Skip to content

Presumption గురించి బైబిల్ వచనాలు

96 వచనాలు · 26 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా దాచడానికి గొప్ప లోతుల్లోకి వెళ్లే వారికి శ్రమ. “మమ్మల్ని ఎవరు చూస్తారు? ఎవరు తెలుసుకుంటారు?” అని అనుకుని, చీకటిలో తమ పనులు చేసేవారికి శ్రమ.

  2. మీరు విషయాలను తలక్రిందులుగా చూస్తారు కుమ్మరిని మట్టితో సమానంగా చూస్తారు! చేయబడిన వస్తువు దానిని చేసినవానితో, “నీవు నన్ను చేయలేదు” అని అనవచ్చా? కుండ కుమ్మరితో, “నీకు ఏమి తెలియదు” అని అనవచ్చా?

  3. దయలేని మనుష్యులు అదృశ్యమవుతారు, హేళన చేసేవారు మాయమవుతారు చెడు చేయడానికి ఇష్టపడేవారందరు,

  4. “మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉండి తనను చేసినవానితో వాదించే వారికి శ్రమ. జిగటమన్ను కుమ్మరితో, ‘నీవు ఏం తయారుచేస్తున్నావు?’ అని అంటుందా? అతని పని అతనితో, ‘కుమ్మరికి నైపుణ్యం లేదు’ అని అంటుందా?

  5. ‘నీవు కన్నది ఏంటి?’ అని తండ్రితో అనే వానికి, ‘నీ గర్భంలో పుట్టింది ఏంటి?’ అని తల్లితో అనే వానికి శ్రమ.

  6. వారంటారు, ‘మేము ఉపవాసం ఉండగా మీరెందుకు చూడరు? మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీరెందుకు గమనించరు?’ “అయినా మీరు ఉపవాసం ఉన్న రోజున మీకు నచ్చినట్లుగా చేశారు మీ పనివారినందరిని దోచుకున్నారు.

  7. వారు, ‘నా దగ్గరకు రావద్దు. దూరంగా ఉండండి, మీకంటే నేను ఎంతో పరిశుద్ధున్ని’ అని అంటారు. అలాంటివారు నా నాసిక రంధ్రాలకు పొగలా, రోజంతా మండే నిప్పులా ఉన్నారు.

  8. ఒకవేళ ప్రవక్త గాని యాజకుడు గాని లేదా ఇంకెవరైనా, ‘ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం’ అని చెప్పినట్లయితే, నేను వారిని వారి ఇంటివారిని శిక్షిస్తాను.

  9. “నేను చాలా ధనవంతుడను; నాకున్న ధనాన్ని బట్టి వారు నాలో ఏ తప్పును కాని పాపాన్ని కాని చూపించలేరు” అని ఎఫ్రాయిం అతిశయిస్తున్నాడు.

  10. అప్పుడు అపవాది ఆయనను పవిత్ర పట్టణానికి తీసుకుని వెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి,

  11. “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదాలకు ఒక్క రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’” అని అన్నాడు.

  12. అందుకు యేసు అతనితో, “ ‘నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు’ అని కూడా వ్రాయబడి ఉంది” అని అన్నారు.

  13. అపవాది ఆయనను యెరూషలేముకు తీసుకెళ్లి అక్కడ దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే, ఇక్కడినుండి క్రిందికి దూకు.

  14. ఎందుకంటే ఇలా వ్రాయబడి ఉంది: “ ‘నిన్ను జాగ్రత్తగా కాపాడడానికి నీ గురించి ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తారు;

  15. నీ పాదాలకు ఒక రాయి తగలకుండ, వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు’ ” అని అన్నాడు.

  16. “అప్పుడతడు, ‘నేను ఇలా చేస్తాను. ఇప్పుడున్న కొట్లను పడగొట్టి, పెద్ద కొట్లను కట్టించి వాటిలో నా ధాన్యాన్ని సమకూర్చుకుంటాను.

  17. నా ఆత్మతో నేను ఇలా అనుకుంటాను, “అనేక సంవత్సరాలకు సరిపడినంత విస్తారమైన ధాన్యం నీకోసం సమకూర్చి ఉంచాను. జీవితాన్ని తేలికగా తీసుకో; తిను, త్రాగు, సంతోషంగా ఉండు” ’ అని అనుకున్నాడు.

  18. “కాని దేవుడు అతనితో, ‘ఓయీ బుద్ధిహీనుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతే, నీకోసం నీవు సిద్ధపరచుకొన్నది ఎవరిదవుతుంది?’

  19. ఆహ్వానించబడిన వారు భోజనబల్ల దగ్గర గౌరవ స్థానాలను ఎంచుకోవడం గమనించి, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు:

  20. “ఎవరైనా మిమ్మల్ని పెళ్ళి విందుకు ఆహ్వానిస్తే గౌరవ స్థానంలో కూర్చోకండి, ఎందుకంటే ఒకవేళ మీకంటే గొప్ప వ్యక్తిని ఆహ్వానించి ఉండవచ్చు.

  21. ఆ అతిథి వచ్చినప్పుడు నిన్ను ఆహ్వానించినవారు నీ దగ్గరకు వచ్చి, ‘మీరు లేచి వీరిని కూర్చోనివ్వండి’ అని అంటే మీరు అవమానంతో ఎక్కడో చివరికి వెళ్లి కూర్చోవలసి వస్తుంది.

  22. అలా కాకుండ, మీరు ఆహ్వానించబడినప్పుడు వెళ్లి చివరి స్థానంలో కూర్చోండి అప్పుడు మిమ్మల్ని ఆహ్వానించినవారు వచ్చి మీతో, ‘స్నేహితుడా, నీవు లేచి ముందున్న గౌరవ స్థానంలో కూర్చో’ అని అంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఇతర అతిథులందరి ముందు నీవు గౌరవించబడతావు.

  23. తమను తాము హెచ్చించుకొనేవారు తగ్గించబడతారు, తమను తాము తగ్గించుకునేవారు హెచ్చింపబడతారు” అన్నారు.

  24. పరిసయ్యుడు నిలబడి తన గురించి ఇలా ప్రార్థించాడు: ‘దేవా, నేను దొంగలు, అన్యాయస్థులు వ్యభిచారుల వంటి ఇతరుల్లా కాని, ఈ పన్నులు వసూలు చేసేవాని వలె కాని లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

  25. నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో పదవ భాగం ఇస్తాను.’