Seals గురించి బైబిల్ వచనాలు: What is dear or valued
What is dear or valued గురించి వచనాలు
నన్ను నీ హృదయం మీద ఒక ముద్రలా, మీ చేతికి రాజ ముద్రలా ఉంచుకో; ఎందుకంటే ప్రేమ మరణంలా బలమైనది, దాని అసూయ సమాధిలా క్రూరమైనది. ఇది మండుతున్న అగ్నిలా, శక్తివంతమైన మంటలా కాలుతుంది.
“నా జీవం తోడు” అని యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “యూదా రాజైన యెహోయాకీము కుమారుడవైన యెహోయాకీనూ, నీవు నా కుడిచేతి ముద్ర ఉంగరంగా ఉన్నా, నేను నిన్ను పీకేస్తాను.
“ ‘అయితే షయల్తీయేలు కుమారుడవైన జెరుబ్బాబెలూ, నీవు నా సేవకుడవు. నేను నిన్ను ఎన్నుకున్నాను. కాబట్టి ఆ రోజున నేను నిన్ను తీసుకుని నా ముద్ర ఉంగరంలా చేస్తాను, ఎందుకంటే నేను నిన్ను ఏర్పరచుకున్నాను’ ఇదే సైన్యాల యెహోవా వాక్కు.”