కంటెంట్‌కు వెళ్లండి

Purification గురించి బైబిల్ వచనాలు: Scriptures relating to

60 వచనాలు · 13 కోణాలు

"Purification" కోసం వెతకండి

Scriptures relating to గురించి వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి యాకోబు తన ఇంటివారితో, తనతో ఉన్నవారందరితో అన్నాడు, “మీ దగ్గర ఉన్న ఇతర దేవతలను తీసివేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకోండి.

  2. యెహోవా మోషేతో, “నీవు ప్రజల దగ్గరకు వెళ్లి ఈ రోజు రేపు వారిని ప్రతిష్ఠించు. వారు తమ వస్త్రాలను ఉతుక్కుని,

  3. మోషే పర్వతం నుండి దిగి ప్రజల దగ్గరకు వెళ్లి వారిని పవిత్రపరిచాడు. వారు తమ వస్త్రాలను ఉతుక్కున్నారు.

  4. తర్వాత అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి నీటితో వారిని కడగాలి.

  5. “కడుక్కోడానికి నీవు ఒక ఇత్తడి గంగాళాన్ని, దానికి ఇత్తడి పీటని చేసి సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో పెట్టి దానిలో నీళ్లు పోయాలి.

  6. దానిలో ఉన్న నీళ్లతో అహరోను అతని కుమారులు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి.

  7. వారు సమావేశ గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, వారు నీళ్లతో కడుక్కోవాలి, తద్వారా వారు చావరు. అలాగే, వారు యెహోవాకు హోమబలి అర్పించి సేవ చేయడానికి బలిపీఠాన్ని సమీపించినప్పుడు,

  8. తాము చనిపోకుండా ఉండడానికి వారు తమ చేతులు పాదాలు కడుక్కోవాలి. ఇది అహరోనుకు అతని కుమారులకు తర్వాతి తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.”

  9. “తర్వాత నీవు అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారిని నీటితో కడగాలి.

  10. సమావేశ గుడారానికి బలిపీఠానికి మధ్యలో గంగాళాన్ని ఉంచి, కడుక్కోడానికి దానిలో నీళ్లు పోశాడు.

  11. మోషే అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్లు కడుక్కోడానికి దీనిని ఉపయోగించారు.

  12. వారు సమావేశ గుడారం లోనికి వెళ్లినప్పుడు బలిపీఠాన్ని సమీపించినప్పుడు కడుక్కునేవారు; యెహోవా మోషే ఆజ్ఞాపించిన ప్రకారం మోషే ఇది చేశాడు.

  13. అప్పుడు మోషే, అహరోనును, అతని కుమారులను ముందుకు తెచ్చి నీటితో వారిని కడిగాడు.

  14. “శుద్ధి చేయబడిన వ్యక్తులు తమ బట్టలు ఉతుక్కోవాలి, వారు తమ వెంట్రుకలన్నీ క్షవరం చేయించుకుని నీటితో స్నానం చేయాలి; అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు. దీని తర్వాత వారు శిబిరంలోకి రావచ్చు, కాని వారు తమ గుడారం బయట ఏడు రోజులు ఉండాలి.

  15. ఏడవ రోజున వారు తమ వెంట్రుకలంతా క్షవరం చేయించుకోవాలి; గడ్డం, కనుబొమ్మలు ఇంకా మిగతా వెంట్రుకలు పూర్తిగా క్షవరం చేసుకోవాలి. అలాగే వారు తమ బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. అప్పుడు వారు ఆచారరీత్య పవిత్రులవుతారు.

  16. “ ‘స్రవిస్తున్న వ్యక్తి ఏ పడక మీద పడుకున్నా అది అపవిత్రమవుతుంది, అతడు దేనిపైనా కూర్చున్న అది అపవిత్రమవుతుంది.

  17. అతని పడకను తాకినవారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.

  18. స్రవిస్తున్న వ్యక్తి కూర్చున్న దానిపైన ఎవరు కూర్చున్నా వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.

  19. “ ‘స్రవిస్తున్న వ్యక్తిని ఎవరు తాకినవారు బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.

  20. “ ‘స్రవిస్తున్న వ్యక్తి శుభ్రంగా ఉన్నవారిపై ఉమ్మివేస్తే, వారు బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.

  21. “ ‘స్వారీ చేసేటప్పుడు ఆ వ్యక్తి కూర్చున్నది అపవిత్రమవుతుంది.

  22. అతని క్రింద ఉన్న ఏ వస్తువునైనా తాకినవారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు; ఆ వస్తువులను పైకెత్తినవారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, వారు సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.

  23. “ ‘స్రవిస్తున్న వ్యక్తి నీటితో చేతులు కడుక్కోకుండా ఎవరినైన తాకితే వారు తమ బట్టలు ఉతుక్కోవాలి, నీటితో స్నానం చేయాలి, సాయంత్రం వరకు వారు అపవిత్రులుగా ఉంటారు.

  24. “ ‘ఆ వ్యక్తి తాకిన మట్టికుండను ఖచ్చితంగా పగులగొట్టాలి, అది చెక్క వస్తువైతే దానిని నీటితో కడగాలి.

  25. “ ‘స్రవిస్తున్న వ్యక్తి తన స్రావం నుండి శుద్ధి చేయబడినప్పుడు, అతడు తన శుద్ధీకరణ కోసం ఏడు రోజులు లెక్కించి తన బట్టలు ఉతుక్కోవాలి, మంచి నీటితో స్నానం చేయాలి, అప్పుడు అతడు పవిత్రంగా అవుతాడు.