెట్టాలి.

  24. తర్వాత యాజకుడు ఆ స్త్రీతో ప్రమాణం చేయించి, “ఏ మనుష్యుడు నీతో లైంగిక సంబంధం లేకపోతే, నీ భర్తతో దాంపత్య సంబంధం కలిగి ఉన్నప్పుడు నీవు త్రోవ తప్పకుండ, అపవిత్రం కాకుండ ఉంటే, శాపం తెచ్చే ఈ చేదు నీళ్ల నుండి నీవు నిర్దోషివి అవుతావు.

  25. అయితే నీ భర్తతో పెళ్ళి చేసుకున్న తర్వాత నీవు త్రోవ తప్పి, నీ భర్త కాకుండా వేరొక వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా నిన్ను నీవు అపవిత్రపరచుకుని ఉంటే,”