కంటెంట్‌కు వెళ్లండి

Psalms గురించి బైబిల్ వచనాలు

896 వచనాలు · 16 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా, అవసరంలో ఉన్నవారిని మీరు క్షేమంగా ఉంచుతారు ఈ చెడ్డతరం వారి నుండి నిత్యం కాపాడతారు,

  2. మానవులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు, దుష్టులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు.

  3. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతారు? ఎంతకాలం మీ ముఖాన్ని నా నుండి దాచిపెడతారు?

  4. ఎంతకాలం నా ఆలోచనలతో నేను పెనుగులాడాలి? ఎంతకాలం నా హృదయంలో నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువు నాపై విజయం సాధిస్తాడు?

  5. యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి, నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను.

  6. “మేము అతన్ని ఓడించాము” అని నా శత్రువులు చెప్పుకోనివ్వకండి, నేను పడిపోయినప్పుడు నా శత్రువులను ఆనందించనివ్వకండి.

  7. అయితే నేను మారని మీ ప్రేమను నమ్ముతున్నాను; మీ రక్షణలో నా హృదయం సంతోషిస్తుంది.

  8. యెహోవా నా మీద దయ చూపారు, కాబట్టి నేను ఆయనకు స్తుతి పాడతాను.

  9. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. “దేవుడు లేడు” అని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.

  10. వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా అని యెహోవా పరలోకం నుండి మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.

  11. అందరు దారి తప్పి చెడిపోయారు; మంచి చేసేవారు ఎవరూ లేరు. ఒక్కరు కూడా లేరు.

  12. కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా? వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు; వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు.

  13. వారు అక్కడ, భయంతో మునిగిపోయి ఉన్నారు, ఎందుకంటే దేవుడు నీతిమంతుల గుంపులో ఉన్నారు.

  14. కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు, కాని యెహోవా వారి ఆశ్రయము.

  15. సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది; యెహోవా తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు, యాకోబు సంతోషించును గాక ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!

  16. దావీదు కీర్తన. యెహోవా, మీ పవిత్ర గుడారంలో ఉండగలవారు ఎవరు? మీ పరిశుద్ధ పర్వతంపై నివసించగలవారు ఎవరు?

  17. నిందారహితంగా నడుచుకొనేవారు, నీతిని జరిగించేవారు, తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;

  18. తమ నాలుకతో అపవాదులు వేయనివారు, పొరుగువారికి కీడు చేయనివారు, స్నేహితుల గురించి చెడుగా మాట్లాడనివారు;

  19. నీచులను అసహ్యించుకుని యెహోవాకు భయపడేవారిని గౌరవించేవారు; తమకు బాధ కలిగినా తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకునేవారు, తమ మనస్సు మార్చుకొననివారు;

  20. వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు; నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు. వీటిని చేసేవారు ఎన్నటికి కదిలించబడరు.

  21. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. నా దేవా, నేను మిమ్మల్ని ఆశ్రయించాను, నన్ను కాపాడండి.

  22. యెహోవాతో నేను, “మీరు నా ప్రభువు; మీకు వేరుగా మంచిదేది నా దగ్గర లేదు” అని చెప్తాను.

  23. భూమి మీద ఉన్న పరిశుద్ధ ప్రజల గురించి నేను ఇలా చెప్తాను, “వారు మహనీయులు, వారిలోనే నా ఆనందం అంతా ఉంది.”

  24. వేరే దేవుళ్ళ వెంటపడేవారికి కష్టాలు ఎక్కువవుతాయి. వారి రక్తార్పణలలో నేను పాల్గొనను నా పెదవులతో వారి పేర్లు కూడా పలకను.

  25. యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర. మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు.