Skip to content

Predestination గురించి బైబిల్ వచనాలు

142 వచనాలు · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాలం సంపూర్ణమైనప్పుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, అనగా పరలోకంలో ఉన్న వాటినే గాని భూమి మీద ఉన్న వాటినే గాని సమస్తాన్ని క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని నిర్ణయించుకొన్నారు.

  2. దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పాన్ని బట్టి, క్రీస్తులో ముందుగా నిరీక్షించిన మనం, తన మహిమకు కీర్తి తీసుకురావాలని నిర్ణయించి, ఆయన మనల్ని తన వారసులుగా ఏర్పరచుకున్నారు.

  3. ఎందుకంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన మంచి క్రియలు చేయడానికి క్రీస్తు యేసునందు సృష్టింపబడిన మనం దేవుని చేతిపనియై ఉన్నాము.

  4. అందుకని దేవుడు తన నిత్య సంకల్పాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నెరవేర్చారు.

  5. కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.

  6. దేవుని ప్రేమను పొందిన సహోదరీ సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఎన్నుకున్నాడనే సంగతి మాకు తెలుసు.

  7. మిమ్మల్ని తన రాజ్యంలోనికి, మహిమలోనికి పిలిచే దేవునికి తగినట్లుగా మీరు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ వేడుకొంటున్నాను.

  8. ప్రభువు ప్రేమించిన సహోదరీ సహోదరులారా, మేము మీ కోసం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీరు రక్షణ పొందడానికి సత్యాన్ని నమ్మడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మ చేత పరిశుద్ధపరచడానికి ప్రారంభం నుండి ఏర్పరచుకున్నారు.

  9. దేవుడు మనల్ని రక్షించి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పిలిచిన పిలుపు, మనం చేసిన మంచి పనులను బట్టి కాదు గాని, ఆయన ప్రణాళిక కృపను బట్టియే. ఆ కృప సృష్టి ఆరంభానికి ముందే క్రీస్తు యేసు మూలంగా మనకు ఇవ్వబడింది,

  10. దేవుని దాసుడును యేసు క్రీస్తు యొక్క అపొస్తలుడనైన పౌలు అనే నేను దేవుడు ఏర్పరచుకున్నవారికి విశ్వాసాన్ని ప్రకటించడానికి, దైవిక జీవితాలను ఎలా జీవించాలో వారికి చూపించే సత్యాన్ని తెలుసుకోవడం నేర్పడానికి,

  11. ఈ సత్యం వారికి అబద్ధమాడని దేవుడు యుగయుగాలకు ముందే వాగ్దానం చేసిన నిత్యజీవాన్ని గురించిన నిరీక్షణతో,

  12. ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.

  13. తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి, మీరు యేసు క్రీస్తుకు విధేయులు కావడానికి ఆయన రక్తం ప్రోక్షణకు ఆయన మిమ్మల్ని ఎన్నుకుని తన ఆత్మ చేత పవిత్రులు చేశారు:

  14. లోకం సృజింపబడక ముందే ఆయన దేవునిచే ఎన్నుకోబడ్డారు కాని మీ కోసం ఈ చివరి కాలాల్లో బయలుపరచబడ్డారు.

  15. కాబట్టి, సహోదరీ సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి కృషి చేయండి. ఒకవేళ మీరు వీటిని చేస్తే ఎప్పుడూ తడబడరు.

  16. ఎవరి గురించి తీర్పు చాలా కాలం క్రితమే వ్రాయబడిందో వారు రహస్యంగా మీ మధ్యలో చొరబడ్డారు. వారు వ్యభిచారంలో జీవించడానికి మన దేవుని కృపను దుర్వినియోగం చేస్తూ, మన ఏకైక సర్వాధికారియైన ప్రభువగు యేసు క్రీస్తును తిరస్కరించిన భక్తిహీనులు.

  17. లోకం సృష్టించబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని పూజిస్తారు.