కంటెంట్‌కు వెళ్లండి

The Christ Jesus గురించి బైబిల్ వచనాలు: Exaltation of

19 వచనాలు · 25 కోణాలు

Exaltation of గురించి వచనాలు

  1. నన్ను అడిగితే, నేను దేశాలను నీకు స్వాస్థ్యంగా, భూమి అంచుల వరకు ఆస్తిగా ఇస్తాను.

  2. ఇనుపదండంతో నీవు వారిని నలగ్గొడతావు; పగిలిన కుండలా వారిని ముక్కలుగా చేస్తావు.”

  3. గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.

  4. ఈ మహిమగల రాజు ఎవరు? శక్తిమంతుడు బలశాలియైన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా.

  5. గుమ్మాల్లారా! మీ తలలు పైకెత్తండి; మహిమగల రాజు ప్రవేశించేలా పురాతన ద్వారాల్లారా! పైకి లేవండి.

  6. ఈ మహిమగల రాజు ఎవరు? సైన్యాలకు అధిపతియైన యెహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు. సెలా

  7. అతడు వెళ్లిపోయిన తర్వాత యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పొందాడు, అలాగే దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు.

  8. దేవుడు కుమారునిలో మహిమపరచబడినట్లైతే దేవుడు తనలో ఆయనను మహిమపరుస్తారు. వెంటనే కుమారుని మహిమపరుస్తారు.

  9. దేవుని కుడిచేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీమీద కుమ్మరించారు.

  10. దావీదు పరలోకానికి ఎక్కి పోలేదు అయినా ఇలా చెప్పాడు, “ ‘నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చేసే వరకు

  11. మీ కోసం నియమించిన క్రీస్తును అనగా యేసును ఆయన పంపవచ్చు.

  12. దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా ముందే వాగ్దానం చేసినట్లుగా, దేవుడు సమస్తాన్ని పునరుద్ధరించడానికి సమయం వచ్చేవరకు, పరలోకం ఆయనను చేర్చుకోవల్సిందే.

  13. కానీ స్తెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశం వైపు తన తలనెత్తి దేవుని మహిమను, దేవుని కుడిచేతి వైపున యేసు నిలబడి ఉండడం చూశాడు.

  14. అతడు వారితో, “చూడండి! నేను పరలోకం తెరవబడి ఉండడం, మనుష్యకుమారుడు దేవుని కుడిచేతి వైపున నిలబడి ఉండడం నేను చూస్తున్నాను” అని చెప్పాడు.

  15. అందువల్ల దేవుడు ఆయనను ఉన్నత స్థానానికి హెచ్చించి అన్ని నామముల కంటే పై నామాన్ని ఆయనకిచ్చారు,

  16. యేసు నామమున ప్రతివారి మోకాలు వంగునట్లు, పరలోకమందును భూమి మీదను భూమి క్రిందను,

  17. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటుంది, తండ్రియైన దేవునికి మహిమ కలుగును గాక.

  18. అయితే ఈ యాజకుడు పాపాల కోసం అన్ని కాలాలకు ఒకే ఒక బలిని అర్పించి, దేవుని కుడి ప్రక్కన కూర్చున్నాడు,

  19. ఆ సమయం నుండి తన శత్రువులు తన పాదపీఠంగా చేయబడేవరకు ఆయన అక్కడ వేచి ఉంటాడు.