- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
The First Temple గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
సమృద్ధిగా దహనబలి పశువుల సమాధానబలుల ఉన్నాయి, దానితో పాటు దహనబలుల క్రొవ్వు దహనబలులతో పాటు పానార్పణలు ఉన్నాయి. ఆ విధంగా యెహోవా మందిరంలో సేవ మళ్ళీ ప్రారంభించడం జరిగింది.
యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు నిత్యం ఉంటుంది” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు.
యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు.
అతడు చెక్కించిన విగ్రహాన్ని ఆ ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.
యోషీయా పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో దేశాన్ని, మందిరాన్ని పవిత్రం చేద్దామని తన దేవుడైన యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణ అధిపతియైన మయశేయా, లేఖికుడును యోవాహాజు కుమారుడునైన యోవాహును పంపాడు.
వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, అంతకుముందు దేవుని ఆలయానికి తెచ్చిన డబ్బును అతనికి అప్పగించారు. ఆ డబ్బును మనష్షేవారు, ఎఫ్రాయిమీయుల, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారందరు, యూదా వారు, బెన్యామీనీయులు, యెరూషలేము నగరవాసులు ఇస్తూ ఉంటే, ద్వారపాలకులైన లేవీయులు దానిని జమచేశారు.
అప్పుడు వారు ఆ డబ్బును యెహోవా మందిర పనులు చేయించడానికి నియమించబడిన మనుష్యులకు అప్పచెప్పారు. వారు మందిరాన్ని మరమ్మతు చేస్తూ బాగుచేస్తున్న వారికి ఆ డబ్బును జీతంగా ఇచ్చారు.
వారు యూదా రాజులు పాడుచేసిన భవనాలకు చెక్కిన రాళ్లు, చెక్కలు, దూలాలను కొనడానికి, వడ్రంగి వారికి, నిర్మించేవారికి ఆ డబ్బు ఇచ్చారు.
ఆ మనుష్యులు నమ్మకంగా పని చేశారు. వారితో పని చేయించడానికి నియమించబడిన వారెవరంటే, మెరారీయులైన లేవీయులు యహతు, ఓబద్యా, కహాతు వంశంవారు జెకర్యా, మెషుల్లాము. పని చేయించడానికి నియమించబడిన లేవీయులందరు వాయిద్యాలు వాయించడంలో నైపుణ్యం కలవారు.
వారు బరువులు మోసేవారి మీద, ప్రతి విధమైన పని చేసేవారి మీదా తనిఖీదారులుగా ఉన్నారు. లేవీయులలో కొంతమంది లేఖికులుగా, కార్యదర్శులుగా, ద్వారపాలకులుగా సేవ చేసేవారు.
అతడు యెహోవా మందిరం నుండి పెద్దవి చిన్నవి అని తేడా లేకుండా అన్ని వస్తువులను, యెహోవా మందిరం నిధులు, రాజు నిధులు, అతని అధికారుల నిధులన్నింటిని బబులోనుకు తీసుకెళ్లాడు.
వారు దేవుని ఆలయానికి నిప్పంటించి యెరూషలేము గోడలను పడగొట్టారు; వారు రాజభవనాలన్నిటిని తగలబెట్టి, అక్కడ విలువైన ప్రతీదానిని నాశనం చేశారు.
మీ స్వాస్థ్య గోత్రాన్ని మీరు పూర్వం సంపాదించుకుని విమోచించిన మీ వారసత్వ సమాజాన్ని, మీరు నివసించిన సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి.
సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన. సైన్యాల యెహోవా, మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో!
యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని, నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది; సజీవుడైన దేవుని కోసం నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి.
సైన్యాల యెహోవా, నా రాజా నా దేవా, మీ బలిపీఠం దగ్గరే, పిచ్చుకలకు నివాసం దొరికింది, వాన కోయిలకు గూడు దొరికింది, అక్కడే అది తన పిల్లలను పెంచుతుంది.
మీ మందిరంలో నివసించేవారు ధన్యులు; వారు నిత్యం మిమ్మల్ని స్తుతిస్తారు. సెలా
మీ నుండి బలం పొందే మనుష్యులు ధన్యులు, వారి హృదయాలు సీయోనుకు వెళ్లే రహదారుల మీదే ఉంటాయి.
వారు బాకా లోయ గుండా వెళ్తున్నప్పుడు, వారు దానిని ఊటల ప్రదేశంగా మారుస్తారు; తొలకరి వాన దానిని ఆశీర్వాదాలతో కప్పివేస్తుంది.
వారిలో ప్రతిఒక్కరు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడే వరకు వారి బలం అధికమవుతుంది.
అతడు యెహోవాకు ప్రమాణం చేశాడు, యాకోబు యొక్క బలవంతునికి మ్రొక్కుబడి చేశాడు:
“యెహోవాకు నేను ఒక స్థలం కనుగొనేవరకు, యాకోబు యొక్క బలవంతునికి ఒక నివాసస్థలం చూచే వరకు, నేను నా ఇంట్లోకి ప్రవేశించను, నా మంచం మీద పడుకోను, నా కళ్ళకు నిద్ర లేదా నా కనురెప్పలకు కునుకు రానివ్వను.”
I will not give sleep to mine eyes, or slumber to mine eyelids,
Until I find out a place for the LORD, an habitation for the mighty God of Jacob.
చివరి రోజుల్లో యెహోవా మందిరం పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, జనాంగాలన్నీ దాని దగ్గరకు ప్రవాహంలా వెళ్తారు.