Skip to content

Seals గురించి బైబిల్ వచనాలు

44 వచనాలు · 20 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు, “ఏం తాకట్టు పెట్టాలి?” అని అడిగాడు. ఆమె, “నీ ముద్ర, దాని దారం, నీ చేతిలో ఉన్న కర్ర” అని అన్నది. కాబట్టి అతడు అవి ఆమెకు ఇచ్చి ఆమెతో పడుకున్నాడు, అతని ద్వారా ఆమె గర్భవతి అయ్యింది.

  2. ఆమెను బయటకు తీసుకువచ్చినప్పుడు, ఆమె తన మామకు వార్త పంపి, “ఇవి ఎవరికి చెందినవో ఆ యజమాని ద్వార నేను గర్భవతినయ్యాను” అని అన్నది. ఇంకా ఆమె, “ఈ ముద్ర, దారం, కర్ర ఎవరివో గుర్తుపడ్తారేమో చూడండి” అని అన్నది.

  3. కాబట్టి ఫరో యోసేపుతో, “నేను నిన్ను ఈజిప్టు దేశమంతటికి అధికారిగా ప్రకటిస్తున్నాను” అని అన్నాడు.

  4. ఫరో తన రాజముద్ర ఉంగరం తీసి యోసేపు వ్రేలికి పెట్టాడు. సన్నని నారబట్టలు అతనికి తొడిగించాడు, అతని మెడలో బంగారు గొలుసు వేశాడు.

  5. ముత్యాలు చెక్కేవారు ముద్రను చెక్కినట్లు ఆ రెండు లేతపచ్చ రాళ్లమీద ఇశ్రాయేలు కుమారుల పేర్లు చెక్కాలి. తర్వాత ఆ రాళ్లను బంగారు జరీ చట్రంలోకి ఎక్కించాలి.

  6. “వారి క్రియలు ఎలాంటివో ఆ లెక్క అంతా నా దగ్గరే ఉంది, దాన్ని నిల్వచేసే నా ఖజానాలో భద్రపరచలేదా?

  7. కాబట్టి ఆమె అహాబు పేరున ఉత్తర్వులు వ్రాసి వాటి మీద అతని ముద్రను ముద్రించి, వాటిని నాబోతు నివసించే పట్టణ పెద్దలకు, సంస్థానాధిపతులకు శాసనాలు పంపింది.

  8. “వీటన్నిటిని బట్టి మేము వ్రాతపూర్వకంగా ఒక్క ఖచ్చితమైన ఒప్పందాన్ని చేసుకున్నాము; మా నాయకులు మా లేవీయులు మా యాజకులు దానిపై తమ ముద్రలు వేసి ఆమోదించారు.”

  9. ముద్ర వేసినవారు వీరే: అధిపతి: హకల్యా కుమారుడైన నెహెమ్యా. సిద్కియా,

  10. తర్వాత మొదటి నెల పదమూడవ రోజున రాజ కార్యదర్శులను పిలిపించారు. వారు హామాను ఆజ్ఞలన్నిటిని రాజు సంస్థానాధిపతులకు, సంస్థానాధికారులకు, ఆ సంస్థానాల్లోని ప్రజల అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిలో వారి భాషలో వ్రాసి పంపాలని ఆజ్ఞాపించారు. వాటిని రాజైన అహష్వేరోషు పేరిట వ్రాసి వాటిపై రాజు ఉంగరంతో ముద్ర వేశారు.

  11. రాజు పేరిట వ్రాయబడి అతని ఉంగరంతో ముద్ర వేసిన ఏ తాకీదు రద్దు చేయబడదు. కాబట్టి మీకు నచ్చినట్లు యూదుల పక్షాన రాజు పేరిట మరొక శాసనాన్ని వ్రాసి రాజముద్ర వేయండి.”

  12. ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.

  13. తద్వార మనుష్యులందరు ఆయన కార్యాన్ని తెలుసుకుంటారు, ఆయన ప్రజలందరినీ తమ ప్రయాసం నుండి విరమింపజేస్తారు.

  14. ముద్ర వేయబడిన బంకమట్టిలా భూమి రూపం మారుతుంది; దాని లక్షణాలు వస్త్రం యొక్క లక్షణాల్లా ఉంటాయి.

  15. నా సోదరీ, నా వధువు! నీవు మూసివేయబడిన తోటవు నీవు చుట్టబడిన ఊటవు, మూయబడిన సరస్సువు.

  16. నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా, మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో; ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది, దాని అసూయ సమాధిలా క్రూరమైనది. ఇది మండుతున్న అగ్నిలా, శక్తివంతమైన మంటలా కాలుతుంది.

  17. “నా జీవం తోడు” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “యూదా రాజైన యెహోయాకీము కుమారుడవైన యెహోయాకీనూ, నీవు నా కుడిచేతి ముద్ర ఉంగరంగా ఉన్నా, నేను నిన్ను పీకేస్తాను.

  18. కాబట్టి నేను అనాతోతులో ఉన్న పొలాన్ని నా బంధువైన హనామేలు దగ్గర కొని, అతనికి పదిహేడు షెకెళ్ళ వెండి తూకం వేసి ఇచ్చాను.

  19. నేను క్రయపత్రం వ్రాసి ముద్రవేసి, సాక్షి సంతకం కూడా చేయించి వెండిని తూకం వేయించి ఇచ్చాను.

  20. అప్పుడు కొనుగోలు నియమ నిబంధనలు వ్రాసి ముద్ర వేసిన, ముద్ర వేయని పత్రాలను నేను తీసుకున్నాను.

  21. నేను ఈ పత్రాన్ని నా బంధువు హనామేలు సమక్షంలో, అలాగే పత్రంపై సంతకం చేసిన సాక్షుల సమక్షంలో, కావలివారి ప్రాంగణంలో కూర్చున్న యూదులందరి సమక్షంలో మహశేయా కుమారుడైన నేరియా, అతని కుమారుడైన బారూకుకు ఇచ్చాను.

  22. బెన్యామీను ప్రాంతాల్లోనూ, యెరూషలేము చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ, యూదా పట్టణాల్లోనూ, కొండ సీమల్లోనూ, పడమటి దిగువ కొండ ప్రదేశాల్లోనూ, దక్షిణ ప్రాంతాల్లోనూ పొలాలు వెండి ఇచ్చి కొంటారు, ఒప్పందాలపై సంతకాలు చేస్తారు, కొనుగోలు పత్రాలపై ముద్రలు వేస్తారు, ఎందుకంటే నేను వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.”

  23. ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు.

  24. అయితే దానియేలూ, నీవు ఈ గ్రంథం యొక్క మాటలను అంత్యకాలం వరకు భద్రపరచి ముద్రించు. చాలామంది జ్ఞానం అధికం చేసుకోవడానికి అటూ ఇటూ వెళ్తూ ఉంటారు.”

  25. “ ‘అయితే షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలూ, నీవు నా సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను తీసుకుని నా ముద్ర ఉంగరంలా చేస్తాను, ఎందుకంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను’ ఇదే సైన్యాల యెహోవా వాక్కు.”