Usury గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
“మీ మధ్య ఉన్న నా ప్రజల్లో ఎవరైనా అవసరంలో ఉంటే, మీరు వారికి డబ్బు అప్పు ఇస్తే, అప్పులు ఇచ్చేవారిలా ప్రవర్తించకూడదు; వడ్డీ తీసుకోకూడదు.
“ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి, మీలో తమను తాము ఆదరించుకోలేకపోతే, మీరు ఒక విదేశీయునికి, అపరిచితునికి చేసినట్టుగానే వారికి సహాయం చేయండి, కాబట్టి వారు మీ మధ్య జీవించడం కొనసాగించవచ్చు.
వారి నుండి వడ్డీ లేదా లాభం తీసుకోకండి, అయితే మీ దేవునికి భయపడండి, తద్వారా వారు మీ మధ్యనే జీవించడం కొనసాగించవచ్చు.
మీరు వారికి వడ్డీకి డబ్బు ఇవ్వకూడదు లేదా లాభం కోసం ఆహారాన్ని అమ్మకూడదు.
వడ్డీ సంపాదించగల డబ్బు గాని ఆహారమే గాని వేరే ఏదైనా గాని, తోటి ఇశ్రాయేలు దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.
మీరు విదేశీయుల దగ్గర వడ్డీని వసూలు చేయవచ్చు, కానీ తోటి ఇశ్రాయేలు దగ్గర కాదు, తద్వారా మీరు స్వాధీనం చేసుకునే దేశంలో మీరు చేయి పెట్టిన ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.
తర్వాత ప్రజలు వారి భార్యలు తమ తోటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణ చేశారు.
కొందరు, “మేమూ, మా కుమారులు కుమార్తెలు కలిపి చాలామంది ఉన్నాము కాబట్టి మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇవ్వండి” అన్నారు.
మరికొందరు, “కరువు సమయంలో ధాన్యం పొందడానికి మేము మా పొలాలను ద్రాక్షతోటలను మా ఇళ్ళను తాకట్టు పెడుతున్నాం” అన్నారు.
ఇంకా కొందరు, “రాజుకు పన్ను చెల్లించడానికి మా పొలాలు ద్రాక్షతోటల మీద డబ్బు అప్పుగా తీసుకున్నాము.
మా శరీరం రక్తం మా తోటి యూదుల శరీరం రక్తం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లల్లాంటివారు కారా? అయినా మా కుమారులను మా కుమార్తెలను బానిసలుగా ఉంచాల్సి వచ్చింది. ఇప్పటికే మా కుమార్తెలలో కొందరు బానిసలుగా ఉన్నారు కాని మా పొలాలు ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వారిని విడిపించడానికి మాకు శక్తి లేదు” అన్నారు.
వారి నిరసనలు ఫిర్యాదులు విని నేనెంతో కోప్పడ్డాను.
అయితే నేను వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించి సంస్థానాధిపతులను, అధికారులను పిలిచి, “మీరు సోదరుల నుండి వడ్డీ తీసుకుంటున్నారు” అని చెప్పి వారిని గద్దించి, వారి గురించి వెంటనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి,
“యూదేతరులకు అమ్మివేయబడిన మన తోటి యూదులను మా శక్తికొలది మేము విడిపించాము. మీరు మీ సొంత ప్రజలను అమ్ముతున్నారు; వారు మరలా మనకు అమ్మబడవచ్చా?” అని అడిగినప్పుడు వారేమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు.
నేను ఇంకా మాట్లాడుతూ, “మీరు చేస్తున్న పని సరియైనది కాదు. యూదేతరులైన శత్రువుల నిందలు తప్పించుకోడానికి మన దేవునికి భయపడకుండా నడుచుకుంటారా?
నేను, నా సోదరులు నా పనివారు కూడా ప్రజలకు డబ్బు ధాన్యం అప్పుగా ఇచ్చాము. కాని ఆ అప్పులన్నీ రద్దు చేస్తున్నాము.
ఈ రోజే మీరు వారి దగ్గర నుండి తీసుకున్న పొలాలు, ద్రాక్షతోటలు, ఒలీవతోటలు, ఇల్లు వారికి తిరిగి ఇచ్చేయండి. అలాగే వారి నుండి వసూలు చేసిన వడ్డీ డబ్బులు ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో నూనెలో ఒక శాతం వారికి అప్పగించండి” చెప్పాను.
అందుకు వారు, “మేము అన్ని తిరిగి ఇచ్చేస్తాము. వారి నుండి ఇక ఏమి ఆశించము. నీవు చెప్పినట్లే చేస్తాం” అన్నారు. అప్పుడు నేను యాజకులను పిలిపించి వారు చేసిన వాగ్దానం ప్రకారం చేస్తామని చెప్పి సంస్థానాధిపతులతో, అధికారులతో ప్రమాణం చేయించాను.
నేను కూడా నా బట్టలు దులిపి వారితో, “ఈ విధంగా దేవుడు తమ వాగ్దానాన్ని నెరవేర్చి వారందరిని వారి ఇళ్ళ నుండి ఆస్తినుండి దులిపి వేస్తారు. అప్పుడు వాడు ఏమి లేనివానిగా అవుతాడు” అని చెప్పాను. అప్పుడు అక్కడ సమావేశమైన వారంతా ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా తమ వాగ్దానం ప్రకారం చేశారు.
వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు; నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు. వీటిని చేసేవారు ఎన్నటికి కదిలించబడరు.
పేదవాని నుండి వడ్డిచేత గాని లేదా లాభంచేత గాని ఆస్తి పెంచుకొనువాడు పేదవారి పట్ల దయ చూపే మరొకరికి దాన్ని కూడ పెడుతున్నాడు.
అయ్యో, నా తల్లీ, దేశమంతటితో పోరాటాలు, కలహాలు పెట్టుకునేవానిగా, నీవు నాకు జన్మనిచ్చావు! నేను అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదు, అయినా ప్రతిఒక్కరు నన్ను శపిస్తున్నారు.
వడ్డీకి అప్పు ఇవ్వడు వారి నుండి లాభం తీసుకోడు. తప్పు చేయకుండా జాగ్రత్తపడతాడు సత్యంగా న్యాయం తీరుస్తాడు.
అతడు వడ్డీలకు అప్పు ఇచ్చి లాభం తీసుకుంటాడు. అలాంటివాడు బ్రతుకుతాడా? అతడు బ్రతకడు! ఎందుకంటే అతడు ఈ అసహ్యమైన పనులన్నీ చేశాడు కాబట్టి, అతనికి మరణశిక్ష విధించబడుతుంది; తన మరణానికి అతడే బాధ్యుడు.
అతడు పేదల పట్ల తప్పుగా ప్రవర్తించడు, వారి నుండి వడ్డీని గాని లాభాన్ని గాని తీసుకోడు. అతడు నా చట్టాలను అనుసరించి నా శాసనాలను పాటిస్తాడు. అతడు తన తండ్రి చేసిన పాపం కారణంగా మరణించడు కాని ఖచ్చితంగా బ్రతుకుతాడు.