Skip to content

The Sun గురించి బైబిల్ వచనాలు

76 వచనాలు · 45 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు మబ్బులు లేని ఉదయాన సూర్యోదయపు వెలుగులాంటివాడు, వాన వెలిసిన తర్వాతి వచ్చే తేజస్సులాంటివాడు; అది భూమి నుండి గడ్డిని మొలిపిస్తుంది.’

  2. ఆ బాలుడు పెరిగిన తర్వాత ఒక రోజు కోత కోసేవారి దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరకు వెళ్లాడు.

  3. అకస్మాత్తుగా అతడు తన తండ్రితో, “నా తల! నా తల!” అన్నాడు. అతని తండ్రి తన సేవకులలో ఒకనితో, “బాలున్ని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లు” అని చెప్పాడు.

  4. సేవకుడు బాలున్ని ఎత్తుకుని అతని తల్లి దగ్గరకు తీసుకెళ్లాడు, బాలుడు ఆమె ఒడిలో మధ్యాహ్నం వరకు కూర్చుని ఆ తర్వాత చనిపోయాడు.

  5. అందుకు యెషయా, “యెహోవా చెప్పిన మాట నెరవేరుస్తారని ఆయన నీకు ఇచ్చిన సూచన ఇదే: గడియారం మీద నీడ పది అంకెలు ఇప్పుడు ముందుకు వెళ్లాలా లేదా వెనుకకు వెళ్లాలా?” అన్నాడు.

  6. అప్పుడు యెషయా ప్రవక్త యెహోవాకు ప్రార్ధించాడు. ఆహాజు చేయించిన గడియారపు పలక మీద నీడ పది అంకెలు వెనుకకు పోయేటట్టు యెహోవా చేశారు.

  7. అంతకుముందు యూదా పట్టణాల్లో, యెరూషలేము చుట్టూ క్షేత్రాల్లో ధూపం వేయడానికి యూదా రాజులు నియమించిన విగ్రహాల పూజారుల బృందాన్ని అతడు తొలగించాడు. వారు బయలుకు, సూర్యునికి, చంద్రునికి, నక్షత్ర సమూహాలన్నిటికి వేసేవారు.

  8. యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను అతడు యెహోవా ఆలయ ద్వారం నుండి తొలగించాడు. అవి నాతాన్-మెలెకు అనే అధికారి గదికి సమీపంలో ఉన్న ఆవరణంలో ఉన్నాయి. యోషీయా సూర్యునికి అంకితం చేయబడిన రథాలను కాల్చివేశాడు.

  9. అతడు యూదాలోని ప్రతి పట్టణంలోని ఉన్నత క్షేత్రాలను, ధూపవేదికలను తొలగించాడు. అతని పరిపాలనలో దేశం ప్రశాంతంగా ఉంది.

  10. అతని ఆదేశాల మేరకు ప్రజలు బయలు బలిపీఠాలను పడగొట్టారు. వాటికి పైగా ఉన్న ధూపవేదికలను సూర్యదేవతా విగ్రహాలను అతడు కూలగొట్టించాడు. అషేరా స్తంభాలను, చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను ముక్కలు చేయించాడు. వాటిని చూర్ణం చేయించి, వాటికి బలులర్పించినవారి సమాధుల మీద చల్లివేశాడు.

  11. ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.

  12. నేను నల్లబడతాను, కాని సూర్యుని ద్వారా కాదు; నేను సమాజంలో నిలబడి సహాయం కోసం మొరపెడతాను.

  13. సూర్యుడు తన మంటపంలో నుండి బయటకు వస్తున్న పెండ్లికుమారునిలా, తన పందెం పరుగెత్తడంలో ఆనందిస్తున్న వీరునిలా వస్తున్నాడు.

  14. ఆకాశంలో ఒక చివర ఉదయించి మరొక చివర వరకు దాని చుట్టూ తిరిగి వస్తాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.

  15. ఆసాపు కీర్తన. దేవుడైన యెహోవా, బలాఢ్యుడు, భూమితో మాట్లాడతారు, సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు వారందరిని పిలుస్తారు.

  16. పగలు మీదే. రాత్రి కూడా మీదే. వెలిగే నక్షత్రాలు మీవే! సూర్యున్ని మీరే చేశారు.

  17. యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు; యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు; నిందారహితులుగా నడుచుకునే వారికి ఆయన ఏ మేలు చేయకుండ మానరు.

  18. రుతువుల్ని సూచించడానికి ఆయన చంద్రుని చేశారు, ఎప్పుడు అస్తమించాలో సూర్యునికి తెలుసు.

  19. సూర్యోదయం నుండి అస్తమించే చోటు వరకు, యెహోవా నామం స్తుతింపబడును గాక.

  20. పగటివేళ సూర్యుడు కాని లేదా, రాత్రివేళ చంద్రుడు కాని మీకు హాని చేయరు.

  21. పగటిని ఏలడానికి సూర్యుని చేసింది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.

  22. సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి. మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి.

  23. వెలుగు ఆహ్లాదకరమైనది, సూర్యుని చూడడం కళ్లకు సంతోషాన్ని ఇస్తుంది.

  24. నల్లపిల్ల అని చెప్పి నన్నిలా తేరిచూస్తారేమి? ఎండకు నేను నల్లగా అయ్యాను. నా తల్లి కుమారులకు నా మీద కోపం నన్ను ద్రాక్షతోటను కావలి కాయడానికి పెట్టారు; అందుకే నా సొంత ద్రాక్షతోటను కాయలేక పోయాను.

  25. తెల్లవారుజాములా, జాబిల్లిలా అందంగా, సూర్యునిలా ప్రకాశవంతంగా, నక్షత్రాల్లా గంభీరంగా కనిపించే ఈమె ఎవరు?