The First Temple గురించి బైబిల్ వచనాలు: Being a man of war not permitted to build
Being a man of war not permitted to build గురించి వచనాలు
“నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు: ‘యెహోవా చెప్పే మాట ఇదే: నేను నివసించడానికి ఒక మందిరాన్ని కట్టించేది నీవా?
ఈజిప్టు నుండి నేను ఇశ్రాయేలీయులను తీసుకువచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నేను మందిరంలో నివసించలేదు. గుడారంలో నివసిస్తూ ఒకచోట నుండి మరో చోటికి తిరుగుతున్నాను.
ఇశ్రాయేలీయులందరితో నేను ఎక్కడికి వెళ్లినా, నా ఇశ్రాయేలు ప్రజలను కాయుమని నేను ఆజ్ఞాపించిన వారి పాలకుల్లో ఎవరితోనైనా, “నా కోసం దేవదారు కర్రలతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు” అని అడిగానా?’
“కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.
నీవెక్కడికి వెళ్లినా నేను నీకు తోడుగా ఉండి, నీ ఎదుట నిలబడకుండా నీ శత్రువులందరిని నాశనం చేశాను. ఇప్పుడు భూమి మీద ఉన్న గొప్పవారికున్న పేరులాంటి గొప్ప పేరు నీకు ఇస్తాను.
“యెహోవా, నా తండ్రియైన దావీదు శత్రువులను అతని పాదాల క్రింద అణచే వరకు అతడు అన్ని వైపుల నుండి యుద్ధాలు చేశాడు. కాబట్టి అతడు తన దేవుడైన యెహోవా నామం కోసం ఒక దేవాలయాన్ని కట్టలేకపోయాడు.
అయితే యెహోవా మాట నాతో ఇలా చెప్పింది: ‘నీవు చాలా రక్తం చిందించి, చాలా యుద్ధాలు చేశావు. నా ఎదుట నీవు నేల మీద చాలా రక్తాన్ని చిందించావు, కాబట్టి నీవు నా పేరిట మందిరాన్ని కట్టించకూడదు.