కంటెంట్‌కు వెళ్లండి

The Christ Jesus గురించి బైబిల్ వచనాలు: Worship of Jesus

19 వచనాలు · 25 కోణాలు

"The Christ Jesus" కోసం వెతకండి

Worship of Jesus గురించి వచనాలు

  1. “ఎవరి పక్షం కాను, అయితే నేనిప్పుడు యెహోవా సేనాధిపతిగా వచ్చాను” అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. అప్పుడు యెహోషువ భక్తితో నేలమీద బోర్లపడి, “నా ప్రభువు తన సేవకునికి ఏమి సందేశం ఇస్తారు?” అని అడిగాడు.

  2. అందుకు యెహోవా సేనాధిపతి యెహోషువతో, “నీవు నిలబడిన స్ధలం పవిత్రమైనది, కాబట్టి నీ చెప్పులు తీసివేయి” అని చెప్పగానే యెహోషువ అలాగే చేశాడు.

  3. ఆ పదకొండు మంది శిష్యులు యేసు తమకు చెప్పినట్లే, గలిలయలోని కొండకు వెళ్లారు.

  4. వారు ఆయనను చూసినప్పుడు, ఆయనను ఆరాధించారు గాని కొందరు సందేహించారు.

  5. వాడు యేసును దూరం నుండి చూసి, పరుగెత్తుకొని వెళ్లి ఆయన ముందు మోకరించాడు.

  6. వాడు బిగ్గరగా కేకలువేస్తూ, “సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? దేవుని పేరట నన్ను వేధించవద్దు నిన్ను వేడుకొంటున్నాను!” అని అన్నాడు.

  7. ఆయన ముందు వెళ్లేవారు, ఆయనను వెంబడిస్తున్న వారు బిగ్గరగా, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!”

  8. “రానైయున్న మన పితరుడైన దావీదు రాజ్యం ధన్యమవును గాక!” “సర్వోన్నతమైన స్థలాల్లో హోసన్నా!” అని కేకలు వేశారు.

  9. వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు.

  10. తర్వాత అతడు మోకరించి, “ప్రభువా, ఈ పాపాన్ని వీరి మీద మోపకు” అని మొరపెట్టాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత, అతడు నిద్రించాడు.

  11. దీన్ని నా నుండి తీసివేయమని నేను మూడుసార్లు ప్రభువుకు మనవి చేశాను.

  12. అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండేలా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను.

  13. యేసు నామమున ప్రతివారి మోకాలు వంగునట్లు, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను,

  14. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.

  15. ఆయన ఆ గ్రంథపుచుట్టను తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులు, ఆ ఇరవైనలుగురు పెద్దలు వధించబడిన ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరు తంతి వీణను పరిశుద్ధుల ప్రార్థనలనే ధూపంతో నిండిన బంగారు గిన్నెలను పట్టుకున్నారు.

  16. వారు ఒక క్రొత్త పాటను పాడారు, “చుట్టబడి ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకుని, దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు! ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి, ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను, దేవుని కోసం విడిపించడానికి నీవు వధించబడి నీ రక్తంతో కొన్నావు.

  17. వారు పెద్ద స్వరంతో ఇలా అంటున్నారు: “శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, గౌరవం, మహిమ, స్తుతులను పొందడానికి యోగ్యుడు వధించబడిన గొర్రెపిల్లయే!”

  18. అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టించబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను: “సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి, వధించబడిన గొర్రెపిల్లకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం,

  19. ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని చెప్పాయి, అప్పుడు ఆ పెద్దలందరు సాగిలపడి ఆరాధించారు.