Skip to content

Unbelief గురించి బైబిల్ వచనాలు

208 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు సర్పం, “మీరు ఖచ్చితంగా చావరు.

  2. మీరు అది తింటే మీ కళ్లు తెరవబడతాయని, మీరు దేవునిలా అవుతారని, మంచిచెడులు తెలుసుకుంటారని దేవునికి తెలుసు” అని చెప్పింది.

  3. స్త్రీ ఆ చెట్టు పండు తినడానికి మంచిది, చూడటానికి బాగుంది, తింటే జ్ఞానం వస్తుందని తలంచి, దానిలో కొంచెం తిని, తన భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు.

  4. అందుకు మోషే, “ఒకవేళ వారు నన్ను నమ్మకుండ లేదా నేను చెప్పేది వినకుండ, ‘యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు’ అని అంటే ఎలా?” అన్నాడు.

  5. అయితే మోషే, “నేను ఆరు లక్షలమంది పాదాచారుల మధ్య ఉన్నాను, మీరేమో, ‘నేను వారికి నెలరోజులు తినడానికి సరిపడే మాంసం ఇస్తాను!’ అని అన్నారు.

  6. ఉన్న పశువులు, మందలు అన్నిటిని వధించినా వీరికి సరిపోతుందా? సముద్రంలో చేపలన్నీ పట్టినా వీరికి సరిపోతాయా?”

  7. యెహోవా మోషేకు జవాబిస్తూ, “యెహోవా బాహుబలం తక్కువయ్యిందా? నేను చెప్పింది జరుగుతుందో లేదో నీవు చూస్తావు” అని అన్నారు.

  8. అయితే యెహోవా మోషే అహరోనులతో, “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నా పరిశుద్ధతను ఘనపరచడానికి నన్ను నమ్మలేదు కాబట్టి మీరు ఈ సమాజాన్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్లరు” అని అన్నారు.

  9. ఇవి మెరీబా జలాలు. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోవాతో గొడవపడ్డారు, యెహోవా తన పరిశుద్ధతను నిరూపించుకున్నారు.

  10. యెహోవా మిమ్మల్ని కాదేషు బర్నియాలో నుండి పంపిస్తున్నప్పుడు ఆయన మీతో, “మీరు వెళ్లి నేను మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి” అని చెప్పారు. కాని మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞకు తిరుగుబాటు చేశారు. మీరు ఆయనను నమ్మలేదు, లోబడలేదు.

  11. ఇశ్రాయేలు నీళ్ల కంటే దమస్కులో ఉన్న అబానా, ఫర్పరు నదుల నీళ్లు మంచివి కావా? నేను వాటిలో కడుక్కుని పవిత్రపరచబడనా?” అని అంటూ ఆగ్రహంతో వెనుకకు తిరిగి వెళ్లాడు.

  12. రాజు ఏ అధిపతి చేతి మీద ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి దైవజనునితో, “చూడండి, యెహోవా ఆకాశంలో కిటికీలు తెరచినా కూడా, ఇది జరగుతుందా?” అని అన్నాడు. అందుకు ఎలీషా, “నీవు నీ సొంత కళ్లతో చూస్తావు కాని, దానిలో ఏమీ తినవు” అన్నాడు.

  13. అయితే వారు వినలేదు, తమ దేవుడైన యెహోవాపై నమ్మకముంచని తమ పూర్వికుల్లా మొండిగా ఉన్నారు.

  14. వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు; వారు, “ఈ ఎడారిలో దేవుడు మనకు భోజనం సరఫరా చేయగలడా?

  15. నిజమే, ఆయన బండరాయిని కొట్టారు, నీరు బయటకు వచ్చింది, ప్రవాహాలు సమృద్ధిగా ప్రవహించాయి, కాని ఆయన మనకు రొట్టె కూడా ఇవ్వగలరా? ఆయన తన ప్రజలకు మాంసం అందించగలడా?” అన్నారు.

  16. యెహోవా వారి మాట విని కోపగించారు; ఆయన అగ్ని యాకోబుకు వ్యతిరేకంగా రగులుకొంది, ఆయన ఉగ్రత ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా లేచింది.

  17. ఎందుకంటే వారు దేవునిలో విశ్వాసముంచలేదు. ఆయన ఇచ్చే విడుదలలో నమ్మకముంచలేదు.

  18. ఇంత జరిగినా వారింకా పాపం చేస్తూనే ఉన్నారు; ఆయన అద్భుతాలు చేస్తున్నా వారు నమ్మలేదు.

  19. “మీరు మెరీబా దగ్గర చేసినట్టుగా, అరణ్యంలో మస్సా దగ్గర చేసినట్టుగా మీ హృదయాలను కఠినం చేసుకోకండి.

  20. అక్కడ మీ పూర్వికులు నన్ను సందేహించారు; నేను చేసిన కార్యాలు వారు చూసి కూడా నన్ను పరీక్షించారు.

  21. నలువది సంవత్సరాలు నేను ఆ తరం వారిపై కోప్పడి ఇలా అన్నాను: ‘వారు హృదయాలు పెడత్రోవ పట్టిన ప్రజలు, వారు నా మార్గాలను తెలుసుకోలేదు’

  22. కాబట్టి, ‘వారు ఎన్నడు నా విశ్రాంతిలో ప్రవేశింపరు’ అని నేను కోపంలో ప్రమాణం చేశాను.”

  23. మా పూర్వికులు ఈజిప్టులో ఉన్నప్పుడు నేను చేసిన అద్భుతాలను గ్రహించలేదు; మీ దయాసమృద్ధిని వారు తలపోయ లేదు, ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేశారు.

  24. మనోహరమైన దేశాన్ని వారు తిరస్కరించారు; వారాయన మాట నమ్మలేదు.

  25. అందుకు ఆయన, “నీవు వెళ్లి ఈ ప్రజలతో ఇలా చెప్పు: “ ‘మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు, కాని అర్థం చేసుకోరు; ఎప్పుడు చూస్తూనే ఉంటారు, కాని గ్రహించరు.’