Skip to content

Syria గురించి బైబిల్ వచనాలు

235 వచనాలు · 61 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దమస్కు ద్వారాన్ని విరగ్గొడతాను; ఆవెను లోయలో ఉన్న రాజును నాశనం చేస్తాను అతడు బేత్-ఏదెనులో రాజదండం పట్టుకున్నవాడు. అరాము ప్రజలు కీరుకు బందీలుగా వెళ్తారు” అని యెహోవా చెప్తున్నారు.

  2. ప్రవచనం: హద్రాకు దేశం గురించి దమస్కు పట్టణం గురించి వచ్చిన యెహోవా వాక్కు: మనుష్యులందరి కళ్లు, ఇశ్రాయేలు గోత్రాలన్నిటి కళ్లు యెహోవా మీద ఉన్నాయి.

  3. ఆయన గురించి సిరియా దేశమంతటా తెలిసి ప్రజలు రకరకాల వ్యాధులతో, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నవారిని, దయ్యాలు పట్టినవారిని, మూర్ఛ రోగం గలవారిని పక్షవాత రోగులను యేసు దగ్గరకు తీసుకుని రాగా ఆయన వారిని బాగుచేశారు.

  4. (ఇది కురేనియు సిరియా దేశాధిపతిగా ఉన్నప్పుడు తీసిన మొదటి ప్రజాసంఖ్య.)

  5. అందుకు అతడు, “సహోదరులారా తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై,

  6. వారితో ఈ ఉత్తరాన్ని పంపించారు: అపొస్తలులు, మీ సహోదరులైన సంఘపెద్దలు, అంతియొకయలోను, సిరియాలోను, కిలికియ ప్రాంతాల్లో నివసించే యూదేతరులలోని విశ్వాసులకు, శుభములు.

  7. వారు సంఘాలను విశ్వాసంలో బలపరస్తు సిరియా కిలికియ దేశాల గుండా ప్రయాణం చేశారు.

  8. పౌలు మరికొన్ని రోజులు కొరింథీలోనే గడిపాడు. తర్వాత అక్కడి సహోదర సహోదరీల దగ్గర సెలవు తీసుకుని, అకుల ప్రిస్కిల్లతో కలిసి ఓడలో సిరియా దేశానికి వెళ్లాడు. అతడు ప్రయాణానికి ముందు తాను చేసుకొన్న మ్రొక్కుబడి ప్రకారం తన తల వెంట్రుకలను కెంక్రేయలో కత్తిరించుకున్నాడు.

  9. కుప్ర కనపడగా దాని దక్షిణ వైపు నుండి సిరియాకు వెళ్లాము. తూరు పట్టణ తీరాన మేమున్న ఓడలోని సరుకులను దించవలసి వచ్చింది.

  10. ఆ తర్వాత నేను సిరియాకు, కిలికియకు వెళ్లాను.