Reasoning గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
యెహోవా అతనితో అన్నారు, “మానవులకు నోరు ఇచ్చింది ఎవరు? వారిని చెవిటివారిగా మూగవారిగా చేసింది ఎవరు? వారికి చూపును ఇచ్చింది, గ్రుడ్డివారిగా చేసింది ఎవరు? యెహోవానైన, నేను కాదా?
మీరు వాటికి నమస్కరించకూడదు పూజింపకూడదు; ఎందుకంటే నేను, మీ దేవుడనైన యెహోవాను, రోషం గల దేవుడను, నన్ను ద్వేషించినవారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల పాపం యొక్క శిక్షను వారి పిల్లల మీదికి రప్పిస్తాను.
ఎందుకంటే ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి, ఏడవ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కాబట్టి యెహోవా సబ్బాతు దినాన్ని ఆశీర్వదించి దానిని పరిశుద్ధం చేశారు.
ఈ రోజు మనం ఇక్కడ చేస్తున్నట్లు మీలో ప్రతిఒక్కరు తమ దృష్టికి సరియైనది అనుకున్న దానిని చేయకూడదు,
అయినా, సర్వశక్తిమంతుడైన దేవునితో మాట్లాడాలని దేవునితోనే వాదించాలని కోరుతున్నాను.
నా మాటలను శ్రద్ధగా వినండి. మీ చెవుల్లో నా మాటలు మారుమ్రోగాలి.
ఇప్పుడు నా వ్యాజ్యెం సిద్ధంగా ఉంది కాబట్టి, నేను నిర్దోషినని రుజువవుతానని నాకు తెలుసు.
ఎవరైనా నాపై ఆరోపణలు చేయగలరా? ఒకవేళ చేయగలిగితే, నేను మౌనంగా ఉండి చనిపోతాను.
దేవా! కేవలం రెండింటిని నాకు అనుగ్రహించండి, అప్పుడు మీ నుండి నేను దాగను.
మీ చేతిని నా మీద నుండి తీసివేయండి, మీ భయంతో నన్ను భయపెట్టకండి.
అప్పుడు నన్ను పిలిస్తే నేను జవాబిస్తాను. నన్ను మాట్లాడనిచ్చి మీరు జవాబివ్వండి.
నేను ఎన్ని దోషాలను పాపాలను చేశాను? నా అతిక్రమాన్ని నా పాపాన్ని నాకు చూపించండి.
ఎందుకు మీ ముఖాన్ని దాచుకుంటున్నారు? ఎందుకు నన్ను శత్రువుగా భావిస్తున్నారు?
గాలికి ఎగిరే ఆకును మీరు వేధిస్తారా? ఎండిన చెత్తను మీరు తరుముతారా?
మీరు నాకు కఠిన శిక్ష విధించారు యవ్వనకాలంలో చేసిన పాపాల ప్రతిఫలం అనుభవించేలా చేశారు.
సంకెళ్ళతో నా కాళ్లు బిగించారు. నా అరికాళ్ల చుట్టూ గీత గీసి, నా ప్రవర్తనంతటిని జాగ్రత్తగా కనిపెడుతున్నారు.
మురిగి కుళ్ళిపోతున్న దానిలా, చిమ్మెటలు కొట్టిన వస్త్రంలా మనిషి నాశనమవుతాడు.
నీ హృదయమంతటితో యెహోవాపై నమ్మకముంచు నీ సొంత తెలివిని ఆధారం చేసుకోవద్దు;
ఒకని ఎదుట సరియైనదిగా కనబడే ఓ మార్గం ఉంది, అయితే చివరికి అది మరణానికి నడిపిస్తుంది.
“రండి, మనం విషయాన్ని పరిష్కరించుకుందాం” అని యెహోవా అంటున్నారు. “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి; కెంపులా ఎర్రగా ఉన్నా, అది ఉన్నిలా తెల్లగా అవుతాయి.
“కాబట్టి యెరూషలేము నివాసులారా, యూదా ప్రజలారా, నాకు, నా ద్రాక్షతోటకు మధ్య న్యాయం చేయండి.
నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే దానికి ఇంకేమి చేయాలి? మంచి ద్రాక్షపండ్ల కోసం నేను చూస్తే ఎందుకు అది చెడ్డ ద్రాక్షలను కాసింది?
నాకు గతంలో జరిగింది గుర్తు చేయి మనం కలిసి వాదించుకుందాం; నిన్ను నీవు నీతిమంతునిగా రుజువు చేసుకో.
నా మానవ బుద్ధి తిరిగి ఇవ్వబడిన ఆ సమయంలోనే, నా రాజ్య మహిమ కోసం నా ఘనత, నా వైభవం నాకు తిరిగి ఇవ్వబడ్డాయి. నా సలహాదారులు, నా ఘనులు నా దగ్గరకు వచ్చారు, నేను నా సింహాసనం మీద మరలా కూర్చున్నాను, మునుపటి కంటే ఇంకా గొప్పవాడిగా అయ్యాను.
ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు వినండి, యెహోవా ఈ దేశ వాసులైన మీమీద నేరం మోపుతున్నారు: “ఈ దేశంలో నమ్మకత్వం, ప్రేమ దేవుని గురించిన జ్ఞానం అనేవి లేవు.