కంటెంట్‌కు వెళ్లండి

Scoffing గురించి బైబిల్ వచనాలు

58 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. రాజు, అతని అధికారుల నుండి ఉత్తరాలు తీసుకుని వార్తాహరులు రాజాజ్ఞ ప్రకారం యూదా, ఇశ్రాయేలు దేశమంతా వెళ్లారు. ఆ ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: “ఇశ్రాయేలు ప్రజలారా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపుకు తిరగండి. అష్షూరు రాజుల చేతిలో నుండి తప్పించుకుని మిగిలి ఉన్న మీ దగ్గరకు ఆయన తిరిగి వస్తారు.

  2. తమ పూర్వికుల దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసిన మీ తల్లిదండ్రుల్లా మీ తోటి ఇశ్రాయేలీయుల్లా ఉండకండి. మీరు చూస్తున్నట్లుగా ఆయన వారిని నాశనానికి అప్పగించారు.

  3. మీ పూర్వికుల్లా మూర్ఖంగా ప్రవర్తించకుండ యెహోవాకు లోబడండి. ఆయన శాశ్వతంగా పవిత్రం చేసి ప్రత్యేకించుకున్న పరిశుద్ధాలయంలోకి రండి. మీ దేవుడైన యెహోవాను సేవించండి, అప్పుడు ఆయన తీవ్రమైన కోపం మీమీద నుండి మళ్ళవచ్చు.

  4. మీరు యెహోవా వైపు తిరిగితే మీ తోటి ఇశ్రాయేలీయులపై మీ పిల్లలపై వారిని బందీలుగా తీసుకువెళ్లిన వారికి కనికరం కలుగుతుంది. వారు ఈ దేశానికి తిరిగి వస్తారు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా దయ కరుణ గలవారు. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ నుండి తన ముఖం త్రిప్పుకోరు.”

  5. వార్తాహరులు జెబూలూను ప్రదేశం వరకు ఎఫ్రాయిం మనష్షేల దేశాల్లోని ప్రతి పట్టణానికి వెళ్లారు. అయితే ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు.

  6. కానీ వారు దేవుని దూతలను ఎగతాళి చేశారు, ఆయన మాటలను తృణీకరించారు, ఆయన ప్రజలపైకి నివారించలేని యెహోవా ఉగ్రత వచ్చేవరకు వారు ఆయన ప్రవక్తలను అపహాస్యం చేశారు.

  7. అయినప్పటికీ వారు దేవునితో, ‘మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి! మీ మార్గాల గురించి తెలుసుకోవాలని మాకు ఆశ లేదు.

  8. మేము ఆయనను సేవించడానికి సర్వశక్తిమంతుడు ఎవరు? మేము ఆయనకు ప్రార్థిస్తే మాకే లాభం కలుగుతుంది?’ అంటారు.

  9. యోబువంటి వారు ఎవరైనా ఉన్నారా? తిరస్కారాన్ని మంచి నీళ్లలా అతడు త్రాగుతున్నాడు.

  10. దుష్టుల సలహాను పాటించక పాపులు కోరుకునే మార్గంలో నిలబడక ఎగతాళి చేసేవారి గుంపుతో కూర్చోక,

  11. “మీ దేవుడు ఎక్కడున్నాడు?” అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు, నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి.

  12. రోజుంతా అదే పనిగా నా విరోధులు, “మీ దేవుడెక్కడ?” అని అంటూ నన్ను గేలి చేస్తూ ఉంటే నా ఎముకలు మరణ బాధ అనుభవిస్తున్నాయి.

  13. “దేవునికి ఎలా తెలుస్తుంది? మహోన్నతునికి ఏదైనా తెలుసా?” అని వారనుకుంటారు.

  14. వారు దేవునికి ప్రతికూలంగా మాట్లాడారు; వారు, “ఈ ఎడారిలో దేవుడు మనకు భోజనం సరఫరా చేయగలడా?

  15. నిజమే, ఆయన బండరాయిని కొట్టారు, నీరు బయటకు వచ్చింది, ప్రవాహాలు సమృద్ధిగా ప్రవహించాయి, కాని ఆయన మనకు రొట్టె కూడా ఇవ్వగలరా? ఆయన తన ప్రజలకు మాంసం అందించగలడా?” అన్నారు.

  16. వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, మహోన్నతుని ప్రణాళికలను తృణీకరించారు.

  17. కాబట్టి ఆయన వారిని వెట్టిచాకిరికి అప్పగించారు; వారు తొట్రిల్లారు సాయం చేసేవాడు ఒక్కడూ లేడు.

  18. “బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు బుద్ధిహీనుని మార్గాలను ప్రేమిస్తారు? ఎగతాళి చేసేవారు ఎన్నాళ్ళు ఎగతాళి చేస్తూ ఆనందిస్తారు? బుద్ధిహీనులు ఎన్నాళ్ళు తెలివిని అసహ్యించుకుంటారు?

  19. మీరు నా సలహాను లెక్కచేయనందున నా గద్దింపును అంగీకరించనందున,

  20. ఎగతాళి చేసేవారిని ఆయన ఎగతాళి చేస్తారు కాని దీనులకు అణగారిన వారికి దయ చూపిస్తారు.

  21. నీవు తెలివి కలిగిన వానివైతే నీ తెలివి వలన నీకే లాభము; జ్ఞానమును ఎగతాళి చేసిన ఎడల దానిని నీవే భరించవలెను.

  22. జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రి క్రమశిక్షణ అంగీకరిస్తాడు, కాని ఎగతాళి చేసేవాడు గద్దింపుకు లోబడడు.

  23. ఎగతాళి చేసేవారు జ్ఞానం వెదకుతారు కాని దొరకదు, అయితే వివేకులకు తెలివి సులభంగా కలుగుతుంది.

  24. పాపానికి సవరణలు చేయడంలో మూర్ఖులు ఎగతాళి చేస్తారు, కాని యథార్థవంతులు ఆయన నుండి దయ పొందుతారు.

  25. హేళన చేయువారికి తీర్పులును బుద్ధిలేని వారి వీపులకు దెబ్బలను ఏర్పాటు చేయబడినవి.