Skip to content

Reasoning గురించి బైబిల్ వచనాలు

59 వచనాలు · 8 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. దీని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసి ఉంటే వారు మహిమా స్వరూపియైన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు.

  2. అయితే దీని గురించి: “ఎవరూ చూడని ఎవరూ వినని ఏ మనుష్యుని మనస్సు ఊహించనివాటిని దేవుడు తనను ప్రేమించేవారి కోసం సిద్ధపరచారు” అని వ్రాయబడి ఉంది.

  3. ఈ విషయాలను దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేశారు. ఆత్మ అన్నిటిని, దేవుని లోతైన సంగతులను కూడ పరిశోధిస్తుంది.

  4. ఎందుకంటే ఒకరి మనస్సులోని ఆలోచనలు వారికి తప్ప మరి ఎవరికి తెలుస్తాయి? అలాగే దేవుని మనస్సులో ఉన్న ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు.

  5. దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని తెలుసుకోవడానికి, మనం ఈ లోక ఆత్మను కాకుండా దేవుని నుండి వచ్చిన ఆత్మనే పొందుకున్నాము.

  6. మానవ జ్ఞానం మాకు నేర్పే మాటలతో కాకుండా, ఆత్మ నేర్పించిన మాటలతోనే మేము మాట్లాడుతున్నాం, ఆ మాటలతోనే ఆత్మీయ సత్యాలను వివరిస్తున్నాము.

  7. అయితే ప్రకృతి సంబంధులైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు, వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కాబట్టి, అవి వారికి వెర్రితనంగా అనిపిస్తాయి; వారు వాటిని గ్రహించలేరు.

  8. నేను తెలివిగల వారితో మాట్లాడుతున్నాను; నేను చెప్పిన దాన్ని మిమ్మల్ని మీరే ఆలోచించండి.

  9. మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీలో ఉన్న నమ్మకాన్ని గురించి ఎవరైనా ప్రశ్నిస్తే, మంచితనంతో గౌరవంతో సమాధానం చెప్పడానికి సిద్ధపడి ఉండండి.