Skip to content

Serpent గురించి బైబిల్ వచనాలు

49 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారు నాగుపాముల విషాన్ని పీల్చుకుంటారు; పాము కోరలు వారిని చంపుతాయి.

  2. వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు

  3. పాములు ఆడించేవారు ఎంత నైపుణ్యంగా వాయించినా ఆ సంగీతాన్ని వినని పాముల్లా వారున్నారు.

  4. వారు పాము నాలుకలా వారి నాలుకను పదును చేసుకుంటారు; వారి పెదవుల క్రింద సర్పాల విషం ఉంది. సెలా

  5. మద్యం ఎర్రగా ఉన్నప్పుడు, గిన్నెలో తళతళలాడుతూ, గొంతులో పడగానే మంచిగా అనిపిస్తుందేమో అయినా దానివైపు చూడవద్దు!

  6. అంతంలో అది పాములా కరుస్తుంది కట్లపాములా విషం చిమ్ముతుంది.

  7. అవేమనగా ఆకాశాన గ్రద్ద జాడ, బండ మీద పాము జాడ, అగాధ సముద్రంలో ఓడ నడుచు జాడ, పెండ్లికాని స్త్రీతో పురుషుని జాడ.

  8. గొయ్యి త్రవ్వినవారే అందులో పడతారు; గోడను పడగొట్టిన వారే పాము కాటుకు గురవుతారు.

  9. ఒకవేళ లొంగదీయక ముందే పాము కాటేస్తే, పాములు ఆడించేవానికి లాభం ఉండదు.

  10. ఫిలిష్తియా, మిమ్మల్ని కొట్టిన కర్ర విరిగిపోయిందని మీరందరు సంతోషించకండి; సర్పమూలం నుండి విషపూరిత పాము పుడుతుంది, దాని సంతానం ఎగిరే విషసర్పము.

  11. దక్షిణ దేశంలోని జంతువుల గురించి ప్రవచనం: సింహాలు ఆడ సింహాలు, నాగుపాములు ఎగిరే సర్పాలు, కష్టాలు బాధలున్న దేశం గుండా రాయబారులు, గాడిదల వీపుల మీద తమ ఆస్తిని ఒంటెల మూపుల మీద తమ సంపదలను ఎక్కించుకొని తమకు లాభం కలిగించని ఆ దేశానికి,

  12. తోడేలు గొర్రెపిల్ల కలిసి మేస్తాయి, సింహం ఎద్దులా గడ్డి తింటుంది, దుమ్ము సర్పానికి ఆహారమవుతుంది. నా పరిశుద్ధ పర్వతం మీద అవి హానిని గాని నాశనాన్ని గాని చేయవు” అని యెహోవా చెప్తున్నారు.

  13. “చూడండి, నేను మీ మధ్యకు విషసర్పాలను, అదుపు చేయలేని మిడునాగులను పంపుతాను, అవి మిమ్మల్ని కాటేస్తాయి” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  14. వారు కర్మెలు పర్వత శిఖరాన దాక్కున్నా, అక్కడ నేను వారిని వెంటబడి పట్టుకుంటాను. నా కళ్లకు కనిపించకుండా వారు సముద్రపు అడుగుభాగంలో దాక్కున్నా, అక్కడ వారిని కరవమని సర్పానికి ఆజ్ఞ ఇస్తాను.

  15. పాములా, నేల మీద ప్రాకే పురుగులా, వారు ధూళిని నాకుతారు. వారు తమ గుహల్లో నుండి వణకుతూ బయటకు వస్తారు; వారు భయంతో మన దేవుడైన యెహోవా వైపు తిరుగుతారు, నిన్ను బట్టి భయపడతారు.

  16. చేప అడిగితే పాము ఇస్తారా?

  17. “చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి.

  18. తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు; విషం త్రాగినా వారికి ఏ హాని కలుగదు; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగులు స్వస్థత పొందుతారు” అన్నారు.

  19. ఇదిగో, పాములను, తేళ్ళను త్రొక్కడానికి, శత్రు బలమంతటిని జయించడానికి నేను మీకు అధికారం ఇచ్చాను; ఏవి మీకు ఏమాత్రం హాని చేయవు.

  20. అయితే పౌలు తన చేతిని విదిలించి ఆ పామును మంటలో వేశాడు దానివల్ల అతనికి ఎలాంటి హాని కలుగలేదు.

  21. ప్రజలు అతని శరీరం వాపు వస్తుందని లేదా అకస్మాత్తుగా మరణిస్తాడని అనుకున్నారు; కానీ చాలాసేపు చూసిన తర్వాత కూడా అతనికి ఏ ప్రమాదం జరుగకపోవడం చూసి, తమ మనస్సులను మార్చుకొని, ఇతడు ఒక దేవున్ని చెప్పసాగారు.

  22. వారిలో కొందరు శోధించినట్లుగా మనం క్రీస్తును శోధించకూడదు, అలా శోధించినవారు సర్పాల వల్ల చనిపోయారు.

  23. అయితే, సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్లు క్రీస్తులో మీకున్న నిజాయితీ, పవిత్రత నుండి ఏదో ఒక విధంగా మీ మనస్సులు తొలగిపోతాయేమోనని నేను భయపడుతున్నాను.

  24. ఆ గుర్రాల శక్తి వాటి నోటిలో వాటి తోకలలో ఉంది. వాటి తోకలు పాముల్లా తలలు కలిగి మనుష్యులను గాయపర్చేవిగా ఉన్నాయి.